Weekly Horoscope 23 To 29 December : డిసెంబర్ 23 నుంచి 29 వరకూ వారఫలాలు


సింహ రాశి వారఫలం (Leo Weekly Horoscope)


ఈ వారం మీకు ఉన్నత ఉద్యోగానికి సంబంధించిన కాల్ రావొచ్చు. స్థిరాస్తులు పెరుగుతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. మీ సామర్థ్యాలను ప్రదర్శించడానికి మీకు అవకాశాలు లభిస్తాయి. వైద్య వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. ఇంటర్వ్యూలు , సమావేశాలలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు ఇంట్లో పునర్నిర్మాణం వంటి కొన్ని మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తారు.  ఉద్యోగ రీత్యా ప్రయాణం చేయవలసి వస్తుంది.  భాగస్వామ్య వ్యాపారంలో లాభాన్ని పొందుతారు. మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వారం ప్రారంభంలో ఆందోళన పెరుగుతుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. మీ ప్రియమైన వ్యక్తి పట్ల అపనమ్మకం వద్దు. వారంలో చివరి రెండు రోజులు ఆరోగ్య పరమైన సమస్యలు ఎదుర్కొంటారు.  అనైతిక మార్గాల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నించవద్దు.  ఏ పనిని వాయిదా వేయడానికి ప్రయత్నించవద్దు Leo Yearly Horoscope 2025 


కన్యా రాశి వారఫలం (Virgo Weekly Horoscope)


కన్యా రాశివారికి వారం ప్రారంభం బాగుంటుంది. మీపై చాలా పని ఒత్తిడి ఉంటుంది కానీ మీరు దానిని బాధ్యతాయుతంగా నిర్వహిస్తారు. వ్యాపార పరిస్థితి సాధారణంగా ఉంటుంది. గ్లామర్ రంగానికి సంబంధించిన వ్యక్తులు వారి కృషి నుంచి గొప్ప ప్రయోజనాలు  పొందుతారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వైవాహిక జీవితం శృంగారభరితంగా సాగుతుంది. ఆస్తి వివాదాలు  పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో జీతం పెరిగే అవకాశం ఉంది. ఆదివారం, సోమవారం,  గురువారాలు మీకు మంచి రోజులు. ముఖ్యమైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం.  వారం మధ్యలో కొన్ని దుష్పరిణామాలు ఉండవచ్చు.  మీ పనితీరుతో మీరు  సంతృప్తి చెందలేరు. కొంత ఏకాగ్రత లోపిస్తుంది.  పరిస్థితులను శక్తివంతంగా ఎదుర్కోండి. రక్తపోటు రోగులకు సమస్యలు ఉండవచ్చు. మీ పనిలో ఎవరూ జోక్యం చేసుకోనివ్వవద్దు. ఓపికగా  ఉండండి. Virgo Yearly Hororscope 2025


Also Read: 108 వైష్ణవ క్షేత్రాల్లో మొదటిది.. దేశంలోనే అతి పెద్ద ఆలయం ..ధనుర్మాసంలో దర్శించుకుంటే జన్మ ధన్యం!


తులా రాశి వారఫలం (Libra Weekly Horoscope)


ఈ వారం ఇంట్లో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేసుకుంటారు. ప్రేమికులు కుటుంబంలో వివాహం గురించి చర్చిస్తారు.  విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే అవకాశం ఉంది.  ఈ వారం ముఖ్యమైన కార్యకలాపాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. తీర్థయాత్రలకు వెళ్లే ఆలోచన ఉన్నవారు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగం మారే అవకాశం ఉంది. కార్యాలయంలో  వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది.  మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారం ప్రారంభంలో అనవసర వాదనలకు దూరంగా ఉండడం మంచిది.  పని  వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను కొనసాగించడం మీకు కష్టంగా ఉంటుంది.  పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.


Also Read: 12 ఏళ్లకోసారి విభీషణుడు సందర్శించే ఆలయం ఇది.. ధనుర్మాసంలో స్వామి వైభవం చూసితీరాల్సిందే!


వృశ్చిక రాశి వారఫలం  (Scorpio Weekly Horoscope)


ఈ రాశివారికి  వారం ప్రారంభంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కాగలవు. మీరు మీ బంధువుల నుంచి సంతోషకరమైన వార్తలు  అందుకుంటారు.  స్నేహితుల నుండి తగిన సహాయం పొందుతారు. మీ ప్రియమైనవారితో మనసులో మాట చెప్పేందుకు ఇదే మంచి సమయం.  వ్యాపారంలో భాగస్వామ్యానికి వారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి శుభసమయం.  కార్యాలయంలో ప్రతిదీ మీకు అనుకూలంగా ఉంటుంది. చిన్న వ్యాపారులకు ఈ వారం కలిసొస్తుంది.  మీ అనుమానాస్పద ప్రవర్తన మిమ్మల్ని ఇతరుల నుంచి దూరం చేస్తుంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఇష్టపడని పనులను కూడా చేయవలసి ఉంటుంది. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడం మానుకోండి. ఎక్కువ పనిభారం తీసుకోవద్దు. మీ చెడు అలవాట్లను వీలైనంత త్వరగా వదిలేయడానికి ప్రయత్నించండి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలను జాగ్రత్తగా నిర్వహించండి. ఏదైనా విషయానికి సంబంధించి అధిక ఒత్తిడి జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ఎవరినీ తేలిగ్గా నమ్మేయవద్దు. 


Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.