Horoscope Today 21st December 2024
మేష రాశి
ఈ రోజు మీ సన్నిహితులు కొంతమంది మిమ్మల్ని ఇబ్బందిపెడతారు. నిద్రలేమి సమస్య ఉండొచ్చు. లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. అవివాహితుల ఇంట్లో పెళ్లి చర్చలుంటాయి. వృత్తిపరమైన సమస్యలు తొలగిపోవచ్చు.
వృషభ రాశి
ఈ రోజు మతపరమైన కార్యక్రమాలలో డబ్బు ఖర్చు చేస్తారు. మీ సహోద్యోగుల కార్యకలాపాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో సీనియర్ల సలహాలను ధిక్కరించకండి. కార్యాలయంలో మెరుగైన పనితీరు కనబరిచేందుకు మీపై ఒత్తిడి ఉంటుంది.
మిథున రాశి
మీ జీవిత భాగస్వామికి ఈ రోజు బహుమతి ఇస్తారు. ఆర్థిక విషయాలలో మీరు చాలా అదృష్టవంతులు అవుతారు. వ్యాపారంలో మీ పరిచయాలను ఉత్తమంగా ఉపయోగించుకుంటారు. మీరు మంచి వ్యక్తుల సహవాసం నుంచి ప్రయోజనం పొందుతారు. మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు ఉంటాయి. నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.
Also Read: కన్యారాశి వారికి కొత్త సంవత్సరం 2025 ఎలా ఉంటుంది.. ఏ రంగాల్లో సక్సెస్ అవుతారో తెలుసా!
కర్కాటక రాశి
మీ మనస్సులో సహకారం , దాతృత్వ భావన ఉంటుంది. బంధుత్వాల విషయంలో సమస్యలు ఉంటాయి. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. భౌతిక సుఖాలుంటాయి. మీ పని కోసం ఇతరులపై ఆధారపడకండి. విదేశాలకు వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
సింహ రాశి
ఈ రాశి వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మనసులో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ప్రేమ భావన ఉంటుంది. కార్యాలయంలో మీ నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. పౌష్టికాహారం తినండి. సన్నిహితులను కలుస్తారు.
కన్యా రాశి
మీ లక్ష్యాల విషయంసో మీరు గందరగోళానికి గురవుతారు. తప్పుడు వ్యక్తుల సహవాసం హాని కలిగిస్తుంది. లైంగిక ఆలోచనలను నియంత్రించండి. దీని వలన మీ మనస్సు పరధ్యానంగా ఉంటుంది. ఎవరితోనూ వాదించవద్దు. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు
Also Read: 2025 భోగి నుంచి మహాశివరాత్రి వరకూ మహా కుంభమేళా - అది పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో రాజ స్నానం తేదీలివే!
తులా రాశి
ఈ రోజు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అనుభవజ్ఞుల నుంచి సలహా తీసుకోవడం మంచిది. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. ఉద్యోగం మారడం గురించి ఆలోచిస్తారు. ఆదాయం పెరుగుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చికరాశి వారికి ఈ రోజు మంచిది. రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ రోజు మీరు బంధువులను కలుస్తారు. ఉద్యోగంలో పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీరు చిన్న విషయాలను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. స్నేహితులతో సమయం గడుపుతారు.
ధనస్సు రాశి
ధనుస్సు రాశి వారికి బంధువులతో విభేదాలు ఉండవచ్చు. మీ పిల్లలతో గడపడం వల్ల సంతోషంగా ఉంటారు. కొత్త ఇల్లు కొనేందుకు ప్రణాళిక వేస్తారు. మతపరమైన ప్రయాణాన్ని ఆనందిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
మకర రాశి
ఈ రాశివారు ఈ రోజు నష్టాన్ని ఎదుర్కోవచ్చు. ఎవరి మనోభావాలను అగౌరవపరచవద్దు. సంభాషణలో చికాకు రాకుండా చూసుకోండి. అధిక రక్తపోటు రోగులకు సమస్యలు పెరుగుతాయి. బలహీనత కారణంగా కాలు నొప్పి ఫిర్యాదు ఉంటుంది. తినే విధానాన్ని మార్చుకోండి.
Also Read: మహా కుంభమేళా కోసం రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లు .. ఉచిత రైలు ప్రయాణం నిజమా!
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఇది మంచి రోజు. కుటుంబ సభ్యులతో సమయం గడుపుతారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రమాదకర పనులు చేయవద్దు.
మీన రాశి
మీనరాశి వారికి కెరీర్‌కు సంబంధించి కొనసాగుతున్న ఆందోళనలు తొలగిపోతాయి. మీరు కార్యాలయంలో కొన్ని సాంకేతిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. హఠాత్తుగా పెద్ద నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. కొత్త ఆదాయ వనరులు లాభిస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఎవరికీ సలహా ఇవ్వకండి.
Also Read: కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2025 - శని నుంచి విముక్తి , ఆర్థిక వృద్ధి, మానసిక ఆనందం ఉంటుంది కానీ..!
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.