శాస్త్ర ప్రకారం పౌర్ణమికే కాదు అమావాస్యకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అమావాస్య రోజున పితృదేవతలను ఆరాధిస్తే వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. గ్రహబాధలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ సంవత్సరం ఏప్రిల్ 20న గురువారం వైశాఖ అమావాస్య వస్తోంది. ఈ అమావాస్య రోజున సూర్యగ్రహణం కూడా జరుగుతోంది. అలాగే కొన్ని అరుదుగా జరిగే కొన్ని గ్రహాల కలయిక కూడా జరుగుతోందని పండితులు చెబుతున్నారు. అందుకే ఈ సారీ వైశాఖ అమావాస్య చాలా విశిష్టమైందిగా అభివర్ణిస్తున్నారు. ఆ వైశిష్ట్యం ఏమిటి? ఎవరి మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయో ఒకసారి తెలుసుకుందాం.
ఏప్రిల్ 20వ తేదిన ఉదయం 7.05 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.29 గంటలకు ముగుస్తుంది. అంటే దాదాపు 5 గంటల 25 నిమిషాల పాటు ఉంటుంది. మనదేశంలో సూర్యగ్రహణం కనిపించదు కనుక సూతక కాలం మనకు వర్తించదని పండితులు స్పష్టం చేస్తున్నారు.
ఎన్నో యోగాలు
ఈ ఏడాది వైశాఖ అమావాస్య నాడు సర్వార్థ సిద్ధి ప్రీతి యోగం ఏర్పడుతుంది. దీనితో పాటు అదే రోజున శని జయంతి కూడా. అంతేకాదు ఈ సంవత్సరం ఏర్పడుతున్న మొదటి సూర్యగ్రహణం కూడా. అయితే ఇది మన దేశంలో కనిపించదని శాస్త్రవేత్తలు చేబుతున్నారు. కానీ ఈ రోజున జరుగుతున్న రకరకాల సంయోగాల వల్ల ఈ రోజు ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఏం చెయ్యాలి?
- వైశాఖ అమావాస్య నాడు స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు వేసుకుని స్నానం చెయ్యాలి. ఇది శని దోషాలకు పరిహారంగా పనిచేస్తుంది.
- పితృదేవతారాధన, శ్రాద్ధాం, పిండదానం, తర్పణం చేస్తే జాతకంలో ఉన్న పితృదోషాలు తొలగి పోతాయి.
- ఈ రోజు శివారాధన, శివాభిషేకం, శివస్తోత్ర పారాయణం చేస్తే కాలసర్ప దోషం తొలగిపోతుంది.
- ఏటినాటి శనివల్ల కష్టాలు అనుభవిస్తున్న వారు పొద్దునే రావి, మర్రి చెట్లకు నీళ్ల పోసి ప్రదక్షిణ చేసుకోవాలి. సాయంత్రం ప్రదోషవేళ ఈ చెట్ల కింద నేతిదీపం వెలిగిస్తే ఏలినాటి శని బాధలు కొంత ఉపశమిస్తాయి.
చెయ్యకూడని పనులు
- వైశాఖ అమావాస్య నాడు శుభకార్యాలు చెయ్యకూడదు.
- కొత్త వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం, షాపింగ్ చెయ్యకూడదు.
- గ్రహణం ఉన్నందున కొత్త పనులేవీ ప్రారంభించకూడదు.
- శని పూజ చేసుకుంటారు కనుక ఈ రోజున మినుములతో చేసిన ఏ వంటకం కూడా తినకూడదు. మినుములు ఈ రోజు ఆహారంలో వినియోగిస్తే శని పూజాఫలం దక్కదు.
- ఈ గ్రహణం మన దేశంలో కనిపించనందున సూతక కాలం వర్తించదు కానీ గ్రహణ ప్రభావం రాశీ చక్రంలోని 4 రాశులపై వ్యతిరేక ప్రభావం చూపనుందని జ్యోతిషం చెబుతోంది.
- వృశ్చిక రాశి – ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఖర్చులు అధికం, పనులు నిలిచిపోతాయి
మకర రాశి- ఈ రాశిలోనే సూర్యగ్రహణం ఏర్పడుతోంది కనుక వీరికి రకరకాల సమస్యలు రావచ్చు. పనిచేసే చోట ఇబ్బంది, ఖర్చులు పెరిగిపోతాయి.ఆర్థిక ఇంబందులు, జీవిత భాగస్వామితో విబేధాలు
- మేషరాశి – కలహాలు, సోదర సదరుల మధ్య విబేధాలు, ఆరోగ్య సంబంధ సమస్యలు
- కన్యా రాశి- దుర్ఘటనలు జరగవచ్చు, వాహనాలు నడిపేసమయంలో జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి, నిర్ణయాలు చేసేముందు జాగ్రత్త అవసరం.