27 మే 2025 మీ రాశిఫలితం
మేషం రాశి (Aries)- 27 మే 2025
ఈ రోజు శుభ ఫలితాలున్నాయి . అత్యవసర పనిమీద ప్రయాణం చేయాల్సి రావొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో పెద్ద ఒప్పందం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక లాభం ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాల యోగం ఏర్పడుతుంది. కుటుంబంలోకి కొత్త అతిథి వస్తారు.
వృషభ రాశి (Taurus)- 27 మే 2025
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఆలోచించిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల యోగం ఏర్పడుతుంది. వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి.
మిథున రాశి (Gemini)- 27 మే 2025
కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించవచ్చు. కుటుంబంలో శుభకార్యాల యోగం ఏర్పడుతుంది.
కర్కాటక రాశి (Cancer)- 27 మే 2025
ఈ రోజు మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఓ ప్రత్యేకమైన పనిమీద బయటకు వెళ్లాల్సి రావొచ్చు. ప్రయాణం జాగ్రత్తగా చేయండి. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఆదాయానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది.
సింహం రాశి (Leo)- 27 మే 2025
ఈ రోజు మీకు హెచ్చుతగ్గులతో ఉంటుంది. ఆరోగ్యం కారణంగా ఇబ్బంది పడతారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వాహనం జాగ్రత్తగా నడపండి. నిర్లక్ష్యం కారణంగా గాయపడతారు. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి (Virgo)- 27 మే 2025
ఈ రోజు ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆహారంపై నియంత్రణ ఉంచుకోండి. బయట ప్రయాణం చేస్తే, వాహనాన్ని జాగ్రత్తగా ఉపయోగించండి. వ్యాపారంలో నష్టం వచ్చే అవకాశం ఉంది. దగ్గరి వ్యక్తి కారణంగా పెద్ద అవకాశం చేజారిపోవచ్చు.
తులా రాశి (Libra)- 27 మే 2025
ఈ రోజు పాత స్నేహితుడిని కలుస్తారు. మనసు సంతోషంగా ఉంటుంది. ఆగిపోయిన పని పూర్తవుతుంది. వ్యాపారంలో లాభయోగం ఏర్పడుతుంది. కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. కొత్త వాహనం కొనవచ్చు.
వృశ్చిక రాశి (Scorpio)- 27 మే 2025
ఈ రోజు మంచిగా ఉండబోతుంది. చాలా రోజులుగా ఆలోచిస్తున్న పని పూర్తవుతుంది. ప్రత్యేక వ్యక్తి సహాయం లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభం ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius)- 27 మే 2025
ఈ రోజు ఈ రాశివారు జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి చింతిస్తారు. కుటుంబం నుంచి సహాయం లభిస్తుంది. వ్యాపారంలో సహచరుల వ్యతిరేకత వల్ల పెద్ద నష్టం కావచ్చు. వాహనం నడపడంలో జాగ్రత్త వహించండి. పితృ సంపదలో మీ వాటా లభించవచ్చు.
మకర రాశి (Capricorn)- 27 మే 2025
ఈ రోజంతా చాలా బిజీగా ఉంటారు. కొత్త పనిని ప్రారంభించవచ్చు. అందుకు చాలా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారంలో సహచరుల ప్రవర్తన మంచిగా ఉంటుంది.
కుంభ రాశి (Aquarius)- 27 మే 2025
ఈ రోజు మీకు ఇబ్బందులతో కూడుకున్నది అవుతుంది. కోర్టు వివాదాల్లో చిక్కుకుంటారు. వ్యాపారంలో పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. శత్రువులు మీపై కుట్రలు పన్నుతారు. వ్యాపారంలో నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. మీన రాశి (Pisces)- 27 మే 2025
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. పెద్ద సమస్య నుంచి విముక్తి పొందుతారు. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. బంధువులు, స్నేహితుల నుంచి ఆర్థిక సహాయం లభిస్తుంది.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.
పాకిస్థాన్ ఆలయంలో మన ఘంటసాల పాట.. ఓ వ్యక్తి భక్తితో ఆలపిస్తున్న అద్భుత దృశ్యం... వీడియో చూసేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి!