Shree Krishna married 16 008 women: 16 వేల మంది గోపికలను శ్రీ కృష్ణుడు పెళ్లిచేసుకున్నాడు కదా..మరి స్త్రీలోలుడు కాదా అనే క్వశ్చన్ మిమ్మల్ని ఎవరైనా అడిగితే... అసలు ఇదెక్కడ చదివారో చూపించమనండి. ఎందుకంటే ఇది అస్సలు అవగాహన లేకుండా అడిగే ప్రశ్న. ఎందుకంటే శ్రీ కృష్ణుడు వివాహం చేసుకున్నది గోపికలను కాదు..రాచకన్యలను...
ఎవరా 16 వేల మంది?
నరకాసురుడు చెరపట్టిన రాచకన్యలు వాళ్లంతా..గోపికలు కాదు.. నరకాసురుడి సంహారం తర్వాత శ్రీ కృష్ణుడు వారిని తిరిగి వారి వారి రాజ్యాలకు పంపిస్తే వారి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అప్పుడు వాళ్లు నువ్వే శరణ్యం అని కోరుకుంటే వివాహం చేసుకున్నాడు అంతే. వాళ్లంతా గత జన్మలో మహావిష్ణువు పతిగా కావాలని తపస్సు చేశారు. అందుకే ఈ జన్మలో అయినా తమ కోరిక నెరవేరాలని కోరుకున్నారు.. ఆ కోర్కె తీర్చమని వేడుకుంటేనే శ్రీ కృష్ణుడు పెళ్లిచేసుకున్నాడు.
Also Read: ద్వారక నీట మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు నుంచీ అక్కడ ఏం జరిగిందో తెలుసా..!
అష్ట భార్యల సంగతేంటి?
అష్ట భార్యల్లో ఎవరినీ కూడా శ్రీకృష్ణుడు కావాలని వివాహం చేసుకోలేదు. శ్యమంతకమణి కోసం వెళ్లినప్పుడు జాంబవతి.. దాన్ని తిరిగి సత్రాజిత్ కి ఇచ్చినందుకు ప్రతిఫలంగా సత్యభామ...రుక్మిణి తాను ప్రేమించానని ప్రేమలేఖ రాసి పంపిస్తే రుక్మిణిని..ఇలా అష్టభార్యలందర్నీ వివిధ సందర్భాల్లో వివాహం చేసుకున్నాడు.
చివరకు..గోవులు, గోపాలురు, వేణువు..ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్ముడి స్పర్శను పొందాలనే అలా జన్మించాయి. భగవంతుడి స్పర్శను పొంది మోక్షానికి చేరువయ్యారు. ఎంతో తపస్సు చేస్తేకానీ పరమాత్ముడి సాన్నిధ్యం లభించలేదు.
రాముడికి ఓ భార్య..కృష్ణుడికి 16 మంది భార్యలు
ఒకటి త్రేతాయుగంలో వచ్చిన అవతారం..మరొకటి ద్వారపయుగంలో అవతారం. రెండూ శ్రీ మహావిష్ణువు అవతారాలే. అయితే రాముడు ఆదర్శమానవుడికి ప్రతీక..అందుకే మనిషిలానే ప్రవర్తించాడు. ఏకపత్నీవ్రతం అవలంబించాడు. కానీ శ్రీకృష్ణుడు పుట్టుక నుంచి భగవంతుడినే అని చెప్పుకుంటూ వచ్చాడు. అందుకే పుట్టుక నుంచి అవతార పరిసమాప్తి వరకూ ఎన్నో లీలలు ప్రదర్శించాడు.
Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి 2024 ఆగష్టు 26 or 27 - ఎప్పుడు జరుపుకోవాలి!
లీలలు రెండు రకాలు
1. ఆదర్శ లీలలు
అంటే..కులమత బేధాలు లేకుండా అందరితో కలసి చద్దన్నం తిన్నాడు..వెన్న దొంగిలించాడు..అల్లరి పనులు చేశాడు..
2. అద్భుత లీలలు
అంటే.. గోవర్థనోద్ధరణం, పూతన సంహారం, 16 వేలమంది గోపికలతో ఒకేసారి రాసలీలలు ఆడడం..ఇవన్నీ అద్భుతలీలలు..
16 వేల మందిని నిజంగా పెళ్లిచేసుకున్నాడా?
ఇప్పుడంటే పెళ్లి ఒక్కరోజు వేడుక...కొన్ని సందర్భాల్లో గంటలో ముగిసే సంతకాల పెళ్లిళ్లు. కానీ అప్పట్లో పెళ్లి అంటే ఐదు రోజుల వేడుక. మరి 16 వేల మందిని పెళ్లిచేసుకోవాలంటే ఒక్కొక్కరికి ఐదు రోజుల పాటూ కేటాయిస్తే 200 సంవత్సరాలకు పైగా పడుతుంది. కృష్ణుడు జీవించింది 125 సంవత్సరాలు మాత్రమే. అందర్నీ పెళ్లిచేసుకోవడం ఎలా సాధ్యం. ఓసారి ఇలాంటి సందేహమే నారదమహర్షికి వచ్చింది. ఇంతమందితో శ్రీ కృష్ణుడు ఎలా సంసారం చేస్తున్నాడో అని వెళ్లి చూడాలి అనుకున్నాడు. ద్వారకలో ఏ ఇంట్లో అడుగుపెట్టినా కృష్ణుడు కనిపించాడు. అప్పుడు అర్థమైంది..శ్రీకృష్ణుడితో రాసలీలలు అనేది కేవలం గోపికల ఆలోచన మాత్రమే.. మోక్షంకోసం భగవంతుడి సన్నిధిని కోరుకున్నారని అర్థం...
Also Read: మన దేశంలో ప్రముఖ శ్రీ కృష్ణ దేవాలయాలు..ప్రతి ఆలయం ప్రత్యేకమే!
రాసలీల అంటే శృంగారం కాదా?
రాసలీల అంటే ఈ తరానికి తెలిసిన విషయం అదొక్కటే..కానీ మీరు అనుకున్నది కాదు.అదో ఆధ్యాత్మిక తన్మయత్వం, మోక్షానికి చేరువయ్యే మార్గం మాత్రమే. బృందావనంలో నిధివన్ అనే ప్రదేశంలో రాసలీలలు ఇప్పటికీ జరుగుతుంటాయి. ఇప్పటికీ అక్కడ రాసలీలలు జరుగుతున్నాయనేందుకు ఎన్నో సాక్ష్యాలున్నాయి.
రోజూ అర్థరాత్రి అక్కడేం జరుగుతోంది..... ఈ నిధివన్ గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.
భాగవతంలో రాసలీల జరిగే సమయానికి కృష్ణుడికి 8 ఏళ్లు..రాధకి మూడేళ్లు...రాసలీలల గురించి వ్యాసమహర్షి అందించిన భాగవతంలో 29 నుంచి 33 అధ్యాయాల వరకూ ఉంది. ఈ ఐదు అధ్యాలను రాసపంచాధ్యాయాలు అని పిలుస్తారు...
వీటిని శ్రద్ధగా పారాయణం చేస్తే మితిమీరిన కామం కంట్రోల్ అవుతుంది...
అంటే..శృంగారానికి సంబంధించిన రాసలీల చదివితే శృంగార భావాలు పెరగాలి కానీ తగ్గడం ఏంటి అనే సందేహం రావొచ్చు..కానీ అదే కదా భగవంతుడి లీల.. రాసలీల ఆంతర్యం...