2024 Jeep Wrangler India Launch: జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ కారు మనదేశలో ఏప్రిల్ 22వ తేదీన భారతదేశంలో లాంచ్ కానుంది. దాదాపు ఏడాది క్రితం గ్లోబల్ మార్కెట్‌లో ఎంట్రీ ఇచ్చిన ఫేస్‌లిఫ్టెడ్ రాంగ్లర్ కొత్త డిజైన్, కొత్త ఫీచర్లతో భారతదేశానికి రాబోతోంది.
జీప్ రాంగ్లర్ ఫేస్ లిఫ్ట్ ఎక్స్‌టీరియర్
రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ మొత్తం నలుపు గ్రిల్‌ను కలిగి ఉంది. ఇది ప్రస్తుత మోడల్ కంటే సన్నగా ఉండే విలక్షణమైన 7 స్లాట్ డిజైన్‌తో ఉంటుంది. గ్లోబల్ స్పెక్ రాంగ్లర్ 17-20 అంగుళాల నుంచి 35 అంగుళాల వరకు టైర్ సైజులతో 10 విభిన్న అల్లాయ్ వీల్ డిజైన్‌లతో అందుబాటులో ఉంది. ఇది అనేక రూఫ్ ఆప్షన్లను కూడా కలిగి ఉంది. స్టాండర్డ్ సాఫ్ట్ టాప్, బాడీ కలర్ హార్డ్ టాప్, బ్లాక్ హార్డ్ టాప్, కాంబినేషన్ హార్డ్, సాఫ్ట్ టాప్, ప్యాసింజర్లకు మాత్రమే ఓపెన్ అయ్యే సన్‌రైడర్ టాప్ ఫ్రంట్ ఆప్షన్లు ఇందులో ఉండనున్నాయి.
జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్, ఫీచర్లు
కొత్త 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సెంటర్ అన్ని వేరియంట్‌లలో ప్రామాణికంగా ఉంటుంది. ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ జీప్ యుకనెక్ట్ 5 సిస్టమ్‌పై నడుస్తుంది. ఇది ట్రయల్స్ ఆఫ్‌రోడ్ గైడ్‌తో సహా ఎస్‌యూవీకి కనెక్టెడ్ ఫీచర్లను యాడ్ చేస్తుంది. ఇందులో 62 ప్రసిద్ధ ఆఫ్ రోడ్ ట్రైల్స్ ఉన్నాయి. మధ్యలో ఉన్న ఏసీ వెంట్‌లు ఇప్పుడు ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ క్రింద అందించారు. అయితే క్యాబిన్ మిగిలిన లేఅవుట్ చాలా వరకు అలాగే ఉంటుంది. వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కొత్త సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందుతుంది.
జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్ ఎలా ఉంది?
ఇండియా స్పెక్ ప్రీ ఫేస్‌లిఫ్ట్ జీప్ రాంగ్లర్‌లో 270 హెచ్‌పీ, 400 ఎన్ఎం పీక్ టార్క్ పవర్ అవుట్ పుట్ అందించే 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 8 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్, జీప్ సెలెక్ ట్రాక్ ఫుల్ టైమ్ 4డబ్ల్యూడీ సిస్టమ్‌తో ప్రామాణికంగా అందుబాటులో ఉంది. రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో ఏకైక ఇంజిన్ ఆప్షన్‌తోనే కొనసాగుతుందని భావిస్తున్నారు.
జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ధర ఎంత?
జీప్ రాంగ్లర్ ప్రస్తుతం రెండు వేరియంట్‌లను కలిగి ఉంది. అన్‌లిమిటెడ్, రూబికాన్‌లలో అందుబాటులో ఉంది. వీటిలో అన్‌లిమిటెడ్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 62.65 లక్షలు కాగా, రూబికాన్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 66.65 లక్షలుగా ఉంది. త్వరలో రానున్న రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ధర దీని కంటే ఒక 10 శాతం ఎక్కువగా ఉండవచ్చు. ఇది ల్యాండ్ రోవర్ డిఫెండర్‌తో పోటీపడుతుంది.
Also Read: 2024 స్కోడా సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ లాంచ్ త్వరలో - ఫీచర్లు ఎలా ఉండనున్నాయి?