Tata Punch EV Price, Range And Features Telugu: మన మార్కెట్లో అత్యంత సురక్షితమైన ఎలక్ట్రిక్‌ SUVలలో ఒకటిగా పేరొందిన Tata Punch EV మరోసారి తన భద్రతా ప్రమాణాలను నిరూపించుకుంది. 2026 Tata Punch EV ఫేస్‌లిఫ్ట్‌, తాజాగా నిర్వహించిన భారత్ NCAP క్రాష్‌ టెస్ట్‌లలో అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ (AOP) & చైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ (COP) విభాగాల్లో 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ సొంతం చేసుకుంది. దీంతో, కుటుంబ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులకు ఈ ఎలక్ట్రిక్‌ SUV మరింత ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచింది.

Continues below advertisement

32 మార్కులకు 31.09 మార్కులుభారత్ NCAP విడుదల చేసిన నివేదిక ప్రకారం 2026 Tata Punch EV అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌లో మొత్తం 32 మార్కులకు 31.09 మార్కులు సాధించింది. చైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌లో 49 మార్కులకు గాను 45 మార్కులు దక్కించుకుంది. ఇదే మోడల్‌ను భారత్ NCAP పరీక్షించడం ఇది రెండోసారి కావడం విశేషం. 2024లో పరీక్షించిన ప్రీ-ఫేస్‌లిఫ్ట్‌ మోడల్‌ AOPలో 31.46 మార్కులు సాధించగా, తాజా వెర్షన్‌కు 31.09 మార్కులు వచ్చాయి. అంటే అడల్ట్‌ రక్షణ స్కోర్‌లో స్వల్ప తగ్గుదల కనిపించినప్పటికీ, చైల్డ్‌ ఆక్యుపెంట్‌ స్కోర్‌ మాత్రం యథాతథంగా కొనసాగింది.

అడల్ట్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌ పరీక్షలో డ్రైవర్‌ & ముందు ప్రయాణికుడి తల, మెడ భాగాలకు మంచి రక్షణ లభించిందని నివేదిక పేర్కొంది. డ్రైవర్‌ ఛాతీ & మోకాళ్ల భాగానికి, అలాగే ముందు ప్రయాణికుడి మోకాళ్లకు తగిన స్థాయిలో రక్షణ లభించినట్లు వెల్లడించింది.

Continues below advertisement

ఇది కూడా చదవండి: రూ.1.23 లక్షల నుంచే Avore EX ఎలక్ట్రిక్‌ బైక్‌.. 260km రేంజ్‌, 114km టాప్‌ స్పీడ్‌

ఫ్రంటల్‌ ఆఫ్‌సెట్‌ డిఫార్మబుల్‌ బ్యారియర్‌ పరీక్షలో Punch EV 16 మార్కులకు గాను 15.28 మార్కులు సాధించింది. సైడ్‌ మూవబుల్‌ డిఫార్మబుల్‌ బ్యారియర్‌ పరీక్షలో 16 మార్కులకు గాను 15.80 మార్కులు సాధించి అత్యుత్తమ రక్షణను అందించింది. సైడ్‌ పోల్‌ ఇంపాక్ట్‌ పరీక్షలో "OK" రేటింగ్‌ను పొందింది. అలాగే ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ESC) పనితీరు పరీక్షను కూడా విజయవంతంగా పూర్తి చేసింది.

పిల్లల భద్రతచైల్డ్‌ ఆక్యుపెంట్‌ ప్రొటెక్షన్‌లో Punch EV మొత్తం 49 మార్కులకు గాను 45 మార్కులు సాధించింది. ఇందులో డైనమిక్‌ పరీక్షలో 24కు 24 పూర్తి మార్కులు, Child Restraint System (CRS) ఇన్‌స్టాలేషన్‌ పరీక్షలో 12కు 12 పూర్తి మార్కులు సాధించింది. వెహికల్‌ అసెస్‌మెంట్‌లో 13కు 9 మార్కులు దక్కాయి. పరీక్షల్లో 18 నెలల & 3 సంవత్సరాల చిన్నారుల డమ్మీలను (బొమ్మలు) వెనుక వైపు తిరిగి ఉండే చైల్డ్‌ సీట్లలో కూర్చోబెట్టి పరీక్షించారు. ఈ సీట్లను ముందు ప్రయాణికుడి సీటులో Isofix యాంకరేజ్‌లు & సపోర్ట్‌ లెగ్‌తో బిగించారు.

భారత్ NCAP ఈ పరీక్షల కోసం Punch EV Adventure 40 & Empowered+ 40 వేరియంట్లను ఉపయోగించింది. అయితే ఈ 5 స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ మొత్తం Punch EV శ్రేణికి వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?

సేఫ్టీ ఫీచర్లుTata Punch EVలో అన్ని వేరియంట్లలోనే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక సీట్లకు Isofix మౌంట్లు, అన్ని సీట్లకు 3-పాయింట్‌ సీట్‌బెల్ట్‌లు & సీట్‌బెల్ట్‌ రిమైండర్లు, ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (ESC) వంటి కీలక భద్రతా ఫీచర్లను ప్రామాణికంగా అందిస్తోంది. అలాగే ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ AIS-100 పాదచారుల భద్రతా ప్రమాణాలకు కూడా అనుగుణంగా ఉంది.

ప్రస్తుతం Tata Punch EV ధరలు రూ.9.69 లక్షల నుంచి రూ.12.79 లక్షల (ఎక్స్‌షోరూమ్‌) వరకు ఉన్నాయి. ఒకసారి పూర్తి ఛార్జ్‌తో గరిష్టంగా 468 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ, ఇప్పుడు 5 స్టార్‌ భారత్ NCAP రేటింగ్‌తో భద్రత విషయంలో కూడా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. కుటుంబ వినియోగం కోసం సురక్షితమైన ఎలక్ట్రిక్‌ వాహనం కోసం ఎదురుచూస్తున్న వారికి Tata Punch EV మరింత బలమైన ఎంపికగా నిలవనుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.