Dr.B.R.Ambedkar Open University Admissions: అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం జనవరి-ఫిబ్రవరి 2024 సెషన్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్), డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. ఆసక్తి, సరైన అర్హతలున్నవారు జనవరి 31లోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తిచేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు. మరిన్ని వివరాలకు 7382929570/580/590/600, 040-23680290/ 291/294/295 నంబర్లలో సంప్రదించవచ్చు.
కోర్సుల వివరాలు..
➥ డిగ్రీ కోర్సులు
- బీఏ
- బీకామ్
- బీఎస్సీ
- బీఎల్‌ఐఎస్సీ.
కోర్సు వ్యవధి: 3 సంవత్సరాలు (6 సెమిస్టర్లు)
➥ పీజీ కోర్సులు
- ఎంఏ (జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ , ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, ఉర్దూ)
- ఎంఎస్సీ (మ్యాథమెటిక్స్/అప్లైడ్ మ్యాథమెటిక్స్, సైకాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ)
- ఎంకామ్
- ఎంఎల్ఐఎస్సీ.
➥ డిప్లొమా కోర్సులు
విభాగాలు: సైకలాజికల్ కౌన్సెలింగ్ , ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, రైటింగ్ ఇన్ మాస్ మీడియా(తెలుగు), హ్యూమన్ రైట్స్, కల్చర్ అండ్ హెరిటేజ్ టూరిజం, ఉమెన్స్ స్టడీస్.
➥ పీజీ డిప్లొమా కోర్సులు
విభాగాలు: మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్(హెచ్ఆర్‌ఎం), ఆపరేషనల్ మేనేజ్‌మెంట్.
➥ సర్టిఫికేట్ కోర్సులు:
విభాగాలు: ఫుడ్ అండ్ న్యూట్రీషన్, లిటరసీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్జీవోస్ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్.
అర్హతలు:
➥ డిగ్రీ కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. నేషనల్ ఓపెన్ స్కూల్ నుంచి ఇంటర్ చదివినా అర్హులే.
➥ పీజీ కోర్సులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉంటే సరిపోతుంది. ఎంకామ్ కోర్సుకు మాత్రం బీబీఏ, బీబీఎం, బీఏ(కామర్స్) ఉండాలి. సైన్స్ సబ్జెక్టులకు కూడా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
➥ డిప్లొమా కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీ ఉండాలి.
➥ సర్టిఫికేట్ కోర్సులకు పదోతరగతి లేదా ఇంటర్ అర్హత ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 31.01.2024.
Application Form for BA, BCom & BSc Courses
Application Form for PG(MA/M.Sc/M.Com)/ Diploma and Certificate Programmes
ALSO READ:
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, 2024-2026 విద్యా సంవత్సరానికి ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 75 సీట్లను భర్తీచేయనున్నారు. ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు క్యాట్-2023 ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. క్యాట్-2023 స్కోర్, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు రూ.600, ఈడబ్ల్యూఎస్ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు జనవరి 31లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..