Daily Horoscope for 20 August 2024
మేష రాశి
తమ లక్ష్యాన్ని సాధించడానికి ఉద్యోగులు మరో అడుగు ముందుకేస్తారు. కుటుంబంలో సమస్యలు పరిష్కరించేందుకు న్యాయంగా వ్యవహరించాలి. ఆర్థిక లావాదేవీలను సమీక్షించుకోవాలి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీ కలలు నెరవేరే సమయం ఆసన్నమైంది.
వృషభ రాశి
ఈ రాశి ఉద్యోగులు ఉన్నతాధికారుల సూచనలు అమలుచేస్తారు. కుటుంబంలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆస్తులను విక్రయించేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అవసర కోపం తెచ్చుకోవద్దు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్త.
మిథున రాశి
కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రయాణాల్లో లాభపడతారు. పనుల్లో ఎదురయ్యే అడ్డంకులను అధిగమిస్తారు.
కర్కాటక రాశి
ఈ రాశివారు తమ భావోద్వేగాలపై నియంత్రణ కలిగి ఉండాలి. ఈరోజు కుటుంబంలో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఆస్తిలో మీ తప్పుడు పెట్టుబడి కారణంగా దానిని త్వరలో విక్రయించడానికి ప్రయత్నిస్తారు. ఆస్తమా రోగులకు ఈరోజు శ్వాసలోపం వచ్చే అవకాశం ఉంది. మధుమేహం ఉన్నవారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.
సింహ రాశి
ఈ రాశి ఉద్యోగులు కార్యాలయంలో ఏకాగ్రతతో పనిచేయాలి. సానూకూల ఆలోచనలు కొనసాగించాలి. పాత వివాదం మళ్లీ తలెత్తే అవకాశం ఉంది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించాలి. వేగంగా మారుతున్న కాలంతో పాటూ మీరుకూడా మారాల్సి ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
Also Read: తెలివిగా మోసం చేయడంలో ఈ 6 రాశులవారు దిట్ట - వీళ్లతో జర జాగ్రత్త!
కన్యా రాశి
ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న సొమ్ము ఇప్పుడు చేతికందుతుంది. ఈ రోజు కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకునేందుకు ప్రయత్నించడం మంచిది. ఆకర్షణీయమైన రాబడికి సంబంధించి వాగ్ధానాలు చేసేవారిని నమ్మొద్దు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు తులారాశి ఉద్యోగులు అంకితభావంతో పనిచేయడం ద్వారా ఆశించిన ఫలితాలు పొందుతారు. కెరీర్లో పురోగతికోసం ప్రయత్నిస్తారు. పెట్టుబడులు తక్కువ లాభాలను అందిస్తాయి. ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించడానికి ప్రయత్నించండి. గతంలో చేసిన కర్మలకు ఫలితం పొందుతున్నట్టు భావిస్తారు. పాత వ్యాధులు తిరగబెడతాయి.
వృశ్చిక రాశి
ఈ రాశివారు ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. స్థిరాస్తి రంగంలో పనిచేసేవారికి మంచి లాభాలుంటాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీరు ఎంచుకున్న రంగంలో వృద్ధి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కలిసొస్తాయి. ఆదాయం పెరుగుతుంది. చిన్న చిన్న వివాదాలు ఎదురైనా పరిష్కరించుకోగలరు.
ధనస్సు రాశి
ఈ రాశి ఉద్యోగులు పనిచేసే ప్రదేశంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. కుటుంబ జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయి. కష్టపడి సంపాదించిన డబ్బును స్టాక్ మార్కెట్లో పెట్టాలి అనే ఆలోచన విరమించుకోవడం మంచిది. వ్యాపారం బాగానే సాగుతుంది. ఇతరులను విమర్శించవద్దు. చేపట్టిన పనుల్లో అడ్డంకులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు.
Also Read: తిరుమల హుండీలో సొమ్ము 3 భాగాలు - మీరు ఏ భాగంలో వేస్తున్నారు , ఎలాంటి ముడుపులు చెల్లిస్తున్నారు?
మకర రాశి
ఈ రోజు సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి శుభదినం..ఊహించని మంచి ఫలితాలు సాధిస్తారు. మీ ప్రవర్తనలో మార్పు వల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. దీర్ఘకాలకి లాభాలు ఆర్జించేందుకు ప్లాన్ చేసుకుంటారు. అనవసర ఒత్తిడిని జయించేదిశగా అడుగులు వేస్తారు. ఎలాంటి వాతావరణాన్ని అయినా మీకు అనుకూలంగా మార్చుకోగలరు.
కుంభ రాశి
నిరుద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. బంధువులను కలుస్తారు. సేవింగ్స్ కోసం పెట్టుబడులు పెడతారు. ఆలోచనల్లో సానుకూలతను పోగొట్టుకోవద్దు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు. అనవసర చర్చలకు దూరంగా ఉండడం మంచిది.
మీన రాశి
ఈ రాశి ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు ఉంటాయి. ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యాపారం చేసే వ్యక్తులు మంచి లాభాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. రాజకీయ వ్యక్తులతో పరిచయాలు అభివృద్ధి చెందుతాయి.. ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మీరు కొత్త ప్రణాళికతో పని చేయబోతున్నారు.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.