Audi Ultra Fast EV Charger in Mumbai: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ, ఆడి భారతదేశంలో మొట్టమొదటి అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్‌ను ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఏర్పాటు చేసింది. దీన్ని ఛార్జ్ జోన్ ద్వారా డెవలప్ చేశారు. దీనిలో 450 కేడబ్ల్యూ ఛార్జర్ 500 ఏఎంపీ లిక్విడ్ కూల్డ్ గన్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలకు 360 కేడబ్ల్యూ శక్తిని అందిస్తుంది.
కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం 114 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో కూడిన ఆడి క్యూ8 55 ఈ-ట్రాన్ దేశీయ మార్కెట్లో అతిపెద్ద ప్యాసింజర్ వాహనాల్లో ఒకటి. ఈ అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్‌తో ఈ కారును 26 నిమిషాల్లో 20 శాతం నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
ఈ 'ఈ-ట్రాన్ హబ్' ఆపరేట్ చేయడానికి, గ్రీన్ ఎనర్జీ కోసం పైకప్పుపై సౌరశక్తిని ఉపయోగించారు. దీని కారణంగా ఈవీ ఛార్జింగ్ ప్రక్రియ మరింత స్థిరంగా ఉంటుంది. అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ కోసం అధిక శక్తితో కూడిన గన్స్ ఉపయోగిస్తారు. ఈ-ట్రాన్ యజమానులు, శిక్షణ పొందిన సిబ్బంది సహాయం కోసం ఒక లాంజ్ అందుబాటులో ఉంది. అదనంగా ఈ-ట్రాన్ యజమానులు 'మై ఆడీ కనెక్ట్' ఫీచర్‌ను యాక్సెస్ చేయగలరు. మీరు ఈ యాప్ ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చు.
ఇప్పటివరకు ఆడి ఇండియా భారతదేశంలోని 73 నగరాల్లోని డీలర్‌షిప్‌లు, కొన్ని ఎంపిక చేసిన ప్రదేశాలలో 140 కంటే ఎక్కువ ఛార్జర్‌లను ఇన్‌స్టాల్ చేసింది. ప్రస్తుతం ఆడి ఇండియా భారతదేశంలో ఆరు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. అవి క్యూ8 50 ఈ-ట్రాన్, క్యూ8 55 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ 50 ఈ-ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ 55 ఈ-ట్రాన్, ఈ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఈ-ట్రాన్.
ఇది కాకుండా ఆడి ఇండియా 2024 జనవరి నుంచి భారతీయ మార్కెట్లో తన మొత్తం మోడల్ ధరలను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని కారణంగా ఆడి కార్ల ధర 2024లో రెండు శాతం పెరగవచ్చు. మొదటి తొమ్మిది నెలల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆడి 5,530 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది.
మరోవైపు కియా చాలా కాలం నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు దేశంలో తన కొత్త 5 సీటర్ కారును ప్రవేశపెట్టింది. కంపెనీ 2020లో కియా సోనెట్‌ను మొదటిసారిగా లాంచ్ చేసింది. ఆ తర్వాత ఆ కారుకు చేసిన మొదటి అప్‌డేట్ ఇదే. కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్... హ్యుందాయ్ వెన్యూతో పోటీపడుతుంది. 2023 డిసెంబర్ 20వ తేదీ నుంచి కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ బుకింగ్‌ను కంపెనీ ప్రారంభించనుంది. హెచ్‌టీకే, హెచ్‌టీకే ప్లస్, హెచ్‌టీఎక్స్, హెచ్‌టీఎక్స్ ప్లస్, జీటీకే ప్లస్, ఎక్స్ లైన్, హెచ్‌టీఈ అనే ఏడు వేరియంట్‌లలో కొత్త సోనెట్ అందుబాటులో ఉంటుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!