Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి రోడ్ల నుంచి విజయవాడ నేషనల్ హైవే వరకు ప్రతి చోటా ఇప్పుడు కొత్త తరహా క్యాబిన్ కంఫర్ట్, పవర్- ప్యాక్డ్ మైలేజ్ ఇచ్చే కాంపాక్ట్ ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ రేసులో మారుతి సుజుకి నుంచి మార్కెట్‌లోకి అడుగు పెట్టిన మారుతి విక్టోరిస్ కారు ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. స్టైలిష్ లుక్స్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 అడా్ వంటి హై ఎండ్ ఫీచర్స్‌తో వచ్చిన ఈ ఎస్‌యూవీ మిడ్ సైజ్ సెగ్మెంట్‌లోని హ్యుందాయ్ క్రెటా, టాటా సియోరా, టయోటా హైరైడర్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుంది.
అయితే హైదరాబాద్‌లో కొత్త కారు కొనాలి అంటే షోరూమ్ ధర ఒకటే తెలుసుకుంటే సరిపోదు. అన్ని ట్యాక్స్‌లు కలిసి ఉన్న ఆన్‌రోడ్ ప్రైస్ తెలుసుకుంటే తప్ప మీరు ముందడుగు వేయలేరు. దీని ఆధారంగానే మీరు డౌన్‌పేమెంట్, ఈఎంఐ వివరాలపై స్పష్టమైన అభిప్రాయానికి వస్తారు.
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్ ఆన్‌రోడ్ ప్రైస్
మారుతి విక్టోరిస్ భారత మార్కెట్‌లో 10,50 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో లభిస్తుంది. దీని టాప్ ఎండ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్ ధర 19.99 లక్షల వరకు ఉంటుంది. అయితే హైదరాబాద్‌లో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు తెలంగాణ రవాణా శాఖ విధించే 12 శాతం నుంచి 14 శాతం ఆర్టీవో లైఫ్ ట్యాక్స్ కాంప్రెహెన్సివ్ ఇన్సూరెన్స్, టీసీస్, ఆప్షనల్ యాక్సెసరీస్ కలిపి ఆన్ రోడ్ ధర మారుతుంది.
బేస్ వేరియంట్ ఎల్‌ఎక్స్‌ఐ పెట్రోల్ వేరియంట్ ఎక్స్‌షోరూమ్ ధర 10.50 లక్షలు కాగా, హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ధర సుమారు 12.80 లక్షల వరక ఉంటుంది. మిడ్ వేరియంట్ వీఎక్స్‌ఐ, జీఎ్స్‌ఐ పెట్రోల్, సీఎన్జీ ఎక్స్‌షోరూమ్ ధరలు 11.80 లక్షల నుంచి 14.57 లక్షల వరకు ఉంటాయి. హైదరాబాద్‌లో వీటి ఆన్‌రోడ్ ధర 14.36 లక్షల నుంచి 17.09 లక్షల పరిధిలో ఉంటుంది. టాప్ వేరియంట్ స్ట్రాంగ్ హైబ్రిడ్ అండ్ ఏడబ్ల్యూడీ వెహికల్స్ ఎక్స్‌షోరూమ్ ధరలు 16.38 లక్షల నుంచి 19.99 లక్షల వరకు ఉండగా, భాగ్యనగరంలో వీటి ఆన్‌రోడ్ ధర 19.84 లక్షల నుంచి 24.16 లక్షల వరకు ఉంటుంది.
బేస్ వేరియంట్ ఎల్‌ఎక్స్‌ఐ మాన్యువల్ డౌన్‌పేమెంట్-ఈఎంఐ లెక్కలు
మారుతి విక్టోరిస్ ఎల్‌ఎక్స్‌ఐ 1.5ఎల్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ తక్కువ బడ్జెట్‌లో ఎస్‌యూవీ అనుభూతిని పొందాలనుకునే వారికి మంచి ఎంపిక. హైదరాబాద్ ఆన్‌రోడ్ ధర 12, 80,000. మినిమమ్ డౌన్‌పేమెంట్ రెండు లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీరు 10, 80,000 రూపాయలు బ్యాంక్‌లోను తీసుకోవచ్చు. దీనికి వడ్డీ దాదాపు 9 శాతం ఉంటుంది. ఈ వడ్డీ బ్యాంకులు, మీ సిబిల్ స్కోరును బట్టి మారుతుంది. ఈ లెక్క ప్రకారం ఏ నెల ఎంత ఈఎంఐ చెల్లించాలో చూద్దాం.
ఈ మొత్తాన్ని మూడేళ్ల టెన్యూర్‌కు తీసుకుంటే నెలకు 34,350 రూపాయలు చెల్లించాలి. ఇలా చెల్లిస్తే మీరు మొత్తంగా 1, 56, 600 రూపాయలు వడ్డీ చెల్లించాలి. అదే మొత్తాన్ని ఐదేళ్ల కాలపరిమితికి తీసుకుంటే నెలకు 22, 420 రూపాయలు కట్టాలి. అదే ఏడేళ్లకు తీసుకుంట్ నెలకు 17, 360 రూపాయల ఈఎంఐ చెల్లించాలి.
మిడ్ వేరియంట్స్ అయిన వీఎక్స్‌ఐ &జీఎక్స్‌ఐ సిటీ డ్రైవింగ్ కోసం ఆటోమేటిక్ లేదా తక్కువ రన్నింగ్ కాస్ట్ కోరుకునే వారికి సీఎన్జీ వేరియంట్ చాలా యూజ్ అవుతుంది. హైదరాబాద్‌లో దీని ఆన్‌రోడ్ ప్రైస్ 14, 36,000 రూపాయలు. దీనికి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు డౌన్‌పేమెంట్ చెల్లించాలి. 9 శాతం వడ్డీతో మిగతా 11, 86, 000 రూపాయలను బ్యాంక్ లోన్‌గా ఐదేళ్లు తీసుకుంటే నెలు 24, 620 రూపాయలు చెల్లించాలి. అదే ఏడేళ్లకు తీసుకుంటే 19,060 రూపాయలు చెల్లించాలి.
మారుతి విక్టోరిస్ సీఎన్జీ వేరియంట్ వీఎక్స్‌ఐ సీఎన్జీలో అండర్ బాడీ ట్యాంక్ టెక్నాలజీ వల్ల బూట్ స్పేస్ ఏ మాత్రం తగ్గదు. దీని ఆన్‌రోడ్ ధర 15, 56,000 రూపాయలు. దీనికి రెండున్నర లక్షల రూపాయలను డౌన్ పేమెంట్ చెల్లించాలి. మిగతా 13 లక్షల రూపాయలకు పైగా నగదును 9 శాతానికి బ్యాంకు లోనుగా తీసుకోవాలి. 5 ఏళ్లకు తీసుకుంటే నెలకు 27, 110 రూపాయలు, ఏడేళ్లకు తీసుకుంటే నెలకు 20, 990 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
టాప్ వేరియంట్ తీసుకుంటే పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్లు, లెవెల్ -2 అడాస్ సెక్యూరిటీ, 28.65kmpl మైలేజ్ ఇస్తుంది. ఈ సెగ్మెంట్‌లోని జీఎక్స్ఐ ప్లస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆన్‌రోడ్ ధర 23,53,000 రూపాయలు. దీని కోసం మూడున్నర లక్షలు డౌన్‌పేమెంట్ చెల్లించాలి. మిగతా ఇరవై లక్షలను 9 శాతం వడ్డీకి బ్యాంక్ లోన్ తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు లోన్‌ను ఐదేళ్లకు తీసుకుంటే నెలకు 41, 580 రూపాయలు చెల్లించాలి. ఏడేళ్లకు తీసుకుంటే 32, 200రూపాయలు చెల్లించాలి.
