మార్చి 29 శనివారం రాశిఫలాలు
మేష రాశి
ఈ రాశివారు నూతన కార్యక్రమాలు చేపట్టేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఉద్యోగంలో మార్పుల గురించి ఆలోచిస్తున్నవారు జాగ్రత్తగా అడుగువేయాలి. అనారోగ్య సమస్యల్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీరు పనిచేసే ప్రదేశంలో మీ సూచనలకు స్వాగతం పలుకుతారు.
వృషభ రాశి
ఈ రాశివారు ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. మీరున్న రంగంలో పనిని సులువుగా పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు మీరు బాధపడేలా ప్రవర్తిస్తారు. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనేవారికి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి.
మిథున రాశి
ఈ రాశివారి ఆదాయ వనరులు పెరుగుతాయి. మీ గౌరవం పెరుగుతుంది. ఏదైనా విషయం గురించి ఆందోళన చెందుతున్నట్టైతే మీ జీవిత భాగస్వామి సలహా మీకు ప్రభావవంతంగా ఉంటుంది. రాజకీయాల్లో చేసిన ప్రయత్నాలు మీకు మంచివి. మీ ఇంటి పునరుద్ధరణ కోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తారు
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల సంవత్సర ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
కర్కాటక రాశి
ఎప్పటి నుంచో నిలిచిపోయిన రచనలను పూర్తి చస్తారు. ఉన్నత ఉద్యోగ అవకాశం మిమ్మల్ని వరిస్తుంది. వ్యాపారంలో కొన్ని కొత్త ప్రణాళికలపై పూర్తి శ్రద్ధ వహించాలి పాత స్నేహితుడిని కలుస్తారు. కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది.
సింహ రాశి
ఈ రోజు మీరు అనవసర చర్చలకు దూరంగా ఉండాలి. కుటుంబం నుంచి నిరాశపరిచే సమాచారాన్ని వినాల్సి రావొచ్చు. మీ శత్రువులు బలంగా ఉంటారు. కష్టపడి పనులు పూర్తిచేస్తారు. అనారోగ్య సమస్యలను విస్మరించవద్దు
కన్యా రాశి
ఈ రాశివారి ప్రయాణం ఈ రోజు ఒత్తిడితో కూడుకున్నది అవుతుంది. విద్యార్థులు అదనపు శ్రద్ధ వహిస్తేనే పరీక్షలు బాగా రాయగలరు. వ్యాపారంలో పాతలావాదేవీలు సమస్యలు క్రియేట్ చేస్తాయి. ప్రేమలో ఉండేవారు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేషం నుంచి మీనం వరకూ 12 రాశుల ఆదాయ వ్యయాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
తులా రాశి
పెండింగ్ పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి రావొచ్చు. నూతన ఆస్తిలో పెట్టుబడులు పెడతారు. పాత లావాదేవీ మీకు సమస్యగా మారుతుంది. మీరు పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి గౌరవం పెరుగుతుంది. నూతన ప్రయత్నాలు కలిసొస్తాయి. ఇంట్లో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ప్రశాంతంగా ఉంటారు. మీరున్న పనిలో అవార్డులు పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు కలిసొస్తాయి. మీ నిర్ణయం మీరే తీసుకోండి
ధనస్సు రాశి
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. నూతన అధ్యయనాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఏదైనా స్కాలర్ షిప్ సంబంధిత శుభవార్త వింటారు. అధికారులు మీ పనితీరు మెరుగుపర్చుకునే సలహాలు ఇస్తారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
మకర రాశి
ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు. మీరు చేపట్టే పనిలో స్నేహితుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రతికూల పరిస్థితిలో సహనాన్ని కొనసాగించాలి. ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితం పొందుతారు.
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
కుంభ రాశి
ఈ రోజు మీరు చేపట్టే పనులకు అడ్డంకులు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. కొత్త ప్రాజెక్టులు చేయాలనే ఆలోచన మేల్కొంటుంది. చాలాకాలం తర్వాత పాత స్నేహితుడిని కలిసే అవకాశం లబిస్తుంది. కొత్త ప్రత్యర్థులు ఏర్పడతారు.
మీన రాశి
ఈ రాశివారికి ఈ రోజు ఆర్థిక లాభం ఉంటుంది. ఎప్పటి నుంచో రావు అనుకున్న డబ్బులు చేతికందుతాయి. నూతన ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్లానే చేసుకుంటారు. ముఖ్యమైన పనుల విషయంలో తొందరపాటు వద్దు
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.