Daily Horoscope for April 8th 2024:
మేష రాశి
ఈ రాశి వారికి ఈరోజు ఆనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో ఒత్తిడిలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. ఇంటా బయట అనుకోని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. వ్యాపారంలో కలిసిరాదు.
వృషభ రాశి
ఈరోజు ఈ రాశి వారికి నిరుద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. రుణ ఒత్తిడిలు తగ్గుతాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు చూస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.
మిథున రాశి
ఈ రోజు ఈ రాశి వారికి నిరాశ నిస్పృహలు పెరుగుతాయి. చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. ప్రతి విషయంలోనూ చికాకుగా ఉంటుంది. మానసిక ఆనారోగ్య సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలలో నిరాశే ఎదురవుతుంది. ఉద్యోగస్థులకు పనిభారం పెరుగుతుంది.
కర్కాటక రాశి
ఈ రాశి వారికి ఈరోజు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. స్థిరాస్థి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
సింహ రాశి
ఈ రాశి వారికి ఈరోజు చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు అమలు పరుస్తారు. బంధు మిత్రుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగస్థులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కన్య రాశి
ఈ రాశి వారి ఇవాళ కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో మెలుకువ వహించాలి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త. వృత్తి వ్యాపారాలు నిరాశజనకంగానే సాగుతాయి. ఉద్యోగులకు పై అధికారులను నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
తులా రాశి
ఈ రాశి వారికి ఇవాళ వృత్తి, వ్యాపారాలలో వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులకు వస్తాయి.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి ఇవాళ చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
ధనస్సు రాశి
ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఇంట్లో శుభకార్యలు జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.
మకర రాశి
ఈరాశి వారికి ఈరోజు వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. బంధువులతో విబేధాలు వస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది పడతారు.
కుంభ రాశి
ఈరోజు ఈ రాశి వారు అకస్మిక ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో స్వల్ప వివాదాలు ఏర్పడతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది.
మీన రాశి
ఈరాశి వారికి ఈరోజు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. సమాజంలో ప్రముఖుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.
Note: ఓక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
ALSO READ: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ కీలక నిర్ణయం