Daily Horoscope for june 3rd 2024: 


మేషం


ఈ రాశి వారికి  ఈ రోజు ఉద్యోగ విషయంలో శుభవార్తలు వింటారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ది చెందుతాయి. ఉద్యోగ అవకాశాలు పొందుతారు.


వృషభం


ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ విషయాలలో చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు అదుపు చేయడం మంచిది. పనులు నిదానంగా పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం నెలకొంటుంది.


మిథునం


ఈ రాశి వారికి ఈ రోజు అప్రయత్నంగానే పనులు పూర్తవుతాయి. అకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. సమాజంలో ఆదరణ పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేసే సూచనలున్నాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు.


కర్కాటకం


ఈ రాశి వారికి ఈ రోజు కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్యర్యం కలిగిస్తుంది. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అధికారుల నుంచి అనుకూలత ఉండదు. ప్రయాణాలలో ప్రమాద సూచనలున్నాయి.


సింహం


ఈ రాశి వారు ఈ రోజు చేపట్టిన పనులలో అకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి.


కన్య


ఈరోజు ఈ రాశి వారికి తండ్రి తరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు.


తుల


ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. స్థిరాస్థి వివాదాలు కలుగుతాయి. దైవ సంబంధిత కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో పనిభారం పెరుగుతుంది.


వృశ్చికం


ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. కావల్సిన వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.


ధనస్సు


ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆలోచనలు కలసివస్తాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.


మకరం


ఈ రాశి వారికి ఈ రోజు చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత  పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి.


కుంభం


ఈ రాశి వారికి ఈ రోజు రుణ భారం పెరగటం వల్ల నూతన రుణాలు చేయవలసి వస్తుంది. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధు మిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి.


మీనం


ఈరాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. రుణ ప్రయత్నాలు కలిసిరావు. దూరపు బంధువుల నుంచి విచారకర వార్త వినాల్సి వస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.


Note:  ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


ALSO READ: ఉజ్జయిని వెళ్తున్నారా? ఈ ఐదు దేవాలయాలను సందర్శిస్తే కోరికలు నెరవేరుతాయట