ప్రస్తుతం దేశ వ్యాప్తంగా SUVల వినియోగం పెరుగుతోంది. చాలా మంది వినియోగదారులు SUVల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. త్వరలో దేశీయ మార్కెట్లోకి రూ. 15 లక్షలలోపు 4 SUVలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఇంతకీ అవేంటో  తెలుసుకుందాం.


1. హ్యుందాయ్ AI3


కొరియన్ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్, ఈ ఏడాది చివరిలోపు Ai3 అనే పేరుతో కొత్త మైక్రో SUVని మా మార్కెట్లో పరిచయం చేయబోతోంది. నిజానికి, ఈ కొత్త చిన్న SUV బ్రాండ్ ను అనేకసార్లు పరీక్షించింది. ఈ కొత్త మోడల్ బ్రాండ్  SUV లైనప్‌లో ఉంచింది.  టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కిగర్, త్వరలో ప్రారంభించబోయే మారుతి ఫ్రాంక్స్‌ లకు పోటీగా ఉంటుంది. ఇది గ్రాండ్ i10 నియోస్‌తో అండర్‌ పిన్నింగ్‌లను పంచుకునే అవకాశం ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో 83bhp, 1.2L NA పెట్రోల్ ఇంజన్‌తో రానుందని భావిస్తున్నారు. CNG వెర్షన్‌ను కూడా మన మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.


2. మారుతి సుజుకి ఫ్రాంక్స్


మారుతీ సుజుకి ఏప్రిల్ 2023 ఫస్ట్ హాఫ్ లో లో Fronx  క్రాస్‌ ఓవర్‌ను దేశంలో విడుదల చేస్తుంది. ఇది NEXA డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించబడుతుంది. రూ. 11,000 చెల్లించి ఆన్‌లైన్ లేదంటే డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. ఇది తప్పనిసరిగా బాలెనో హ్యాచ్‌ బ్యాక్  క్రాస్ఓవర్ వెర్షన్. క్రాస్ఓవర్ హ్యాచ్‌బ్యాక్ కు సంబంధించిన చాలా ఫీచర్లు, డిజైన్ ను పంచుకుంటుంది. ఇది రెండు ఇంజన్‌లతో అందుబాటులోకి రానుంది.  90PS, 1.2L NA పెట్రోల్,  100PS, 1.0L టర్బో పెట్రోల్. మాన్యువల్ లేదా టోమేటిక్ గేర్‌బాక్స్‌లో ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. 


3. మారుతి జిమ్నీ 5-డోర్


మారుతి సుజుకి జిమ్నీ లైఫ్‌స్టైల్ SUVని మే 2023 నాటికి విడుదల చేస్తుంది. NEXA డీలర్‌షిప్‌ల ద్వారా అందుబాటులోకి రానుంది.  జిమ్నీని రూ. 25,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఇది జీటా, ఆల్ఫా అనే రెండు ట్రిమ్ స్థాయిలలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.10 లక్షల నుంచి రూ.14 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. కొత్త మోడల్ 1.5-లీటర్ K15B 4-సిలిండర్ పెట్రోల్‌తో 103bhp, 134.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో 5-స్పీడ్ మాన్యువల్, 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఉంటాయి. ఇది సుజుకి  AllGrip Pro 4WD సిస్టమ్‌తో మాన్యువల్ ట్రాన్స్‌ ఫర్ కేస్,  WD-హై, 4WD-హై, 4WD-లో మోడ్‌లతో తక్కువ శ్రేణి గేర్‌ బాక్స్‌ తో వస్తుంది.


4. కొత్త టాటా నెక్సాన్


టాటా మోటార్స్ కొత్త నెక్సాన్ కాంపాక్ట్ ఎస్‌యూవీని  ప్రస్తుతం రోడ్లపై పరీక్షిస్తోంది. ఈ సంవత్సరం, లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. కొత్త టాటా నెక్సాన్ కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు డిజైన్ మార్పులు,  అప్‌గ్రేడ్ చేసిన ఇంటీరియర్‌తో వస్తుంది. కొత్త మోడల్ Curvv SUV కూపే నుంచి స్టైలింగ్ సూచనలను పంచుకుంటుంది. లోపల,  10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే,  కొత్త డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ కలిగి ఉంటుంది. SUV కొత్త 1.2L టర్బో పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది.  ఇది 125PS, 225Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.


Read Also: అదిరిపోయే ఫీచర్లతో హీరో నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్, విడుదల ఎప్పుడంటే?