Daily Horoscope for 25 August 2024 


మేష రాశి


ఈ రోజు మీకు శుభదినం. అన్ని పనులు ప్రణాళిక ప్రకారం పూర్తిచేస్తారు. చేపట్టిన పనులన్నింటిలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు లాభపడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. 


వృషభ రాశి


ఇంట్లో శుభ కార్యాల నిర్వహణకు సంబంధించి ప్రణాళికలు పూర్తిచేస్తారు. విద్యార్థులకు చదువులో అడ్డంకులు ఎదురవుతాయి. వైవాహిక బంధంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సంభాషణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. 


మిథున రాశి


ఈ రోజు మీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తెలివైన వ్యక్తుల సహకారం మీకు లభిస్తుంది. సాంకేతిక రంగంలో ఉండేవారు మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితిసాధారణంగా ఉంటుంది. 


Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు మీ బంధు, మిత్రులకు ఇలా తెలియజేయండి!


కర్కాటక రాశి


ఈ రోజు నూతన పెట్టుబడులు పెడితే భవిష్యత్ లో బాగా కలిసొస్తుంది. ఉద్యోగుల పనితీరు ప్రశంసలు అందుకుంటుంది. దాన ధర్మాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. వైవాహిక బంధం బావుంటుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. 


సింహ రాశి


బయటి వ్యక్తులతో వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. రియల్ ఎస్టేట్‌ లో భారీ  పెట్టుబడులు పెట్టడం మీకు ఇప్పుడు మంచిదికాదు.  వ్యాపార లక్ష్యాలను సకాలంలో సాధిస్తారు. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం  పెటరుగుతుంది.


కన్యా రాశి


ఈ రోజు కన్యా రాశి వారు నూతన వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో ఎక్కువ జోక్యం వద్దు. మీ భావాలను అందరి ముందు చెప్పొద్దు. మీకు నచ్చని వ్యక్తులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సంబంధిత సమస్యలు ఉంటాయి. 


తులా రాశి


ఈ రోజు మీరు మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వొద్దు. నూతన వ్యాపార ఒప్పందాలుంటాయి. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉన్నతాధికారుల సహకారం మీకుంటుంది. 


Also Read: శ్రీ కృష్ణుడు స్త్రీ లోలుడా..16 వేల మందితో శృంగారం చేశాడా..మీ ప్రశ్నలకు సమాధానం ఇదిగో!
వృశ్చిక రాశి


ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. వీరికి సాహిత్యం, కళల పట్ల సహజంగా ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడంతో బాధ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగులకు మంచి సమయం. 


ధనుస్సు రాశి 


ఈ రోజు మిమ్మల్ని మీరు క్రమశిక్షణతో ఉంచుకోండి. ప్రేమ సంబంధాలలో డబ్బుకు సంబంధించి వివాదాలు ఉండవచ్చు. విద్యార్థులకు చదువులో అడ్డంకులు ఎదురవుతాయి. మీ తెలివితేటల వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలి.


మకర రాశి


అనవసరమైన సమస్యలు మిమ్మల్ని చుట్టుముడతాయి.  వైవాహిక జీవితంలో గొడవలు రావచ్చు. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉండవచ్చు. మీరు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.  ఇంట్లోప్రతికూలత ఆధిపత్యం చెలాయిస్తుంది. తేలికపాటి ఆహారాన్ని తినండి. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి.


Also Read: ద్వారక నీట మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచీ అక్కడ ఏం జరిగిందో తెలుసా..!


కుంభ రాశి


వ్యాపారులు ఈ రోజు లాభపడతారు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నత స్థానాలను పొందుతారు. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకుంటారు.
 
మీన రాశి 


ఈ రోజు అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మతపరమైన ప్రదేశాలకు పర్యాటకానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. వ్యాపారులు సమయాన్ని వెచ్చిస్తే మంచి ఫలితాలు పొందుతారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.