జనవరి 11 రాశిఫలాలు


మేష రాశి


ఈ రోజు మేష రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. కొత్త అతిథి రాకతో మీ కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. కొత్త ఇల్లు కొనాలనే మీ కల కూడా నెరవేరుతుంది. కుటుంబంలోని పెద్దలు పని విషయంలో మీ నుంచి కొన్ని సలహాలు తీసుకుంటారు. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీపై ఉంటాయి. 


వృషభ రాశి 


ఈ రోజు వృషభ రాశి వారికి సమస్యలతో నిండి ఉంటుంది. వ్యక్తిగత జీవితంలో సమస్యలు పెరుగుతాయి. స్నేహితులతో మంచి టైమ్ స్పెండ్ చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 


మిథున రాశి


ఈ రాశివారికి ఈ రోజు కష్టంగా ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. పెద్దల సలహాలు, సూచనలు పాటించడం మంచిది.


Also Read: భోగ భాగ్యాలనిచ్చే భోగి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!


కర్కాటక రాశి 


ఈ రాశివారింట్లో ఆస్తి వివాదాలుంటాయి కానీ కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడడం వల్ల కొంత ఉపశమనం పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. ప్రయాణాల్లో ముఖ్యమైన సమాచారం తెలుసుకుంటారు. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.   


సింహ రాశి 


ఈ రోజు సింహ రాశి వారికి మంచి రోజు కానుంది. ప్రయాణాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. స్నేహితులను కలుస్తారు. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించిన సమాచారం పొందుతారు. కుటుంబంలో వ్యక్తుల కెరీర్ కి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. 


కన్యా రాశి 


మీ పురోగతికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. కళారంగంలో ఉండేవారు పెద్ద బాధ్యతలను పొందవచ్చు. ఉద్యోగులు ఉన్నతాధికారుల నమ్మకాన్ని పొందుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. రోజంతా బిజీగా ఉంటారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. 


Also Read: సంక్రాంతి శుభాకాంక్షలు 2025.. వాట్సాప్, ఫేస్​బుక్​ ద్వారా ఫ్రెండ్స్, ఫ్యామిలీకి విష్ చేసేయండిలా


తులా రాశి


తులారాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారం చేసేవారు మంచి లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. మాటతీరు మార్చుకోవడం ద్వారా కుటుంబంలో సమస్యలను పరిష్కరించగలుగుతారు. 


వృశ్చిక రాశి 


ఈ రాశి వారు తమ పనిని చాలా ఆలోచనాత్మకంగా చేయాలి. ఇతరుల విషయంలో అనవసరంగా మాట్లాడకూడదు. రాజకీయాల్లో ఉండేవారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ మనసు చెప్పిందే చేయండి. ఉద్యోగులు పదోన్నతికి సంబంధించిన సమాచారం వింటారు. 


ధనుస్సు రాశి


ధనుస్సు రాశి వారికి ఈ రోజు చాలా గొప్ప రోజు. చాలా కాలం తర్వాత పాత స్నేహితుడిని కలవడం ఆనందంగా ఉంటుంది.  పురోగతికి అడ్డంకులు తొలగిపోతాయి. మీరు మీ పిల్లల వైపు నుంచి శుభవార్తలు వినొచ్చు. విద్యార్థులు చదువు గురించి ఆందోళన చెందుతారు. 


మకర రాశి 


ఈ రోజు మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. పెరుగుతున్న ఖర్చులు మీ తలనొప్పిని పెంచుతాయి. మీరు కొత్త ఇంటి కొనుగోలు కోసం రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఇంకొంతకాలం ఆగాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పాత తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి.  


కుంభ రాశి 


ఈ రోజు మీకు  మంచి రోజు అవుతుంది. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభ సూచనలతో ఆర్థిక ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. 


మీన రాశి 


వ్యాపారంలో హెచ్చు తగ్గులు కారణంగా ఆశించిన లాభాలు పొందలేరు. కొత్తగా పరిచయం అయినవారిని అతిగా నమ్మొద్దు. ఏ విషయాల్లోనూ రిస్క్ తీసుకోవద్దు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది.


Also Read: 600 కోట్ల ఖర్చు.. 7జన్మలకు గుర్తుగా 7ద్వారాలు.. మిల్లు కార్మికుడి కొడుకు కట్టిన అద్భుతమైన స్వర్ణ దేవాలయం!


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.