Upcoming Royal Enfield Two Wheelers: భారతీయ కస్టమర్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు ఎల్లప్పుడూ ప్రసిద్ధి చెందాయి. వీటిలో క్లాసిక్ 350 నుంచి బుల్లెట్ 350 వరకు అనేక బైక్‌లు ఉన్నాయి. మీరు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లయితే కొన్నాళ్లు వేచి ఉండాల్సిందే. ఎందుకంటే త్వరలో మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు భారత మార్కెట్లోకి రానున్నాయి. త్వరలో ఏ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు మార్కెట్లోకి విడుదల చేయబోతున్నారో చూద్దాం.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 (Royal Enfield Bear 650)
రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో ఇంటర్‌సెప్టర్ 650 ఆధారంగా కొత్త స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్‌ను పరిచయం చేస్తుంది. దీనికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 అని పేరు పెట్టవచ్చు. కంపెనీ అందిస్తున్న మోటార్‌సైకిల్‌లో మీరు చాలా గొప్ప ఫీచర్లను పొందుతారు. ఇది యూఎస్‌డీ ఫోర్క్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతో పాటు 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ కూడా బైక్‌లో పవర్‌ట్రెయిన్‌గా ఉపయోగించనున్నారు.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ (Royal Enfield Electric Bike)
ఇప్పుడు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కూడా లాంచ్ చేయనుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ టీజర్‌ను షేర్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ 2024 నవంబర్ 4వ తేదీన లాంచ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర దాదాపు రూ. 1.5 లక్షలు ఉండవచ్చు. దీంతో పాటు దాని డిజైన్, ఫీచర్లు, రేంజ్, ధర... ఈ బైక్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది నిర్ణయించనున్నాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 (Royal Enfield Classic 650)
దీంతో పాటు కంపెనీ అత్యధికంగా విక్రయించిన మోటార్‌సైకిల్ క్లాసిక్ 350 విజయం సాధించిన తర్వాత కంపెనీ ఇప్పుడు క్లాసిక్ 650ని భారతీయ మార్కెట్లో విడుదల చేయడానికి ప్లాన్లు వేస్తుంది. నివేదికల ప్రకారం రాబోయే రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650కి పవర్‌ట్రెయిన్‌గా 648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ అందించనున్నారు. ఇది గరిష్టంగా 47.4 బీహెచ్‌పీ శక్తిని, 52.4 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు మనదేశంలో మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈ కొత్త బైక్‌లు లాంచ్ అయ్యాక సూపర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?