Ather Diesel Electric Scooter: ఏథర్ ఎనర్జీ త్వరలో తన ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్‌ను విస్తరించనుంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ ప్రస్తుతం మూడు ఈ-స్కూటర్‌లను మాత్రమే అందిస్తోంది. ఇందులో 450ఎస్, 450ఎక్స్, ఇటీవల లాంచ్ అయిన 450 అపెక్స్ ఉన్నాయి. ఇది కాకుండా కంపెనీ కొత్త చవకైన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై కూడా పని చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా దీన్ని చాలాసార్లు పరీక్షించారు. ఇది 2024 మధ్య నాటికి భారత మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.


డీజిల్ అనే పేరుతో...
ఏథర్ లాంచ్ చేయనున్న ఈ-స్కూటర్ పేరు 'డీజిల్'. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాహన తయారీదారుల నుంచి ఇంటర్నల్ కంబస్టన్ ఇంజిన్ (ICE), ముఖ్యంగా డీజిల్ యూనిట్‌లను వదిలివేస్తున్న ఈ యుగంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ల కోసం 'డీజిల్' అనే పేరు పెట్టడం చాలా విచిత్రమైన ఆప్షన్.


కొన్ని వారాల క్రితం ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన తరుణ్ మెహతా తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా కంపెనీ "ఫ్యామిలీ స్కూటర్"పై పనిచేస్తోందని ధృవీకరించారు. సరఫరాదారులతో ఇటీవల జరిగిన సమావేశంలో సీఈవో లార్జ్ స్పేస్, ఫెసిలిటీలపై కంపెనీ ఫోకస్‌ను నొక్కిచెప్పారు. దీన్ని సిటీ ఫ్యామిలీకి ఒక ప్రాక్టికల్ ఆప్షన్‌గా చూస్తున్నారు.


కొత్త ప్లాట్‌ఫారమ్‌పై...
త్వరలో రానున్న ఈ స్కూటర్ కొత్త ప్లాట్‌ఫాంపై రూపొందనుంది. మంచి పెర్ఫార్మెన్స్‌కు పేరు పొందిన ఏథర్ ప్రస్తుత 450 సిరీస్ ప్లాట్‌ఫారమ్‌కు ఇది భిన్నంగా ఉంటుంది. మునుపటి స్పై షాట్‌ల ప్రకారం ఈ స్కూటర్ ప్రస్తుతం ఉన్న ఏథర్ 450ఎస్ కంటే పూర్తిగా భిన్నమైన డిజైన్‌తో వస్తుంది. దీనిలో వైడ్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, సీటు కోసం పెద్ద స్థలం ఉంటుంది.


కంపెనీ లక్ష్యం ఏమిటి?
ఏథర్ దాని రేంజ్‌కి వైవిధ్యాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే స్కూటర్ ప్రాక్టికాలిటీ, యూజర్ కన్వీనెన్స్‌పై దృష్టి పెడుతుంది. ఏథర్ సరఫరాదారులలో ఒకరైన యునో మిండా లిమిటెడ్ రాబోయే స్కూటర్ ప్రాజెక్ట్‌లో భాగమైంది. యునో మిండా ద్ద 2W సెగ్మెంట్ హెడ్ మార్కెటింగ్ గ్లేవియర్ ఎస్‌క్విబెల్ స్కూటర్ ప్రత్యేక ఫీచర్లను హైలైట్ చేశారు. ఇందులో దాని పెద్ద ఫ్యామిలీ సీటు కూడా ఉంది. ప్రస్తుతం ఏథర్ డీజిల్ ఈ-స్కూటర్ గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. లాంచ్ అయినప్పుడు ఇది బజాజ్, టీవీఎస్, హీరో మోటార్‌కార్ప్, ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్‌లతో పోటీపడుతుంది.


మరోవైపు భారతీయ ఆటోమొబైల్ తయారీదారు టాటా కొద్ది రోజుల క్రితం దేశంలో కొత్త పంచ్ ఈవీని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో కొత్త ఫీచర్లతో పాటు డిజైన్, ఇంటీరియర్‌లో అనేక మార్పులు చేశారు. టాటా పంచ్ ఐసీఈ వెర్షన్‌లో కూడా ఇలాంటి మార్పులను తీసుకువచ్చే అవకాశం ఉంది. పంచ్ ఈవీ లాంచ్ సందర్భంగా టాటా మోటార్స్ పంచ్ ఫేస్‌లిఫ్ట్ త్వరలో లాంచ్ చేయనున్న 14 నుంచి 15 నెలల్లో దేశంలో లాంచ్ కానుందని చెప్పవచ్చు. అంటే ఇది 2025 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందన్న మాట.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!