2024 Hyundai Creta: కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఈ నెల 16వ తేదీన విడుదల కానుంది. అయితే ఇప్పుడు దాని వేరియంట్లు, గేర్‌బాక్స్ ఆప్షన్ల గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలు బయటకు వచ్చాయి. ఇందులో టాప్ ఎండ్ మోడల్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది. పాడిల్ షిఫ్టర్లు, DCT ఆటోమేటిక్‌తో SX(O), SX(O) DT వేరియంట్లు అందుబాటులో ఉంటాయి.


ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఎంపికలు
ఇది కాకుండా E, EX, S, S(O), SX, SX Tech, SX(O) వంటి అన్ని ట్రిమ్ స్థాయిలతో లభించే ఏకైక ఇంజన్ ఆప్షన్ 1.5 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్‌నే. ఈ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ సీవీటీ లేదా ఐవీటీతో వస్తుంది. అందువల్ల కొత్త క్రెటా టర్బో పెట్రోల్ ఒకే ఒక గేర్‌బాక్స్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది కేవలం DCT మాత్రమే, మాన్యువల్ ఆప్షన్ ఉండదు. అంటే మీరు దీన్ని టాప్-ఎండ్ వేరియంట్ డీసీటీలో మాత్రమే కొనుగోలు చేయగలరు. సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో ఐఎంటీ గేర్‌బాక్స్ ఎంపిక కూడా అందుబాటులో ఉంది.


మరిన్ని వివరాలు త్వరలో
హ్యుందాయ్ క్రెటా టర్బోను పూర్తి ఫీచర్ లోడ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ట్రిమ్‌గా ఎలా మారుస్తుందో చూడటంపై అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ ఇంజిన్‌లో మల్టీపుల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. దీంతో క్రెటా సీవీటీని టాప్ ఎండ్ ట్రిమ్‌గా కొనుగోలు చేయవచ్చు. కొత్త క్రెటాలో అందించే టర్బో పెట్రోల్ ఇంజన్ 1.5 లీటర్ యూనిట్. ఇది 160 హెచ్‌పీ పవర్, 250 ఎన్ఎం అవుట్‌పుట్‌లను ఉత్పత్తి చేయనుంది.


ఆసక్తికరంగా ఈ ఇంజన్ కొత్త వెర్నా, అల్కాజార్‌లలో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. కొత్త క్రెటాలో టర్బో పెట్రోల్ ఆప్షన్లు కొంచెం లిమిటెడ్‌గా ఉన్నాయి. దీని ధర కూడా కాస్త తక్కువగా ఉంటుందని అందరూ ఆశిస్తున్నారు. ప్రస్తుతం హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మిగతా ఫీచర్లు, ఖచ్చితమైన స్పెసిఫికేషన్‌ల గురించి మరింత సమాచారం త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. 


మరోవైపు 2023 డిసెంబర్లో భారతీయ మార్కెట్లో దాదాపు 2.87 లక్షల కార్లు అమ్ముడుపోయాయి. 2022 డిసెంబర్‌తో పోలిస్తే నాలుగు శాతం వృద్ధి నమోదు అయింది. కానీ 2023 నవంబర్‌తో పోల్చితే మాత్రం 14.2 శాతం అమ్మకాలు తగ్గాయి. 2023 మొత్తం సంవత్సరంలో అమ్మకాల సంఖ్య మూడు లక్షల యూనిట్ల కంటే తక్కువగా పడిపోయిన ఏకైక నెల డిసెంబర్ మాత్రమే. సాధారణంగా డీలర్‌షిప్ దగ్గర స్టాక్‌ను తగ్గించడానికి కంపెనీలు డిసెంబర్‌లో తక్కువ వాహనాలను తయారు చేస్తాయి. జనవరి నుంచి ధరలు పెరుగుతాయి కాబట్టి డిసెంబర్‌లో ధరలు తగ్గించి ఉన్న స్టాక్‌ను క్లియర్ చేయడానికి కంపెనీలు ప్రయత్నిస్తాయి. సేల్స్ కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ భారతీయ ప్యాసింజర్ వాహన విభాగం 2023 డిసెంబర్ నెలలో మంచి అమ్మకాలనే నమోదు చేసింది.


Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!