Sun Transit in Cancer 2023


గ్రహాల రాజైన సూర్యుడు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తాడు.సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో ఇప్పటికే ఆ రాశిలో ఉన్న బుధుడితో కలసి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. జూలై  17 నుంచి  ఆగస్టు 16 వర ఇదే రాశిలో కొనసాగుతాడు. కర్కాటక రాశిలో సూర్యోదయం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తెస్తుంది.

  


మేష రాశి (Aries) (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)


కర్కాటక రాశిలో సూర్యోదయం మేషరాశివారికి అన్నింటా విజయాన్నిందిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి సూచనలున్నాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మీరు వివిధ రంగాలలో సంపాదిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నెలరోజుల్లో మీరో శుభవార్త వింటారు. అధ్యయనాలు చేసేవారికి కలిసొచ్చే సమయం. 


Also Read: జూలై 17 నుంచి దక్షిణాయనం ప్రారంభం- ఈ సమయంలో పాటించాల్సిన విధులివే!


మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)


సూర్య సంచారం వల్ల మిథునరాశివారి జీవితంలో అద్భుతమైన మార్పొస్తుంది. మకు ద్వితీయ స్థానంలో సూర్య సంచారం వల్ల సోదర, సోదరీమణుల మద్దతు లభిస్తుంది. వ్యాపారం బాగాసాగుతుంది. ఆర్థిక ప్రయోజనాలుంటాయి. అదృష్టం కలిసొస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగులు జీతం పెంపునకు సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిరోజూ సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే మంచి జరుగుతుంది. 


కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)
సూర్యుడు మీ రాశిలోనే అడుగుపెట్టనున్నాడు. ఈ గ్రహ గమనం వల్ల ఈ రాశివారికి అన్నీ శుభఫలితాలే గోచరిస్తున్నాయి. ఆరోగ్యం బావుంటుంది. దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులు సౌకర్యవంతమైన ఉద్యోగంలో స్థిరపడతారు. వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. అనుకోకుండా ఆస్తి కలిసొస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది. 


Also Read: జూలై 11 రాశిఫలాలు, ఈ రాశివారు సవాళ్లను స్వీకరించే ఉత్సాహంతో ఉంటారు


కన్యా రాశి  (Virgo) (ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు)


కర్కాటక రాశిలో సూర్యసంచారం కన్యారాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. సమయానికి డబ్బు చేతికందుతుంది. దీర్ఘకాలంగా ఉన్న భూముల కేసులు పరిష్కారమవుతాయి. వ్యాపారులు అధిక లాభాలను పొందుతాయి. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతి లభించే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు పరిష్కారమవుతాయి. మీ పిల్లల విజయానికి మీరు గర్వపడతారు.


తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)


జూలై 17  నుంచి ఆగస్టు 17 మీ కెరీర్లో మంచి రోజులుగా మారనున్నాయి. వరుస విజయాలు అందుకుంటారు. ఆర్థికంగా ఓ అడుగు ముందుకేస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి సమయం. చాలా కాలంగా వెంటాడుతున్న అనారోగ్య సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వివాదాలను సులభంగా ఎదుర్కొంటారు. సూర్యనమస్కారాలు చేయడం వల్ల మరిన్ని అనుకూల ఫలితాలు పొందుతారు. 


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం.ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.