Avore EX Electric Bike Price, Range And Features Telugu: భారత్‌లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్‌లో మరో కొత్త కంపెనీ అడుగుపెట్టింది. గుజరాత్‌కు చెందిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ స్టార్టప్ అవోర్ (Avore), ఒకేసారి మూడు కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను ఆవిష్కరించింది. Avore EX1, EX2 & EX2S పేర్లతో వచ్చిన ఈ మోడళ్లు కంపెనీ నుంచి తొలి ఉత్పత్తులు కావడం విశేషం. ప్రస్తుతం ఈ బైక్‌లకు ప్రీ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కేవలం రూ.799 టోకెన్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
ఈ మూడు బైక్‌లు ఒకే తరహా స్పోర్ట్స్ డిజైన్‌తో వచ్చినప్పటికీ బ్యాటరీ సామర్థ్యం, రేంజ్, టాప్ స్పీడ్, ఫీచర్లలో తేడాలు ఉన్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్‌ను తలపించే స్టైలింగ్, పొడవైన ఫెయిరింగ్, షార్ప్ బాడీ లైన్స్, ఆకర్షణీయమైన లుక్‌తో యువతను ఆకట్టుకునేలా అవోర్ కంపెనీ వీటిని రూపొందించింది.
Avore EX1ఎంట్రీ లెవల్ మోడల్ అయిన అవోర్ EX1లో 3.24kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది IDC ప్రమాణాల ప్రకారం, ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. గరిష్ఠ వేగం 100kmph. ఇందులో మూడు రైడింగ్ మోడ్స్‌ను అందించారు. ఈ మోడల్ ధర రూ.1.23 లక్షలు (ఎక్స్ షోరూమ్).
Avore EX2మధ్యస్థ మోడల్ అయిన అవోర్ EX2లో పెద్దదైన 5kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 255 కిలోమీటర్ల వరకు IDC రేంజ్ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. టాప్ స్పీడ్ 100kmphగానే ఉంటుంది. ఇందులో కూడా మూడు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సాధారణ 15A సాకెట్‌తో బ్యాటరీని 20 శాతం నుంచి 80 శాతం వరకు సుమారు రెండు గంటల్లో ఛార్జ్ చేయవచ్చని అవోర్ తెలిపింది. ఈ మోడల్ ధర రూ.1.46 లక్షలుగా నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: జులై 31 వరకే ఛాన్స్.. Kawasaki Z900పై అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన డీలర్
Avore EX2Sఈ శ్రేణిలో అత్యంత ప్రీమియం మోడల్ అవోర్ EX2S. ఇందులో కూడా 5kWh బ్యాటరీనే ఉన్నప్పటికీ పనితీరు మరింత మెరుగ్గా ఉంటుంది. గరిష్ఠ వేగం 114kmph కాగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 260 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ మోడల్‌లో ఐదు రైడింగ్ మోడ్స్‌తో పాటు 7 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. ఈ పెద్ద డిస్‌ప్లే ఈ లైనప్‌లో EX2Sకే ప్రత్యేకం. ఈ వేరియంట్ ధర రూ.1.70 లక్షలు.
ఫీచర్ల విషయానికి వస్తే మూడు మోడళ్లలోనూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించినట్లు కంపెనీ చెబుతోంది. అయితే కెర్బ్ వెయిట్, సీటు ఎత్తు, సస్పెన్షన్ సెటప్, పూర్తి ఛార్జింగ్ సమయం వంటి పూర్తి సాంకేతిక వివరాలను ఇంకా ప్రకటించలేదు. త్వరలో వాటిని వెల్లడిస్తామని సంస్థ తెలిపింది.
అవోర్ ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభించినప్పటికీ డెలివరీలు ఎప్పుడు ప్రారంభమవుతాయనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. అయితే ఆకర్షణీయమైన స్పోర్ట్స్ డిజైన్, మంచి రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్ సామర్థ్యం, అందుబాటు ధరలతో ఈ బైక్‌లు యువతతో పాటు రోజువారీ ప్రయాణాలకు ఎలక్ట్రిక్ బైక్‌ను ఎంచుకోవాలనుకునే వినియోగదారులను ఆకట్టుకునే అవకాశముంది.
ఇది కూడా చదవండి: Honda ADV160 Vs ప్రత్యామ్నాయాలు.. ఏ స్కూటర్ బెటర్‌గా ఉంది? పూర్తి కంపారిజన్
ప్రస్తుతం భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై డిమాండ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో అవోర్ తన తొలి ఉత్పత్తులతోనే వినియోగదారుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా రూ.1.23 లక్షల ప్రారంభ ధర నుంచి 260 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే ఈ లైనప్ మార్కెట్లో పోటీని మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది. స్టైలిష్ లుక్, మంచి పనితీరు & ఎక్కువ రేంజ్ కోరుకునే వారికి అవోర్ EX సిరీస్ ఒక ఆసక్తికరమైన కొత్త ఎంపికగా నిలవనుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
