Daily Horoscope for April 15th 2024 : గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్యులు రాశి ఫలితాలను అంచనా వేస్తారు. ఈరోజు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.


మేష రాశి


మేష రాశివారికి ఈరోజు కూడా శుభాలు కలుగుతాయి. పిల్లల భవిష్యత్తులో మంచి వృద్ధి కనిపిస్తుంది. ఆర్థికంగా కూడా లాభాలు కలుగుతాయి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. ఆ రోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.


వృషభ రాశి


ఈరోజు వృషభ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త సమస్యలు వచ్చే ప్రమాదముంది. ఖర్చులపై శ్రద్ద వహించండి. పెట్టుబడులు పెట్టే ఆలోచనలు మానుకోండి. మాట్లాడే ముందు జాగ్రత్త. వ్యాపారంలో మెరుగుదల ఉంటుంది. 


మిథున రాశి


ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ పూర్తిగా కోలుకోలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం బాగా సాగుతుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. తెలియనివారిని నమ్మడం అంత మంచిది కాదు.


కర్కాటక రాశి


కర్కాటక రాశివారు ఈరోజు కూడా కాస్త అలెర్ట్​గానే ఉండాలి. కుటుంబం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. వ్యాపారం మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేసే దగ్గర కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది.


సింహ రాశి 


ప్రయాణాలు చేసే అవకాశముంది. ఆర్థిక పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబ సమస్యలు కూడా దూరమవుతాయి. వ్యాపారం బాగుంటుంది. 


కన్య రాశి


ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమించినవారి పట్ల శ్రద్ధ తీసుకోండి. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశముంది.


తుల రాశి


ప్రయాణం చేసే అవకాశముంటుంది. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తిపరంగా విజయాలు పొందుతారు. ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మెరుగు ఉంటుంది. గణేశుడి పూజలో పాల్గొంటే ప్రమాదాలు దూరమవుతాయి.


వృశ్చిక రాశి


ఈరోజు ఏరూపంలోనైనా ప్రమాదం సంభవించవచ్చు. నెమ్మదిగా డ్రైవ్ చేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారానికి మాత్రం ఇది శుభ సమయం. కుటుంబ పరిస్థితులు కూడా బాగుంటాయి. 


ధనస్సు రాశి


కుటుంబ వ్యవహారాల్లో మీ జీవిత భాగస్వామి మీకు పూర్తిగా మద్ధతు ఇస్తారు. ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడతాయి. ప్రేమించిన వారిని కలిసే అవకాశముంటుంది. ఆరోగ్యం, వ్యాపారం బాగుంటుంది. 


మకరం


మీ శత్రువులతో కాస్త జాగ్రత్తగా ఉండండి. పెండింగ్​లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారం బాగుంటుంది. కుటంబ వ్యవహారాలు చక్కబడతాయి. 


కుంభ రాశి


కొన్ని విషయాల్లో భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబం, పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపారం బాగుంటుంది. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి. 


మీన రాశి


భౌతిక సంపద పెరుగుతుంది. గృహానికి సంబంధించిన కోర్టు వివాదాలు ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది.


Note:  ఓ రాశిలో ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.