జనవరి 11 రాశిఫలాలు

మేష రాశి 

ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. పరిస్థితుల్లో సానుకూల మార్పు ఉంటుంది. అనవసరమైన విషయాలపై శ్రద్ధ పెట్టకూడదు. మీ మాట ఎదుటివారికి తప్పుగా అర్థం అవుతుంది. 

వృషభ రాశి

వృషభ రాశివారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. 

మిథున రాశి

ఈ రోజు మిథున రాశి వారు విసుగ్గా ఉంటారు. అనారోగ్య సమస్యలుంటాయి. ఎక్కువ దూరం ప్రయాణాలు చేయొద్దు. పాత అప్పులు మిమ్మల్ని ఇబ్బందిపెడతాయి.  అనవసర వాగ్ధానాలు చేయొద్దు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. 

Also Read: భోగి రోజు భగవంతుడిని పెళ్లి చేసుకున్న భక్తురాలు.. ఈ ప్రేమకథ చాలా ప్రత్యేకం!

కర్కాటక రాశి ఈ రాశివారి వ్యాపారంలో ఆదాయం పెరుగుతుంది . మీ పనిని ఇతరులపై రుద్దకండి. స్థిరాస్తి కొనుగోలు గురించి ఆలోచిస్తారు. నూతన పనులు ప్రారంభించేందుకు ఈరోజు మంచిది. పూర్వీకుల ఆస్తి కలిసొస్తుంది. 

సింహ రాశి

ఈ రోజు ముఖ్యమైన పనుల పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉంటారు. మీరు ఇతరులకు సహాయం చేయడంలో చురుకుగా ఉంటారు. అన్ని పనులు నిదానంగా అనుకున్న సమయానికి జరుగుతాయి. కుటుంబం నుంచి సహకారం లభిస్తుంది.

కన్యా రాశి

ఈ రాశి ఉద్యోగుల సామర్థ్యాన్ని అందరూ తక్కువ అంచనా వేస్తారు. మీ ఆలోచనలు తప్పుడు దిశగా వెళతాయి. మాటల్ని నియంత్రించడం చాలా కష్టం అవుతుంది. పొట్టకు సంబంధించిన ఇబ్బందులుంటాయి. ఇంటి వాతావరణంలో చికాకులుంటాయి. చిన్న విషయాలకే కుటుంబ సభ్యులతో గొడవ పడొద్దు. 

తులా రాశి

ఈ రాశివారు వృత్తిపరమైన కార్యకలాపాల్లో సమస్యలను ఎదుర్కొంటారు. మీ పని తీరు మార్చుకోవద్దు. ఎముకలకు సంబంధించిన ఇబ్బందులుంటాయి . ప్రభుత్వ అధికారులపై పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి అతిథి వచ్చే అవకాశం ఉంది. 

వృశ్చిక రాశి

ప్రేమ సంబంధాలకు సంబంధించి మీరు ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారంలో నూతన ఒప్పందాలు కుదురుతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు మీపై ఉంటాయి. ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారిపై ఒత్తిడి తగ్గుతుంది.  

ధనుస్సు రాశి 

ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. మీ సంకల్ప బలంతో అనుకున్న పని పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామికి సమయం కేటాయిస్తారు.  ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. పాత నష్టాల నుంచి ఇప్పుడు కోలుకుంటారు. నిరుద్యోగులు ఇంటర్యూలలో విజయం సాధిస్తారు.  

Also Read: భోగ భాగ్యాలనిచ్చే భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

మకర రాశి

మకర రాశి వారికి అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మీ కుటుంబ సభ్యులపై మీ కోపాన్ని వెళ్లగక్కకండి. మాటపట్టింపులకు పోవద్దు. ఉద్యోగులు, వ్యాపారులకు ఇది మంచి సమయం. 

కుంభ రాశి

ఈ రోజు కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మానసిక ఒత్తిడికి లోనవుతారు. ముఖ్యమైన పరికరాలు లేదంటే మీరు ప్రయాణించే వాహనం ఇబ్బందిపెడుతుంది. మనసులో ఆలోచనలు జీవిత భాగస్వామితో పంచుకుంటారు.  

మీన రాశి

ఈ రాశివారికి సన్నిహితులతో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు  పొందుతారు . స్వల్ప దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. విద్యారంగంలో రాణిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.