మీ ఆలోచన, మీ ఆచరణ సరైనవని మీలో మీకు ఉండే నమ్మకమే ఆత్మ విశ్వాసం లేదా కాన్ఫిడెన్స్. మీకు మీరు ఇచ్చుకునే గౌరవం. మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం ఇవ్వన్నీ ఆత్మ విశ్వాసం కిందకి వస్తాయి. ఇది జీవితంలో ప్రతి అడుగులో అవసరముండే భావన. చిన్నప్పుడు స్కూల్ నుంచి మొదలు పెడితే పెరిగి పెద్ద వారై జీవితంలో స్థిరపడి వృత్తిలో రాణిస్తూ జీవిత పర్యంతం కొనసాగించాల్సిన స్కిల్.


ఆత్మవిశ్వాసం సరిపడినంత లేని వారు సరిగ్గా కమ్యూనికేట్ చెయ్యలేరు. అభిప్రాయం సూటికగా చెప్పడానికి కూడా సంకోచిస్తారు. పనులు చక్కబెట్టడంలో తడబడుతారు. వీరికి అటు వర్క్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ రెండింటి మధ్య సమన్వయంలో కూడా సమస్యలు రావచ్చు. జీవితంలోని ప్రతి అడుగులో మనం ముందుండాలంటే తప్పనిసరిగా మన మీద మనకు విశ్వాసం ఉండడం చాలా ముఖ్యం.


మీ జాతక చక్రం, మీ రాశి మీ పర్సనాలిటికి ప్రతిబింబం వంటిదని జోతిష శాస్త్రం చెబుతుంది. మీ జాతక చక్రంలోని మొదటి ఇల్లు మీ మానసిక స్థితికి సంబంధించింది. ఇది కనుక బలంగా లేకపోతే మీరు ఆత్మవిశ్వాస లేమితో బాధ పడే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం నడుస్తున్న కాలం అంటే దశ లేదా మహార్ధశని బట్టి కూడా మీ ఫీలింగ్స్ ఆధారపడి ఉంటాయి. కొన్ని చిన్న చిన్న పరిష్కార మార్గాలు జ్యోతిష శాస్త్రం మనకు అందించింది. జాతక చక్రాన్ని అనుసరించి సూచించే ఈ పరిష్కార మార్గాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అలాంటి కొన్ని పరిష్కార మార్గాలు ఇక్కడ చూద్దాం.



  • మీ జాతక చక్రంలో కుజుడు మంచి స్థానంలో ఉంటే మీరు పగడం ధరించడం మంచిది. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.

  • బంగారం, రాగి తోచేసిన కెంపు పొదిగిన ఉంగరం చూపుడు వేలుకు ధరించడం ద్వారా ఆత్మ బలం పెరుగుతుంది.

  • మీ జాతక చక్రంలో సూర్యుడు బలంగా ఉండాలి. అందుకు ప్రతి రోజూ తప్పకుండా సూర్య ఆరాధన చెయ్యాలి.

  • ఆదిత్య హృదయం ప్రతి రోజూ చదువుకోవాలి. ‘‘ఓం రిం సూర్యాయై నమ:’’ మంత్రం ప్రతి రోజు 21 సార్లు జపించాలి.

  • ఏక ముఖి లేదా ఏకాదశ ముఖి రుద్రాక్ష ధరించడం ద్వారా ఆత్మ విశ్వాసం పెంచుకోవచ్చు.

  • ఒక మట్టి పాత్రలో తేనె తీసుకొని ఎవరూ లేని ప్రదేశంలో దాన్ని పాతి పెట్టడం వల్ల కూడా ఆత్మ విశ్వాస లేమి నుంచి బయటపడవచ్చు.

  • దైవం కచ్చితంగా మీకు అర్హత కలిగిన, మీరు కోరుకున్నఅన్నింటిని మీకు అందించేందుకు తగిన ప్రణాళిక రెడి చేసే ఉంటుంది. అయితే అందుకు తగిన అర్హత సంపాదించేందుకు తగిన శ్రమ మాత్రం చెయ్యడం తప్పదు.

  • రాత్రి 8 నుంచి 2.30 లోపు ‘‘ఓం క్లీం’’ అని జపించడం వల్ల మీకు కావల్సిన ఎనర్జీ మీరు యూనివర్స్ నుంచి పొందవచ్చు.

  • రాగి బిల్ల మెడలో ధరించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

  • బుదుడు మీలోని కాన్ఫిడెన్స్ కి , కమ్యూనికేషన్ కు కారణం అవుతాడు. బుధుడికి బలాన్ని అందిస్తే ఫలితంగా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

  • ఆవులకు పచ్చగడ్డి తినిపించడం, కుక్కలకు బుధ వారం నాడు ఆహారం ఇవ్వడం ద్వారా బుధ గ్రహానికి బలం ఇవ్వవచ్చు.

  • ఆత్మవిశ్వాస లేమి చాలా సిరియస్ ప్రాబ్లం. మీ జాతక చక్రంలో 5వ, 9వ, 3వ ఇళ్లు గ్రహదోశాని గురైతే మీలో ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. ఒక వేళ అలా జరిగితే మాత్రం అనుభవం ఉన్న జ్యోతిష నిపుణుడిని సంప్రదించి తగిన పరిహారాలు చేసుకోవడం అవసరం.


Also Read: కార్తీక వనభోజనాలు సరదా కోసం కాదు, వాటివెనుకున్న ఆంతర్యం ఏంటంటే!