Vemulawada Temple News | తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం. కోరుకున్న కోరికలు కొంగుబంగారమై తీరుతాయని నమ్మకంతో నిత్యం వేల సంఖ్యలో రాజన్న స్వామిని దర్శించుకుంటారు. అలాంటి ఆలయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయన్న సమాచారంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.


వేములవాడ రాజన్న ఆలయంలో ఏసీబీ సోదాలు...
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఏసీబీ బీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సోదాలలో పలు తప్పిదాలు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. వేములవాడ రాజన్నను దర్శించుకునేందుకు వచ్చి నిద్ర కోసం తీసుకునే రూముల నుండి మొదలుకొని కోడిమొక్కులు విఐపి దర్శనాలు లడ్డు ప్రసాదాలు పులిహోర తలనీలాలు సమర్పించే కళ్యాణ కట్ట వరకు అన్నిచోట్ల అవకత అవకలు జరిగినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.


రికార్డుల్లో అన్ని తప్పులే...
రాజన్నను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎంతో ప్రీతిగా సేవించే లడ్డు పులిహోర అన్న ప్రసాదాల్లో కలిపే జీడిపప్పు, నెయ్యి వంటి వస్తువులలో రిజిస్టర్లో లెక్కలు తప్పులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. భక్తులు తమ మొక్కుకై తలనీలాలు సమర్పించేందుకు కల్యాణ కట్టకు వెళ్తే అక్కడ సుమారు 50 రూపాయల నుంచి మొదలుకొని 150 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు కూడా తలెత్తుతున్నాయి . అంతేకాకుండా భక్తులు రూములు తీసుకునే సమయంలో రసీదు ఇవ్వకుండానే భక్తుల వద్ద నుండి డబ్బులు తీసుకొని ఎలాంటి రసీదు ఇవ్వకుండా రికార్డులు మెయింటైన్ చేస్తున్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు.


అయితే వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గత రెండు రోజులుగా నిర్వహించిన ఈ సోదరుల్లో గంటల వ్యవధిలోనే ఎన్నో అవినీతి అవకతవకలు బయటకు వచ్చాయి. అయితే భక్తుల సౌకర్యార్థం ప్రసాదం అన్న ప్రసాదం పులిహోర రూముల విషయంలో కోడెమొక్కుల విషయంలో ఏసీబీ అధికారులు మరింత లోతుగా పరిశీలిస్తే రాజన్న ఆలయానికి వచ్చే ఆదాయం గండిపడకుండా ఉంటుందని పలు భక్తులు అంటున్నారు.


అయితే ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా తట్టుకోలేడు అన్న విధంగా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు మారినా వేములవాడ శ్రీ రాజరాజన్న రాజేశ్వర స్వామి ఆలయంలో అవినీతి అక్రమాలు మాత్రం ఆగడం లేదు. అయితే   ప్రభుత్వ కార్యాలయాలలో అవినీతి ఆరోపణలు జరుగుతున్న విషయం అయితే తెలిసిందే కానీ భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానం గా భావించే ఈ దైవ క్షేత్రంలో కూడా అవినీతి జరగడం సిగ్గుచేటుగా భావిస్తున్నారు సామాన్య ప్రజలు. మీసం ఇప్పటికైనా అధికారులు మరింత లోతుగా ఎప్పటికప్పుడు సోదాలు నిర్వహించినట్లయితే ఇలాంటి తప్పులు మరొకసారి జరగకుండా చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు...