Car Sales Report: కార్ల తయారీదారులకు మార్చి నెల ఎప్పటిలాగే చాలా బాగుంది. 2024 మార్చిలో భారతీయ మార్కెట్లో మొత్తం 3.7 లక్షల ప్యాసింజర్ కార్లు అమ్ముడుపోయాయి. వార్షిక ప్రాతిపదికన అమ్మకాలలో 10 శాతం వృద్ధి, నెలవారీ ప్రాతిపదికన 0.8 శాతం స్వల్ప క్షీణత ఉంది. అంటే గత సంవత్సరం మార్చితో పోలిస్తే 10 శాతం వృద్ధి, 2024 ఫిబ్రవరితో పోల్చినప్పుడు 0.8 శాతం క్షీణత నమోదు చేసిందన్న మాట.


గత నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు ఇవే


1. టాటా పంచ్ (Tata Punch)
2024 మార్చిలో టాటా పంచ్  17,547 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంతకు ముందు ఇదే నెలలో నమోదైన 10,894 యూనిట్ల కంటే ఇది 61 శాతం ఎక్కువ.


2. హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)
గత నెలలో హ్యుందాయ్ క్రెటా 16,458 యూనిట్లు అమ్ముడుపోయాయి. 2023 మార్చిలో అమ్ముడైన 14,026 యూనిట్ల కంటే ఇది ఇది 17 శాతం ఎక్కువ కావడం విశేషం.


3. మారుతి వ్యాగన్ఆర్ (Maruti WagonR)
మారుతి వ్యాగన్ఆర్ 2024 మార్చిలో 16,368 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023 మార్చిలో నమోదైన 17,305 యూనిట్లు అమ్ముడుపోయాయి. మొత్తమ్మీద ఐదు శాతం క్షీణతను నమోదు చేసింది.


4. మారుతి డిజైర్ (Maruti Dzire)
గత నెలలో మారుతి డిజైర్‌కు సంబంధించి 15,894 యూనిట్లను కంపెనీ విక్రయించింది. 2023 మార్చిలో అమ్ముడు పోయిన 13,394 యూనిట్ల కంటే ఇది 19 శాతం ఎక్కువ.


5. మారుతి స్విఫ్ట్ (Maruti Swift)
మారుతి స్విఫ్ట్ 2024 మార్చిలో 15,728 యూనిట్లు అమ్ముడుపోయింది. 2023 మార్చిలో నమోదైన 17,559 యూనిట్లు విక్రయాల కంటే ఇది 10 శాతం తక్కువ.


6. మారుతి బలెనో (Maruti Baleno)
గత నెలలో మారుతి బలెనో 15,588 యూనిట్లు అమ్ముడుపోయింది. 2023 మార్చిలో అమ్ముడుపోయిన 16,168 యూనిట్లు అమ్మకాల కంటే ఇది నాలుగు శాతం తక్కువ.


7. మహీంద్రా స్కార్పియో (Mahindra Scorpio)
మహీంద్రా స్కార్పియో మార్చి 2024లో 15,151 యూనిట్లు అమ్ముడుపోయింది. 2023 మార్చిలో నమోదైన 8,788 యూనిట్ల కంటే ఇది 72 శాతం ఎక్కువ కావడం విశేషం.


8. మారుతి ఎర్టిగా (Maruti Ertiga)
గత నెలలో మారుతి ఎర్టిగా 14,888 యూనిట్లు అమ్ముడుపోయింది. 2023 మార్చిలో నమోదైన 9,028 యూనిట్ల కంటే ఇది ఏకంగా 65 శాతం ఎక్కువ.


9. మారుతి బ్రెజా (Maruti Brezza)
మారుతి బ్రెజా 2024 మార్చిలో 14,164 యూనిట్లు అమ్ముడుపోయింది. 2023 మార్చిలో అమ్ముడు పోయిన 16,227 యూనిట్ల  కంటే ఇది 10 శాతం తక్కువ.


10. టాటా నెక్సాన్ (Tata Nexon)
2024 మార్చిలో టాటా నెక్సాన్ 14,058 యూనిట్లు అమ్ముడు పోయింది. 2023 మార్చిలో అమ్ముడుపోయిన 14,769 యూనిట్ల కంటే ఇది ఐదు శాతం తక్కువ.


Also Read: మొదటిసారి అలాంటి కారు తయారు చేయనున్న టెస్లా - భారతదేశం కోసమే!


టాప్‌లో టాటా పంచ్
టాటా పంచ్ 2024 మార్చిలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. దీనికి సంబంధించి ఏకంగా 17,547 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏకంగా 61 శాతం వార్షిక పెరుగుదల నమోదు చేసింది. టాటా పంచ్ ఎలక్ట్రిక్ సేల్స్ కూడా ఇందులో యాడ్ అయ్యాయి.


2024 మార్చిలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో మహీంద్రా స్కార్పియో ఏడో స్థానంలో నిలిచింది. గత నెలలో ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ 15,151 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో స్కార్పియోకు సంబంధించి 8,788 యూనిట్లు అమ్ముడుపోయాయి. దీని సేల్స్ వార్షిక ప్రాతిపదికన 72 శాతం పెరిగింది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!