OnePlus Nord CE 3 Lite : వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ (OnePlus Nord CE 3 Lite) 5G టెక్నాలజీతో మార్కెట్ లోకి అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్‌ఫోన్ వన్ ప్లస్ నోర్డ్ సీఈ 3 విత్ 2 బడ్స్ తో పాటు  దీన్ని ఏప్రిల్ ప్రారంభంలో లాంచ్ చేయగా.. ఈ రోజు నుంచి సేల్ కు సిద్ధంగా ఉంది. దీని ప్రారంభ ధర రూ.19,999 నిర్ణయించారు. ప్రస్తుతం దీన్ని అమెజాన్ తో పాటు వన్ ప్లస్ ఇండియా అధికారిక సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.


వన్ ప్లస్ నోర్డ్ CE 3 లైట్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. అందులో ఒకటి 8GB LPDDR4x RAM ..128GB UFS 2.2 స్టోరేజ్ కలిగి ఉంది. దీని ధర రూ.19,999 గా ఉంది. ఇక రెండోది టాప్-ఎండ్ వెర్షన్, 8GB LPDDR4x RAM..256GB UFS 2.2 స్టోరేజ్ కలిగి ఉంది. దీని ధర రూ.21,999 గా ఉంది.


OnePlus Nord CE 3 Lite 5G కొనుగోలుపై వన్ ప్లస్ కంపెనీ బ్యాంక్ ఆఫర్‌లను ప్రకటించింది. ఇందులో ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్/క్రెడిట్ కార్డ్‌లపై EMI కొనుగోళ్లు చేస్తే రూ.1,000 తక్షణ తగ్గింపు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌తో రూ. 2,299 విలువైన వన్ ప్లస్ నోర్డ్ బడ్స్ 2 (OnePlus Nord Buds CE)ని కూడా పొందుతారు. ఈ ఇయర్‌బడ్‌లు రెండు రంగులలో అందుబాటులో ఉన్నాయి: లైట్నింగ్ వైట్ అండ్ థండర్ గ్రే.


OnePlus Nord CE 3 Lite 5G ఫీచర్లు


OnePlus Nord CE 3 Lite 5G 6.72-అంగుళాల LCD డిస్‌ప్లేతో 2400 x 1080 పిక్సెల్‌ల రిజల్యూషన్,120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్ ( Qualcomm Snapdragon) 695 ప్రాసెసర్ తో వస్తుంది. 8GB RAM అండ్ 128GB లేదా 256GB వరకు ఆన్ బోర్డ్ స్టోరేజీతో లభిస్తుంది. అంతే కాదు ఇది సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్ 13 స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌పై నడుస్తుంది. ఇది 200% అల్ట్రా వాల్యూమ్ మోడ్‌ను కలిగి ఉంటుంది.  


ఇక కెమెరా సిస్టమ్‌ విషయానికొస్తే108MP ప్రైమరీ కెమెరా, 2MP మాక్రో లెన్స్, 2MP డెప్త్ కెమెరాతో పాటు.. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, ఈ ఫోన్‌లో 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీగా లభించే ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. దీనికి USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్ ద్వారా 67W సూపర్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్‌ సౌకర్యం ఉంది.  3.5mm హెడ్‌ఫోన్ జాక్ నూ కలిగి ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బరువు195 గ్రాములు కాగా.. 8.3mm మన్దమ్ కలిగి ఉంటుంది. ఇన్ని ఫీచర్స్, బెస్ట్ ఆఫర్స్ ఉన్న ఈ  OnePlus Nord CE 3 Lite.. ప్రస్తుతం  ట్రెండింగ్ లో ఉంది. న్యూ టెక్నాలజీని, బెస్ట్ కెమెరా సిస్టమ్ ను, ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ప్యాకేజీని పొందాలంటే తక్కువ ధరలో ఈ ఫోన్ మంచి ఎంపిక అవుతుందని పలువురు చెబుతున్నారు.


Read Also: టీనేజర్స్- రోజు 3 గంటలకుపై స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే, మీకు ఇబ్బందులు తప్పవు!