గోచారరీత్యా శని మేషం మొదలుకొని అన్ని రాశుల్లో సంచరిస్తాడు. అంటే 12 రాశుల్లో సంచారం పూర్తిచేయడానికి మొత్తం 30 సంవత్సరాల సమయం పడుతుంది. 30 ఏళ్ళకు ఒకసారి ప్రతిఒక్కరిపై ఏలి నాటి శని ప్రభావం ఉంటుంది. ఏల్నాటి శని వల్ల కలిగే కష్టనష్టాలు ఉంటాయి. 12 వ రాశిలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, ఔషధ సేవనం, తరచూ ప్రయాణాలు జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, లపనిందలు, భాగస్వాములతో వైరం, మనశ్శాంతి లోపం, ధనవ్యయం. రుణబాధలు,వృత్తి, వ్యాపారాల్లో చికాకులు. స్థానచలన సూచనలు ఉంటాయి.
ఒక మనిషి జీవితంలో మూడు సార్లు ఏటినాటి శని బాధలు పడాల్సి ఉంటుంది. జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని మంగు శని అంటారు. రెండోసారి (30 సంవత్సరాల అనంతరం) వచ్చే ఏల్నాటి శనిని పొంగుశని అని అంటారు. ఈ కాలంలో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఆర్ధిక, ఆస్తిలాభాలు, గృహయోగాలు, ఉద్యోగయోగం వంటి ఫలితాలు కలుగుతాయి. మూడోసారి వచ్చిన శనిని మృత్యుశని అంటారు. ఈ కాలంలో ఆరోగ్య సమసయలు, అపమృత్యుభయం వంటి కష్టాలు ఎదుర్కొంటారు.
శని పేరు చెబితేనే అందరూ భయపడతారు. కానీ శని న్యాయం అందించే దైవం. సమవర్తిగా ఉండే అతడి గుణం అంటే అందరికి భయం. అతని దృష్టి సరిగా లేనపుడు ఇబ్బందులు తప్పవు. అదే అతడి చల్లని చూపు కూడా ఊహకందని ప్రయోజనాలను చేకూరుస్తుంది. ప్రతి వారి కర్మ ఫలాలను వారికి అందేలా చేసే దేవుడు శని. ఈ ఏడాది జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం కుంభ రాశిలో ఆయన సంచరిస్తున్నాడు. ఇదే సమయంలో శుక్రుడు కూడా వృశ్చిక రాశిలో సప్తమ దృష్టితో ఉన్నాడు. అందువల్ల షష్, మాళవ్య యోగం ఏర్పడుతోంది. అంగారకుడు వృశ్చికరాశ్యాధిపతి. ఏప్రిల్ 10 నుంచి మూడు రాశుల వారికి శని దశమ దృష్టి వల్ ప్రత్యేక ప్రయోజనాలు అందుతాయి. ఆ రాశులు ఏవో, వారికి కలిగే శుభాలేమిటో తెలుసుకుందాం.
వృషభ రాశి
వృశభరాశి వారికి శని దశమ దృష్టి శుభప్రదంగా ఉండబోతోంది. శని మీ గోచార ఫలితాలను అనుసరించి కర్మపాదంలో సంచరిస్తున్నాడు. తన దృష్టి ఏడో ఇంటి మీద ఉంది. ఇది మీ వైవాహిక జీవితంలోకి ఆనందాన్ని ఆహ్వానిస్తున్నట్టు అర్థం. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. భాగస్వామ్య వృత్తులు, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కేరీర్ పురోగతిలో ఉంటుంది.
సింహ రాశి
సింహరాశి వారికి శని దశమ దృష్టి లాభదాయకంగా ఉంటుంది. కళారంగానికి చెందిన వ్యక్తులకు చాలామంచి సమయంగా చెప్పుకోవాలి. మీలో ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. మంచి అవకాశాలు చేజిక్కించుకుంటారు. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఆత్మవిశ్వాసం చాలా మెరుగవుతుంది. వ్యాపారస్తులకు మంచి ధనలాభం ఉంటుంది. మొత్తంగా శని వీరికి చాలా అనుకూలుడుగా ఉన్నాడని చెప్పుకోవచ్చు.
కుంభరాశి
కుంభ రాశి వారికి శని దశమ దృష్టి చాలా అనుకూలంగా ఉండబోతోంది. కుంభరాశిలో రాజయోగం ఏర్పడింది అంతేకాదు, శుక్ర సంచారం వల్ల మాళవ్య రాజయోగం కూడా ఏర్పడింది. శని దశమ దృష్టి వల్ల వ్యాపారంలో మంచి లాభాలు చవిచూస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ఉద్యోగం లభిస్తుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది.
Also Read: గరుఢ పురాణం - రోజూ స్నానం చేయకుండా, మురికి దుస్తులు ధరిస్తే ఏం జరుగుతుంది?