Avore EX Range, Price Explained In Telugu: గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌ స్టార్టప్‌ అవోర్ ‍‌(Avore), రెండు రోజుల క్రితం, తన కొత్త Avore EX ఎలక్ట్రిక్‌ బైక్‌ శ్రేణిని భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఈ సిరీస్‌లో EX1, EX2 & EX2S అనే మూడు వేరియంట్లు ఉన్నాయి. మూడు మోడళ్లూ ఒకే స్పోర్టీ డిజైన్‌తో ఉన్నప్పటికీ బ్యాటరీ సామర్థ్యం, మోటార్‌ పవర్‌, రేంజ్‌, టాప్‌ స్పీడ్‌ & ఫీచర్లలో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. తక్కువ ధరలో మంచి రేంజ్‌ కోరుకునే వారి నుంచి అధిక పనితీరు కోరుకునే రైడర్ల వరకు అందరికీ సరిపోయేలా ఈ లైనప్‌ను రూపొందించింది.

Continues below advertisement

Avore EX1ఎంట్రీ లెవెల్‌ మోడల్‌గా వచ్చిన EX1లో 3.24kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు 7.5kW ఎలక్ట్రిక్‌ మోటార్‌ అందించారు. కంపెనీ తెలిపిన IDC ప్రమాణాల ప్రకారం ఇది ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 160 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఈ బైక్‌ గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు. ఇందులో Eco, City & Sport అనే మూడు రైడింగ్‌ మోడ్‌లతో పాటు Reverse మోడ్‌ను కూడా అందించారు. చైన్‌ ఫైనల్‌ డ్రైవ్‌తో వచ్చే ఈ వేరియంట్‌ ధర రూ.1.23 లక్షలు.

Avore EX2మధ్యస్థ వేరియంట్‌గా ఉన్న EX2లో కూడా అదే 7.5kW మోటార్‌ను కొనసాగించారు. అయితే ఇందులో పెద్దదైన 5kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీంతో IDC రేంజ్‌ 255 కిలోమీటర్లకు పెరిగింది. దీని టాప్‌ స్పీడ్‌ గంటకు 100 కిలోమీటర్లు. Eco, City & Sport రైడింగ్‌ మోడ్‌లు, Reverse మోడ్‌, చైన్‌ ఫైనల్‌ డ్రైవ్‌ వంటి ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. కంపెనీ ప్రకారం సాధారణ 15A సాకెట్‌తో బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతం వరకు సుమారు రెండు గంటల్లో ఛార్జ్‌ చేయవచ్చు. ఈ వేరియంట్‌ ధర రూ.1.46 లక్షలు.

Continues below advertisement

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?

Avore EX2Sసిరీస్‌లో అత్యంత ప్రీమియం మోడల్‌గా వచ్చిన EX2Sలో 10.5kW సామర్థ్యం గల శక్తివంతమైన ఎలక్ట్రిక్‌ మోటార్‌ను అందించారు. బ్యాటరీ మాత్రం EX2లో ఉన్న అదే 5kWh యూనిట్‌నే ఉపయోగించారు. ఈ మోడల్‌ గరిష్ట వేగం గంటకు 114 కిలోమీటర్ల వరకు చేరుతుందని కంపెనీ వెల్లడించింది. అలాగే IDC ప్రమాణాల ప్రకారం ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 260 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని పేర్కొంది.

ఫీచర్ల పరంగా కూడా EX2S ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇందులో Park Assist (PAM+), Eco, City, Sport & Apex అనే ఐదు రైడింగ్‌ మోడ్‌లతో పాటు ప్రత్యేకమైన SYFT మోడ్‌ను కూడా అందించారు. ఈ SYFT మోడ్‌ ద్వారా సంప్రదాయ గేర్‌ బైక్‌ను నడుపుతున్న అనుభూతి కలిగేలా ఎడమ కాలి లీవర్‌తో దశలవారీగా పవర్‌ డెలివరీని పెంచుకోవచ్చు.

EX1 & EX2 వేరియంట్లలో LCD డిస్‌ప్లే ఉండగా, EX2Sలో 7 అంగుళాల టచ్‌స్క్రీన్‌ TFT డిస్‌ప్లేను అందించారు. అలాగే చైన్‌ ఫైనల్‌ డ్రైవ్‌కు బదులుగా బెల్ట్‌ డ్రైవ్‌ను అమర్చడం ద్వారా మరింత సాఫీగా & తక్కువ నిర్వహణ ఖర్చుతో ప్రయాణ అనుభవాన్ని అందించే ప్రయత్నం చేశారు. ఈ టాప్‌ వేరియంట్‌ ధర రూ.1.70 లక్షలు.

ఇది కూడా చదవండి: స్టైలిష్‌ లుక్‌, 260km వరకు రేంజ్‌, 114kmph టాప్ స్పీడ్‌ - Avore నుంచి మూడు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు

ఏది బెటర్‌?తక్కువ ధరలో మంచి రేంజ్‌ కావాలనుకునే వారికి EX1 సరైన ఎంపికగా కనిపిస్తే, ఎక్కువ దూర ప్రయాణాలు చేసే వారికి EX2 అనుకూలంగా ఉంటుంది. అధిక పనితీరు, ప్రీమియం ఫీచర్లు, అత్యాధునిక టెక్నాలజీ కోరుకునే వారికి EX2S అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుంది. దీంతో విభిన్న అవసరాలు ఉన్న కొనుగోలుదారులను ఆకట్టుకునేలా Avore తన కొత్త EX శ్రేణిని రూపొందించింది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.