మే 02 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఉండబోతుంది.మీ ప్రవర్తనలో వినయం , సర్దుకుపోయే మీ మనస్తత్వమే మీకు విజయాన్ని అందిస్తుంది. కుటుంబ సంబంధాలలో లోతు బంధం ఉంటుంది. మీ కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. భూమి, ఆస్తికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. భాగస్వామి కార్యకలాపాలపై దృష్టి పెడతారు. ఉద్యోగంలో కొత్త విజయాలు సాధించే అవకాశాలున్నాయి. వ్యాపారంలో మీకు లాభం ఉండొచ్చు. మీ లావాదేవీలు కూడా వేగవంతం కావొచ్చు. ఒక నమ్మదగిన మరియు ప్రత్యేక వ్యక్తి మీ పనులలో సహాయం చేస్తారు.
వృషభ రాశి
ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది. ఓ అపరిచిత వ్యక్తిని కలుస్తారు..వారినుంచి జీవితంలో కొత్త పాఠాలు నేర్చుకుంటారు. కష్టపడి పనిచేస్తారు...మీ పనితీరు మెచ్చుకుని మిమ్మల్ని అనుసరించేవారుంటారు. ఈ రాశి విద్యార్థులు కళాశాలలో కొత్తగా నేర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. రోజువారీ కంటే రేపు వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. ఏ పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు త్వరలోనే విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
మిథున రాశి
ఈ రోజు ఆనందకరమైన క్షణాలతో నిండి ఉంటుంది. కుటుంబం నుంచి శుభవార్త వింటారు. మీ అన్ని పనులు విజయవంతం అవుతాయి. పనిలో ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. మీ ప్రాజెక్ట్‌లో మీ సహోద్యోగి సహాయం చేస్తారు. కార్యాలయంలో స్నేహితులను కలుస్తారు. అన్ని రకాల పనులను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉండండి. మీ ఆలోచనల నుంచి ప్రయోజనం పొందుతారు
కర్కాటక రాశి
ఈ రోజు మీ కుటుంబంలో ఆనందం నిండి ఉంటుంది. మీ పని తీరుకి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తమ సన్నాహాలను కొనసాగించాలి. మీరు ఎప్పుడైనా సహాయం చేసిన వ్యక్తి రేపు మీకు ఉపయోగపడతాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంటేనే అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. ప్రియమైన వారిని కలుస్తారు.
సింహ రాశి
ఈ రోజు మీకు మంచి ఫలితాలుంటాయి. ఈ రోజు లభించే నూతన సమచారం భవిష్యత్తుకు ఉపయోగకరంగా ఉంటుంది. సోమరితనాన్ని వదిలి పనిలో మనస్సు పెట్టాల్సిన అవసరం ఉంది. వ్యాపారాన్ని పెంచే ప్రణాళికలను అమలు చేయడానికి ఈరోజు మంచిది. నూతన సాంకేతికతను ఉపయోగించడంపై చర్చ జరుగుతుంది. కార్యాలయంలో పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య జీవితంలో మంచి సామరస్యం ఉంటుంది
కన్యా రాశి
ఈ రోజు ఆనందంగా ఉంటారు. ఆలోచించిన పనులు సమయానికి పూర్తవుతాయి. కొన్ని పనులు సమయానికి ముందు పూర్తి చేయడం వల్ల ఆనందం కలుగుతుంది. మానసికంగా ఎవరితోనైనా సమస్య ఉన్నవారికి దాన్ని పరిష్కరించే మార్గం లభిస్తుంది. రేపు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీ భాషలో మధురతను కొనసాగించండి. ఈ రాశి విద్యార్థులు రేపు తమ చదువుకు సంబంధించి ఉత్సాహంగా ఉంటారు.
తులా రాశి
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉండబోతుంది. మీ బాధ్యతలను సరిగ్గా నిర్వహించడంలో విజయవంతం అవుతారు. ప్రతి విషయంలోనూ మీరు సానుకూలంగా ఉండాలి. ఓర్పు, వినయం కొనసాగించండి. పాత సమస్యల గురించి స్నేహితులతో మాట్లాడతారు. సమస్యకు పరిష్కారం కూడా లభించవచ్చు. మీ సలహా వల్ల ఇతరులకు ప్రయోజనం ఉంటుంది.నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. అనవసర ఖర్చులు తగ్గించండి
వృశ్చిక రాశి
ఈ రోజు మీకు శుభఫలితాలున్నాయి. ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఏదైనా ప్రత్యేక పనిలో ఇతరులతో మాట్లాడటం లేదా సలహా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఓ ముఖ్యమైన పనికోసం ప్రణాళికలు వేస్తారు. మీ ప్రణాళికలు విజయవంతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి సంబంధించిన ఏదైనా సమస్య పరిష్కారం అవుతుంది . ఇతరుల అవసరాలు , భావోద్వేగాల గురించి మీరు సున్నితంగా ఉండవచ్చు.
ధనుస్సు రాశి
ఈ రోజు మీకు మంచి ఫలితాలుంటాయి. ప్రశాంతంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఏదైనా పాత బకాయిని చెల్లించవచ్చు. ఇతరులను అర్థం చేసుకోవడంలో మీరు ముందుంటారు. ఏ పని చేసినా ఓర్పు , తెలివితేటలు అవసరం అని గుర్తుంచుకోండి. కుటుంబానికి సంబంధించిన పనులకు డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగులు ఉన్నతాధికారిని కలిసే అవకాశం ఉంది. నూతన పని ప్రారంభిస్తారు. దాంపత్య జీవితంలో సంతోషం కొనసాగుతుంది. రచన రంగంతో ముడిపడి ఉన్నవారికి మంచి శుభవార్త లభిస్తుంది.
మకర రాశి
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలుంటాయి. చాలా రోజులుగా కోరుకున్నది మీకు లభిస్తుంది. ఏదైనా ముఖ్యమైన విషయంలో మీ కంటే పెద్దవారి లేదా అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకుని ముందుకు సాగడానికి ప్రయత్నించండి.పనులను శ్రమ, ఓర్పు మరియు తెలివితేటలతో పూర్తి చేస్తారు. చాలా బాధ్యతలు ఉంటారు. వ్యాపారం పెరుగుతుంది. సానుకూల ఆలోచనలు కొనసాగుతాయి.
కుంభ రాశి
ఈ రోజు మీకు మంచి ఫలితాలుంటాయి. ఉన్నతాధికారుల సలహాలు మీకు కలిసొస్తాయి. మీ ప్రవర్తనలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. పాత విషయాలు మీకు గుర్తుకు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. మీ ప్రవర్తన అందరకీ నచ్చుతుంది. జీవిత భాగస్వామి మీ పనులలో సహాయం చేస్తారు
మీన రాశి
ఈ రోజుంతా సంతోషంగా ఉంటారు. కార్యాలయంలో పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. మీ కోసం సమయం దొరకడం కష్టం అవుతుంది. కానీ పనులు సమయానికి పూర్తి కావడం వల్ల ఆనందంగా ఉంటారు. బదిలీ లేదా ప్రమోషన్ కోసం ఎవరితోనైనా మాట్లాడవచ్చు. గృహ జీవిత బాధ్యతలను నిర్వహించడానికి పూర్తి ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు తమ అసంపూర్తి పనులను పూర్తి చేస్తారు. కుటుంబంలో ధార్మిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆహారంపై నియంత్రణ ఉంచుకోండి. మీ ఆలోచనలు ఎవరిపైనా రుద్దొద్దు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.