Hanuman Ji Missing In Ramayana Trailer : ఇండియన్ సినీ చరిత్రలో మైథలాజికల్ విజువల్ వండర్ 'రామాయణ' ట్రైలర్ వచ్చేసింది. నితీశ్ తివారీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. శాంత మూర్తిగా, మహా పరాక్రమ శ్రీరాముడు, సీతా మాతగా సాయి పల్లవి లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. రాక్షస రాజుగా ఉగ్ర రూపంలో రావణుడి లుక్స్ వేరే లెవల్.

Continues below advertisement

హనుమంతుడు ఎక్కడ?

రామాయణ ట్రైలర్‌లో కీలక పాత్రలన్నింటినీ పరిచయం చేశారు మేకర్స్. దశరథుడు, కైకేయి, రాముడు, సీత, లక్ష్మణుడు, రావణుడు, విశ్వామిత్రుడు, శూర్పణఖ ఇలా అన్నీ రోల్స్ ఇంట్రడ్యూస్ చేసినా... అసలైన హనమంతుడి పాత్రను చూపించకపోవడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. 

Continues below advertisement

రామాయణానికే కీలక ఘట్టం, కీలక పాత్ర హనుమంతుడి. రాముని బంటు, సేవకునిగా సీతమ్మ జాడ తెలియజేసి ఇద్దరినీ కలిపి లోక కల్యాణం చేసిన మహా భక్తుడు. అలాంటి హనుమాన్‌ను ట్రైలర్‌లో ఎందుకు చూపించలేదంటూ కొందరు నెటిజన్లు నెట్టింట ప్రశ్నిస్తున్నారు. అసలు అదే మెయిన్ కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'ట్రైలర్ పీక్ అని... కానీ హనుమంతుడు లేకుండా రామాయణ ట్రైలర్ ఏంటి?' అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. 

Also Read : Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్

అసలు రీజన్ అదేనా?

రామాయణ రెండు పార్టులుగా రానుండగా ఈ దీపావళికి ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫస్ట్ పార్ట్‌లో శ్రీరాముడి జననం దగ్గర నుంచి శివదనుర్భంగం, సీతారాముల కల్యాణం, తండ్రి దశరథుడు ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసం, అరణ్యంలో శూర్పణఖ రామున్ని చూసి మోహించడం, ఆమెకు లక్ష్మణుడు చేసిన అవమానం, రాముడిగా పగ తీర్చుకుంటానని రావణుడి శపథం వంటి అంశాలను  చూపించనున్నారు. 

రెండో పార్టులో సీతాపహరణం దగ్గర నుంచీ రామయ్యకు హనుమంతుని సాయం, వానర సైన్యంతో రావణుడిపై రాముని యుద్ధం చేయడం వంటి అంశాలను చూపించనున్నట్లు తెలుస్తోంది. అందుకే హనుమంతుడి లుక్ రివీల్ చేయలేదని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో సన్నీ డియోల్ హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. కనీసం లుక్ అయినా రిలీజ్ చేసుంటే బాగుండేదని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read : Srinivasa Mangapuram Twitter Review - శ్రీనివాస మంగాపురం ట్విట్టర్ రివ్యూ: మహేష్ అన్న కొడుక్కి మొదటి సినిమాతో ఫ్లాప్ తప్పదా?

ఏయే పాత్రల్లో ఎవరు?

రోల్ నటుడు పేరు
శ్రీరాముడురణబీర్ కపూర్
సీతసాయి పల్లవి
లక్ష్మణుడురవి దూబే
రావణుడుయశ్
హనుమంతుడుసన్నీ డియోల్
భరతుడుఆదినాథ్ కొఠారే
శతృఘ్నుడునితీశ్ శర్మ
దశరథుడుఅరుణ్ గోవిల్
కౌసల్యఇందిరా కృష్ణన్
కైకేయిలారాదత్తా
సుమిత్రసోనల్ ఝా
మంధరషీబా చద్దా
వశిష్ట మహర్షిశిశిర్ శర్మ
విశ్వామిత్రుడుఅజింక్య దేవ్

NOTE :మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.