Weekly Horoscope 21 To 27 July 2025 - వారఫలం జూలై 21 నుంచి 27
తులా రాశి (Libra Weekly Horoscope)
జూలై 21 నుంచి ప్రారంభమయ్యే ఈ వారం తులారాశివారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. శుభాశుభాలు రెండూ ఉంటాయి. వారం ఆరంభంలో మానసిక ఒత్తిడి ఇబ్బందిపెడుతుంది కానీ తర్వాత ఉపశమనం పొందుతారు. వారాంతంలో అంతా మంచే జరుగుతుంది. గతంలో ఎదుర్కొన్న నష్టాల నుంచి బయటపడతారు. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఆదాయంలో పెరుదల ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.
వృశ్చిక రాశి (Scorpio Weekly Horoscope)
వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా సాధారణంగా ఉంటుంది. గ్రహాల అనుకూల సంచారం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. వారం మధ్యలో చేపట్టిన పనికి ఆటంకం ఏర్పడుతుంది. ఆదాయం బాగానే ఉంటుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. స్నేహితులను కలుస్తారు. కుటుంబానికి సమయం కేటాయించండి. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి
ధనుస్సు రాశి (Sagittarius Weekly Horoscope)
ధనుస్సు రాశి వారికి జూలై నెలలో నాలుగోవారం అద్భుతంగా ఉంటుంది. ఈ వారం సంతోషంగా ఉంటారు. మీ ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు మీరు అప్రమత్తంగా వ్యవహరించండి. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. ఆదాయం బాగానే ఉంటుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. రావాల్సిన డబ్బు చేతికందుతుంది
మకర రాశి (Capricorn Weekly Horoscope)
మకర రాశి వారికి జూలై 21 నుంచి 27 లాభదాయకంగా అనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపిస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వారం చివర్లో శుభవార్త వింటారు. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి. నిరుద్యోగులు వారాంతంలో శుభవార్త వింటారు.
కుంభ రాశి (Aquarius Weekly Horoscope)
కుంభ రాశి వారికి గడిచిన వారం కన్నా ఈ వారం బావుంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. విద్యార్థుల పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. కళాత్మక నైపుణ్యం మెరుగుపర్చుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. అతిగా ఆలోచించవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి
మీన రాశి (Pisces Weekly Horoscope)
మీన రాశి వారికి ఈ వారం ఉత్సాహంగా గడుస్తుంది. అదృష్టం కలిసొస్తుంది. ఏపని ప్రారంభించినా సక్సెస్ అవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మీ ఆసక్తి పెరుగుతుంది. ఇంట్లో అతిథుల రాకపోకలు ఉంటాయి. ఉద్యోగం కోసం చూస్తున్న యువతకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వివాహం చేసుకోవాలనుకునే వారికి కొత్త పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి. ఆరోగ్యం బావుంటుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు - తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి