Daily Horoscope for july 21st 2024: 


మేషం


ఈ రాశి వారికి ఈరోజు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.


వృషభం


ఈ రాశి వారికి ఈరోజు  బంధు మిత్రులతో ఉన్న వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేసి మీ విలువ పెంచుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ది కలుగుతుంది. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.


మిథునం


ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రులతో ధన వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇంటి నిర్మాణ వ్యవహరాలు మందగిస్తాయి. చేస్తున్న వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.


కర్కాటకం


ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో కొందరి ప్రవర్తన ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. స్థిరాస్థి క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇతరుల నుంచి అవసరానికి సహాయం అందుతుంది. ఇవాళ పట్టిందల్లా బంగారంలా ఉంటుంది.


సింహం


ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. సోదరులతో స్థిరాస్థి వివాదాలు తొలగుతాయి. ఇంటికి మిత్రలు, చుట్టాల రాక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన విద్యా విషయంలో శుభవార్తలు వింటారు.


కన్య


ఈరోజు ఈ రాశి వారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంట్లో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.


తుల


ఈ రాశి వారికి ఈరోజు వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వలన నష్టపోతారు. నూతన రుణ యత్నాలు ఫలిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు.


వృశ్చికం


ఈ రాశి వారికి ఈరోజు  ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరుల సహాయంతో వివాదాల నుంచి బయట పడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి. బంధుమిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది.


ధనస్సు


ఈ రాశి వారు ఈరోజు కుటుంబ వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోరాదు. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ సందర్శన చేసకుంటారు. ఉద్యోగమున అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి.


మకరం


ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు చేసి లాభపడతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు.


కుంభం


ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించదు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు రావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.


మీనం


ఈరాశి వారికి  ఈరోజు ఇంటికి బంధు మిత్రులు రావడంతో సంతోషంగా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో అనుకూలత పెరుగుతుంది. స్థిరాస్థి వివాదాలు పరిష్కరించుకుంటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.


Note:  ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


ALSO READ: ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు.. కూరగాయలతో అమ్మవారిని ఎందుకు అలంకరిస్తారు!