2026 Toyota Hilux Price And Features Telugu: టయోటా, భారత మార్కెట్లో తొమ్మిదో తరం Hilux పికప్‌ ట్రక్‌ను విడుదల చేసింది. 2022 మార్చిలో వచ్చిన ఎనిమిదో తరం Hiluxకు ప్రత్యామ్నాయంగా వచ్చిన ఈ కొత్త మోడల్‌లో డిజైన్‌, ఇంటీరియర్‌, ఫీచర్లు & వేరియంట్లలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా... మరింత అగ్రెసివ్‌ లుక్‌తో పాటు కొత్త సాంకేతిక ఫీచర్లను జోడించడం ద్వారా ప్రీమియం అనుభూతిని అందించేందుకు టయోటా ప్రయత్నించింది. మరి పాత Hiluxతో పోలిస్తే కొత్త మోడల్‌లో ఏమేం మారాయో తెలుసుకుందాం.

Continues below advertisement

టయోటా Tacoma పికప్‌ ట్రక్‌ డిజైన్‌ ప్రేరణతో కొత్త Hilux ను డిజైన్‌ చేశారు. 2026 టయోటా హైలక్స్‌ ముందు భాగంలో సన్నగా ఉండే LED హెడ్‌ల్యాంప్‌లు, వాటిలోనే కలిపిన DRLs కొత్త లుక్‌ను ఇస్తున్నాయి. గత మోడల్‌లో మధ్యలో టయోటా లోగో ఉండగా, ఇప్పుడు గ్లోస్‌ బ్లాక్‌ స్ట్రిప్‌పై పెద్ద అక్షరాలతో "TOYOTA" పేరు కనిపిస్తుంది. దీంతో వాహనం మరింత బలమైన రోడ్‌ ప్రెజెన్స్‌ను సొంతం చేసుకుంది.

ముందు భాగంలో మార్పులుఫ్రంట్‌ గ్రిల్‌ ఇప్పుడు మరింత చతురస్రాకారంలో హనీకాంబ్‌ మెష్‌ డిజైన్‌తో వచ్చింది. బంపర్‌ రెండువైపులా పెద్ద బ్లాక్‌ ఇన్‌సర్ట్‌లు, దిగువ భాగంలో వెడల్పైన ఎయిర్‌ ఇంటేక్‌లు, సిల్వర్‌ స్కిడ్‌ ప్లేట్‌, LED ఫాగ్‌ ల్యాంప్‌లు ఉండటంతో కొత్త Hilux మరింత రగ్గడ్‌గా కనిపిస్తోంది.

Continues below advertisement

పక్క భాగంలో మార్పులుసైడ్‌ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు లేకపోయినా కొన్ని కీలక అప్‌డేట్లు ఉన్నాయి. ముందు డోర్లపై HILUX బ్యాడ్జ్‌ను కొనసాగించారు. గతంలో ఉన్న 18 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌కు బదులుగా ఇప్పుడు 17 అంగుళాల కొత్త డిజైన్‌ వీల్స్‌ను బ్లాక్‌ ఫినిష్‌తో అందించారు. వీల్‌ ఆర్చ్‌ క్లాడింగ్‌ ఇప్పుడు అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా లభిస్తోంది. ORVMలు & డోర్‌ హ్యాండిల్స్‌ను కూడా బ్లాక్‌ రంగులో తీర్చిదిద్దారు. ట్రక్‌ బెడ్‌లోకి ఎక్కడం సులభం కావడానికి వెనుక బంపర్‌ ఇరువైపులా చిన్న సైడ్‌ స్టెప్‌లను జోడించారు.

ఇది కూడా చదవండి: రూ.1.23 లక్షల నుంచే Avore EX ఎలక్ట్రిక్‌ బైక్‌.. 260km రేంజ్‌, 114km టాప్‌ స్పీడ్‌

వెనుక భాగంలో మార్పులువెనుక భాగంలో కూడా మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. గత మోడల్‌లో ఉన్న B ఆకారపు టెయిల్‌ల్యాంప్‌ల స్థానంలో ఇప్పుడు C ఆకారపు LED టెయిల్‌ల్యాంప్‌లను అమర్చారు. టెయిల్‌గేట్‌పై కూడా పెద్ద అక్షరాలతో "TOYOTA" పేరు కనిపిస్తుంది. టెయిల్‌గేట్‌ హ్యాండిల్‌ను బ్లాక్‌ ఫినిష్‌లో అందించగా, ట్రక్‌ బెడ్‌ను చేరుకునేందుకు వెనుక బంపర్‌లో ఇంటిగ్రేటెడ్‌ స్టెప్‌ను కొనసాగించారు.

ఇంటీరియర్‌లో కొత్త Hilux పూర్తిగా ఆధునిక రూపాన్ని సంతరించుకుంది. కొత్త మూడు స్పోక్‌ స్టీరింగ్‌ వీల్‌పై ఫిజికల్‌ బటన్‌లు, పూర్తిగా డిజిటల్‌ డ్రైవర్‌ డిస్‌ప్లే & 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను అందించారు. పాత మోడల్‌లో అనలాగ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ & 8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ మాత్రమే ఉండేది. అయితే సెంటర్‌ కన్సోల్‌పై అవసరమైన నియంత్రణల కోసం ఫిజికల్‌ బటన్‌లను కొనసాగించడం వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.

ఫీచర్లుఅయితే కొన్ని సౌకర్యవంతమైన ఫీచర్లను టయోటా తొలగించింది. గత మోడల్‌లో లభించిన ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌, రెండో వరుస AC వెంట్స్‌, ఆటో డిమ్మింగ్‌ IRVM, లెదర్‌ సీట్లు & పవర్‌ అడ్జస్టబుల్‌ డ్రైవర్‌ సీటు ఇప్పుడు అందుబాటులో లేవు. వాటి స్థానంలో మాన్యువల్‌ AC, సాధారణ IRVM, ఫ్యాబ్రిక్‌ సీట్లు & మాన్యువల్‌గా సర్దుకునే డ్రైవర్‌ సీటును అందించారు. ఉష్ణోగ్రత నియంత్రణ కోసం ప్రీమియం బటన్‌లకు బదులుగా సులభమైన రోటరీ డయల్‌లను ఉపయోగించారు.

కొత్త Hiluxలో వైర్‌లెస్‌ ఛార్జర్‌ను అన్ని వేరియంట్లలో ప్రామాణికంగా అందించారు. టాప్‌ వేరియంట్‌లో వైర్‌లెస్‌ Apple CarPlay & Android Auto సపోర్ట్‌ కూడా లభిస్తుంది. భద్రత విషయంలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS & Isofix చైల్డ్‌ సీట్‌ మౌంట్లు కొనసాగించినప్పటికీ ADAS సాంకేతికతను మాత్రం ఇంకా అందించలేదు.

ఇది కూడా చదవండి: స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం

ఇంజిన్‌ ఇంజిన్‌ పరంగా మాత్రం ఎలాంటి మార్పు లేదు. కొత్త Hilux కూడా అదే IMV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడింది. ఇందులో 2.8 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ 204 హెచ్‌పీ శక్తి & 500Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు అన్ని వేరియంట్లలో 6 స్పీడ్‌ టార్క్‌ కన్వర్టర్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ను మాత్రమే అందిస్తున్నారు. మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ను పూర్తిగా తొలగించారు. అలాగే 2WD & 4WD ఎంపికలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరింత మంది కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే విదేశీ మార్కెట్లలో లభించే 48V మైల్డ్‌ హైబ్రిడ్‌ సిస్టమ్‌ను భారత్‌కు తీసుకురాలేదు.

ధరలుపాత Hilux 4WD మాన్యువల్‌ & ఆటోమేటిక్‌ వేరియంట్లలో మాత్రమే రూ.35.30 లక్షలు & రూ.36 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరలకు లభించేది. కొత్త Hilux మాత్రం 2WD & 4WD ఎంపికలతో రూ.31.99 లక్షల నుంచి రూ.36.69 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరల మధ్య అందుబాటులోకి వచ్చింది. తక్కువ ప్రారంభ ధర, కొత్త డిజైన్‌, ఆధునిక ఇంటీరియర్‌ & అదనపు ఫీచర్లతో కొత్త Toyota Hilux భారత పికప్‌ ట్రక్‌ విభాగంలో మరింత బలమైన పోటీదారుగా నిలవనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.