Solar Eclipse 2023: గ్రహణం ఏర్పడటమనేది ఖగోళ శాస్త్రానికి సంబంధించిన విషయమైనప్పటికీ జ్యోతిష్య శాస్త్రంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రతి రాశిపైనా ఈ గ్రహణ ప్రభావం పడుతుంది. ఈ గ్రహణం మనదేశంలో కనిపించకపోయినా కొన్ని రాశులపై ప్రతికూల, మరికొన్ని రాశులపై అనుకూల ప్రభావం చూపించనుంది. 

మేష రాశి

మేషరాశికి సూర్యగ్రహణం ఈ రాశినుంచి ఏడవ ఇంట్లో జరిగే అవకాశం ఉంది. ఇది మీకు ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఈ రాశి వివాహితుల మధ్య వివాదాలుంటాయి. ఆర్థికంగా కొంత నష్టపోవచ్చు.   ఉద్యోగం మరియు వ్యాపారంలో ఇబ్బందులు ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి సూర్య గ్రహణం సానుకూల ఫలితాలను ఇస్తోంది. కొత్త అవకాశాలు మీ తలుపు తట్టవచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయి...పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులకు లాభాలొస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. 

మిథున రాశి

సూర్యగ్రహణం వల్ల మిథున రాశివారికి అనుకూల ప్రభావం ఉంది. సొంత వ్యాపారం ఉన్నవారికైతే.. వారి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది.  విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధించేందుకు మరింత కష్టపడాల్సి  ఉంటుంది. వివాహితులు మాత్రం అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

కర్కాటక రాశి

సూర్యగ్రహణం కర్కాటక రాశివారికి ప్రతికూల ఫలితాలనిస్తోంది. తొందరపడి నిర్ణయం తీసుకోపోవడమే మంచిది. ఈ సమయంలో ఆస్తి కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి ఏదీ ప్రారంభించకపోవడం మంచిది. నూతన పెట్టబడులు అస్సలు పెట్టొద్దు.

Also Read: ఏప్రిల్ 20న సూర్య గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది, హైబ్రిడ్ సూర్యగ్రహణం అంటున్నారెందుకు!

సింహ రాశి

ఈ రాశివారికి సూర్య గ్రహణం ప్రభావంతో వివాద సూచనలున్నాయి..మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యం, కుటుంబ సభ్యుల పట్ల శ్రద్ధ వహించండి. 

కన్యా రాశి

ఈ రాశి విద్యార్థులు తమ వృత్తిలో విపరీతమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యక్తిగత , వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలం కావచ్చు. మీ ఖర్చులను పరిమితం చేసుకోండి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

తులా రాశి

ఈ రాశివారికి ఈ సూర్యగ్రహణం శుభప్రదమైన ఫలితాలనిస్తోంది. ఆర్థిక రంగంలో ప్రయోజనాలు పొందుతారు. వైవాహిక జీవితం బావుంటుంది.గ్రహణ సమయంలో నవగ్రహారాధన చేయడం శ్రేయస్కరం. ఆరోగ్యం జాగ్రత్త.

వృశ్చిక రాశి

ఈ  రాశివారిపై ఈ సూర్యగ్రహణం మిశ్రమ ప్రభావాలను చూపే అవకాశం ఉంది. తొందరపాటుతో ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. దానివల్ల నిరాశ తప్పదు. పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు తీసుకునే నిర్ణయాల గురించి ఆలోచించండి.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి స్థానికులు వారి ఆర్థిక రంగంలో వృద్ధిని అనుభవించే అవకాశం ఉంది. విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలి. ఉద్యోగులు శుభవార్త వింటారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. మీ దగ్గరి వ్యక్తులతో వాదనలకు దిగొద్దు

Also Read: వైశాఖ అమావాస్య రోజున గ్రహణం - ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

మకర రాశి

ఈ రాశివారికి సూర్యగ్రహణ మిశ్రమ ఫలితాలనిస్తోంది.  ఇప్పుడు చేసిన కష్టానికి భవిష్యత్తులో మంచి ఫలితం దక్కే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో ఉన్నతాధికారులతో గొడవపడే అవకాసం ఉంది. మీ ఆరోగ్యాన్నిజాగ్రత్తగా చూసుకోండి.

కుంభ రాశి

సూర్యగ్రహణం ప్రభావం ఈ రాశివారిపై అనుకూలంగానే ఉంటుంది. రోజంతా పనిలో బిజీగా ఉంటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలసి ఇష్టమైన ప్రదేశానికి ప్రయాణం చేస్తారు.

మీన రాశి

మీనరాశివారిపై సూర్యగ్రహణ ప్రభావం ప్రతికూల ఫలితాలనిస్తోంది. శారీరక, మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. సోమరితనం వీడాలి..అజాగ్రత్తగా కాకుండా అన్ని వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.