2025 Suzuki Access 125 :  భారత్ ఎక్స్‌పోలో సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా 2025 వెర్షన్ యాక్సెస్ 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఇది వినియోగదారుల భిన్న అవసరాలు, బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని మొత్తం మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ కొత్త మోడల్ ధరలు రూ. 81,700 నుండి రూ. 93,300 వరకు ఉన్నాయి.  వేరియంట్ వారీగా ఫీచర్లను వివరంగా తెలుసుకుందాం.


2025 సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్ ఎడిషన్
ఇది బేస్ వేరియంట్  రూ. 81,700 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. 2025 సుజుకి యాక్సెస్ స్టాండర్డ్ ఎడిషన్ పెర్ల్ గ్రేస్ వైట్, మెటాలిక్ మ్యాట్ బ్లాక్, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ  కలర్ ఆఫ్షన్లలో రాబోతుంది.  ఈ బైక్   ఫీచర్ల వివిధ రకాల సమాచారాన్ని ప్రదర్శించే LCD ఇన్‌స్ట్రుమెంట్ స్క్రీన్ ఉన్నాయి. ఓడోమీటర్, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, క్లాక్, ఇంధన గేజ్, నోటిఫికేషన్ లైట్లు ఉన్నాయి. 2025 సుజుకి యాక్సెస్ 125  బేస్ వేరియంట్‌లో USB ఛార్జింగ్ పోర్ట్, హజార్డ్ లైట్, ముందు భాగంలో డ్యూయల్ యుటిలిటీ పాకెట్స్ ఉన్నాయి. ఫ్రంట్ లాక్ ఆపరేటెడ్ ఎక్స్‌టర్నల్ ఫ్యూయల్ లిడ్‌తో వినియోగదారులు సజావుగా ఇంధనం నింపే అనుభవాన్ని ఆశించవచ్చు.



సీటు కింద స్టోరేజ్, డ్యూయల్ యుటిలిటీ హుక్స్, హెల్మెట్‌లను పెట్టుకోవడానికి రెండు కింద సీటు హుక్స్, అల్యూమినియం ఫుట్‌రెస్ట్‌లు ఉన్నాయి. స్కూటర్ రోజువారీ అవసరాల కోసం తయారు చేశారు. ఇది ఫ్లాట్, లాంగ్ ఫ్లోర్ బోర్డ్ స్పేస్ తో రాబోతుంది.  వెడల్పుగా  ఫ్లాట్ సీటు, స్ట్రాంగ్  గ్రాబ్ రైల్‌తో రైడర్ డ్రైవింగులో సౌకర్యవంతంగా ఉంటాయి. సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్ ఎడిషన్  బ్రేకింగ్ సెటప్ ముందు, వెనుక 130ఎంఎం డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. సేఫ్టీ కోసం CBS సిస్టమ్ అందిస్తున్నారు. ఇతర సేఫ్టీ ఫీచర్లలో పార్కింగ్ బ్రేక్, సైడ్ స్టాండ్ ఇంటర్‌లాక్ ఉన్నాయి.


 Also Read: భారత మార్కెట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ కు సీక్రెట్ గా సిద్ధమవుతోన్న మారుతి స్విఫ్ట్ ?
2025 సుజుకి యాక్సెస్ 125 స్పెషల్ ఎడిషన్
ఇది రూ. 88,200 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్‌తో అందుబాటులో ఉన్న మూడు కలర్ ఆప్షన్‌లతో పాటు, స్పెషల్ ఎడిషన్ మోడల్ సాలిడ్ ఐస్ గ్రీన్ కలర్ ఆప్షన్‌ను కూడా లభిస్తుంది. బేస్ వేరియంట్ కంటే ఫంక్షనల్ ఆధిపత్యం పరంగా, స్పెషల్ ఎడిషన్ ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉంది. వెనుక భాగంలో 130ఎంఎం డ్రమ్ బ్రేక్ ఉంది. CBS స్టాండర్డ్‌గా రానుంది. చాలా ఇతర ఫీచర్లు బేస్ మోడల్ లాగానే ఉంటాయి.


2025 సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్
 టాప్ వేరియంట్ - రైడ్ కనెక్ట్ ఎడిషన్ - బ్లూటూత్ ఆధారిత కనెక్టివిటీ ఫీచర్ ను కలిగి ఉంటుంది.   వినియోగదారులు కాల్స్, SMS, WhatsApp అలర్ట్, ఓవర్ స్పీడింగ్ అలర్ట్, వెదర్ అప్ డేట్స్,  టర్న్-బై-టర్న్ నావిగేషన్‌ను యాక్సెస్ చేయవచ్చు. డిజిటల్ కన్సోల్ ఫోన్ బ్యాటరీ స్థాయిని కూడా ప్రదర్శిస్తుంది.


డ్రైవింగ్ లైసెన్స్ , వాహన రిజిస్ట్రేషన్ సాఫ్ట్ కాపీలు వంటి ముఖ్యమైన పత్రాలను స్టోరేజ్ చేసుకునేందుకు డిజిటల్ వాలెట్ కూడా ఉంది. సుజుకి యాక్సెస్ 125 రైడ్ కనెక్ట్ ఎడిషన్ స్పెషల్ పెర్ల్ షైనీ బీజ్ ఆఫ్షన్ తో వస్తుంది.. ఇది స్పెషల్ ఎడిషన్‌తో అందుబాటులో ఉన్న నాలుగు కలర్ ఆఫ్షన్లలో లభిస్తుంది. 


Also Read: దట్టమైన పొగమంచులో డ్రైవింగ్ చేస్తున్నారా ?.. ఈ చిట్కాలు పాటించండి