Sri Sobhakritu Nama Samvatsaram (2023-2024): శ్రీ శోభకృత్ నామ సంవత్సరం 2023-2024 వృశ్చిక రాశి ఫలితాలు
వృశ్చిక రాశి
విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదాలు 
ఆదాయం : 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 3


శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశివారికి గ్రహసంచారం అనుకూలంగా ఉంది. సంపత్తు కారకుడైనా గురుడు అనుకూల స్థానంలో ఉన్నందున మీలో అంతర్గతంగా ఉన్న ఆశలు నెరవేరుతాయి, ఆదాయం,గౌరవం పెరుగుతుంది. అర్థాష్టమ శని కారణంగా ఏడాది ఆరంభంలో అంతంతమాత్రంగా ఉన్నా రానురాను పరిస్థితి మెరుగుపడుతుంది. కోర్టు వ్యవహార్లో చిక్కుకున్న వారు ఈ ఏడాది వాటినుంచి బయటపడతారు విజయం సాధిస్తారు... 2023 ఉగాది నుంచి 2024 ఉగాది వరకూ  వృశ్చిక రాశివారికి ఎలాఉందంటే..



  • ఈ రాశివారు ఈ ఏడాది దూర ప్రాంతం ప్రయాణిస్తారు..పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు

  • బంధువుల్లో, సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది

  • వివాహ ప్రయత్నాలు కలిసొస్తాయి

  • ఆర్థికపరంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది

  • కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు

  • శత్రుబాధలు అంతరిస్తాయి..స్థిరాస్తి వ్యవహారాలు కలిసొస్తాయి

  • దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఈ ఏడాది కొంత ఉపశమనం లభిస్తుంది


Also Read:  శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి అష్టమంలో గురుడు ఆరోగ్యంపై దెబ్బకొడతాడు, ఏ రంగం వారికీ శుభఫలితాలు లేవు!


ఉద్యోగులకు


వృశ్చిక రాశి ఉద్యోగులకు శ్రీ శోభకృత్ నామసంవత్సరం అనుకూలంగా ఉంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం వృద్ధి చెందుతుంది, ఆర్థిక పరిస్థితి బావుంటుంది. నిరుద్యోగులు నూతన ఉద్యోగాల్లో స్థిరపడతారు. కాంట్రాక్టు ఉద్యోగులకు పర్మినెంట్ అవుతుంది.


విద్యార్థులకు


వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ ఏడాది గురుబలం బావుండడం వల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తారు. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇతర వ్యాపకాలపై దృష్టి సారించకుండా చదువులో దూసుకుపోతారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ర్యాంకులు, సీట్లు సాధిస్తారు


క్రీడాకారులు


శ్రీ శోభకృత్ నామసంవత్సరంలో వృశ్చిక రాశి క్రీడాకారులకు అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి


Also Read: ఈ రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఆరంభం అంతంతమాత్రం - ద్వితీయార్థం సరిలేరు మీకెవ్వరు!


వ్యాపారులకు


వ్యాపారులకు ఈ ఏడాది మంచి ఫలితాలుంటాయి. పెట్టిన పెట్టుబడులన్నీ లాభాలు తెచ్చిపెడతాయి. హోల్ సేల్, రీటైల్ వ్యాపారులు మునుపెన్నడూ లేని లాభాలు పొందుతారు. షేర్ మార్కెట్,రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టినవారు రెట్టింపు లాభాలు ఆర్జిస్తారు. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు కూడా లాభపడతారు


రాజకీయ నాయకులకు


శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో వృశ్చిక రాశికి చెందిన రాజకీయ నాయకులకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అధిష్టాన వర్గం నుంచి ప్రశసంలుంటాయి. ప్రజల సమస్యలు పరిష్కరించే మంచి నాయకుడిగా పేరు సంపాదిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మీ ముందు మోకరిల్లుతారు.ఎన్నికల్లో పోటీచేస్తే తప్పనిసరిగా విజయం సాధిస్తారు..


వ్యవసాయదారులు


వృశ్చి రాశి వ్యవసాయదారులకు ఈ ఏడాది రెండు పంటలు లాభాలొస్తాయి. వాణిజ్య పంటలు, చేపల చెరువుల వారికి అద్భుతమైన లాభాలొస్తాయి. కౌలుదార్లకు కూడా ఈ ఏడాది బాగానే ఉంటుంది



  • వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారికి సత్సంతానం, ఉద్యోగంలో ఉన్నతి

  • అనూరాధ నక్షత్రం వారికి ఉన్నత విద్య, పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత, ఉన్నతులతో పరిచయం, కొద్దిపాటి అనారోగ్యం

  • జ్యేష్ఠ నక్షత్రం వారికి కళ్యాణ శుభయోగం, ఉద్యోగంలో ఉన్నతి, దూర ప్రాంత ప్రయాణం


ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు. 
Note: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం..ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.