Daily Horoscope for April 7th 2024: 


మేష రాశి


ఈ రాశి వారు ఈరోజు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటా బయట రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.


వృషభ రాశి


ఈరోజు ఈ రాశి వారి స్థిరాస్థి వ్యవహారాల్లో వివాదాలు రాజీ చేసుకుని ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు కలసివస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలలో నూతన ఆలోచనలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు మరింత లాభసాటిగా సాగుతాయి.


మిథున రాశి


ఈ రోజు ఈ రాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అంతంతమాత్రంగానే సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం లభించదు.


కర్కాటక రాశి


ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.


సింహ రాశి


ఈ రాశి వారు ఈరోజు పాత మిత్రులతో కలసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు.


కన్య రాశి


ఈ రాశి వారికి ఇవాళ సన్నిహితులతో అకారణంగా విబేధాలు వస్తాయి. అవసరానికి చేతిలో డబ్బు ఉండదు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి.


తులా రాశి


ఈ రాశి వారు ఇవాళ దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారాలలో భాగస్థులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో స్థానచలన మార్పులున్నాయి.


వృశ్చిక రాశి


ఈ రాశి వారు ఇవాళ చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.


ధనస్సు రాశి


ఈ రాశి వారు ఈరోజు బంధువులతో ఉన్న తగాదాలను రాజీ చేసుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు.


మకర రాశి


ఈరాశి వారికి ఈరోజు వృత్తి, వ్యాపారాలు అంతగా కలిసిరావు. కుటుంబంలో వివాదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి.


కుంభ రాశి


ఈరోజు ఈ రాశి వారు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారంలో  భాగస్వాముల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి.


మీన రాశి


ఈరాశి వారికి ఈరోజు వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.


Note:  ఒక రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. 


ALSO READ: రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ నియమాలు తప్పక పాటించాలి, లేకపోతే?