2025 అక్టోబర్ 30 రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu 30 October 2025
మేష రాశి (Aries Horoscope)
ఈ రోజు మీకు చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఖర్చులను అదుపులో ఉంచుకుంటే మంచిది. మీ నిర్ణయం తీసుకునే సామర్థ్యం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది . ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభం వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు తమ ప్రయత్నాల్లో లోపం లేకుండా చూసుకోవాలి. జీవిత భాగస్వామి సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది.
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: ఎరుపు
పరిహారం: మంగళవారం హనుమంతునికి ఎర్ర సింధూరం సమర్పించండి.
వృషభ రాశి (Taurus Horoscope)
వ్యాపారంలో బాధ్యతలు పెరగడం వల్ల మంచి లాభం పొందుతారు. మీ పెద్ద లక్ష్యం నెరవేరుతుంది. మీ మనస్సులో స్థిరత్వం ఉంటుంది. ఎవరి వాహనాన్ని తీసుకుని డ్రైవ్ చేయొద్దు..ప్రమాదం జరిగే అవకాశం ఉంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. పెద్దలతో ఏదైనా విషయంలో పట్టుబట్టవద్దు. గృహ జీవితంలో ఎదురవుతున్న సమస్యల నుంచి మీరు బయటపడతారు. మీ శత్రువులు కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
అదృష్ట సంఖ్య: 2
అదృష్ట రంగు: తెలుపు
పరిహారం: దుర్గామాతకు పాలతో తయారు చేసిన నైవేద్యం సమర్పించండి
మిథున రాశి (Gemini Horoscope)
ఈ రోజు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. స్నేహితులు సహోద్యోగుల పూర్తి మద్దతు లభిస్తుంది. పని ప్రదేశంలో మీకు నచ్చిన పని దొరుకుతుంది. మీరు శుభ కార్యాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఏదైనా యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో వ్రాతపూర్వకంగా ఇవ్వడం మంచిది, లేకపోతే మీరు మోసపోయే అవకాశం ఉంది. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు.
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట రంగు: ఆకుపచ్చ
పరిహారం: గణేశునికి దూర్వను సమర్పించండి
కర్కాటక రాశి (Cancer Horoscope)
ఈ రోజు మీ ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీరు ధార్మిక పనులలో పాల్గొనడం మంచిది. పిల్లలకు సంస్కారాలను బోధిస్తారు. వ్యక్తిగత విషయాలపై మీరు పూర్తి దృష్టి పెడతారు. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. మీ పదవిలో ప్రతిష్ట పెరుగుతుంది. పెద్దల సహకారం మీకు లభిస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులతో మీ ఆగిపోయిన పని పూర్తవుతుంది. పిల్లలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాలి.
అదృష్ట సంఖ్య: 2
అదృష్ట రంగు: తెలుపు
పరిహారం: చంద్రునికి పాలలో చక్కెర కలిపి సమర్పించండి.
సింహ రాశి (Leo Horoscope)
ఈ రోజు మీకు చాలా ముఖ్యమైనది. కొన్ని విషయాలను రహస్యంగా ఉంచాలి . సలహా పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నాయకత్వ సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. మీరు చేసిన వాగ్దానాలను సకాలంలో నెరవేర్చడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాల్లో మీరు చురుకుగా ఉంటారు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది
అదృష్ట సంఖ్య: 9
అదృష్ట రంగు: బంగారు
పరిహారం: సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి
కన్యా రాశి (Virgo Horoscope)
ఈ రోజు మీకు వ్యాపారం పరంగా మంచిగా ఉంటుంది. స్నేహితుల మద్దతు లభిస్తుంది. కొంతమంది అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఏ పని చేయవద్దు. పని ప్రదేశంలో మీరు తప్పు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు ఏదైనా పరీక్షకు హాజరైతే మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు మరింత కష్టపడాలి. ఆస్తికి సంబంధించిన ఏదైనా డీల్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉంటే, అది ఇప్పుడు ఖరారు కావచ్చు.
అదృష్ట సంఖ్య: 7
అదృష్ట రంగు: లేత ఆకుపచ్చ
పరిహారం: దుర్గామాతను పూజించండి
తులా రాశి (Libra Horoscope)
ఈ రోజు మీకు ఆనందంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్దల మాట వినడం మంచిది. వ్యక్తిగత విషయాల్లో మీరు ముందుంటారు. సన్నిహితులతో కలిసి ఏదైనా వినోద కార్యక్రమంలో పాల్గొంటారు. లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. మీరు భాగస్వామ్యంలో ఏదైనా ఒప్పందంపై పని చేస్తే సంతకం చేశాకే ముందుకు సాగండి. కుటుంబ విషయాలలో జాగ్రత్త వహించండి.
అదృష్ట సంఖ్య: 4
అదృష్ట రంగు: నీలం
పరిహారం: శ్రీకృష్ణునికి తులసి ఆకులను సమర్పించండి
వృశ్చిక రాశి (Scorpio Horoscope)
ఈ రోజు మీకు శక్తివంతంగా ఉంటుంది. చేపట్టిన పనులు పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. పెద్దల మాట వినండి. దానధర్మాల పట్ల మీరు దృష్టి పెడతారు. కుటుంబ విషయాలలో బయటి వ్యక్తి సలహా తీసుకోకూడదు. తల్లిదండ్రుల ఆశీస్సులతో ఆగిపోయిన పని పూర్తవుతుంది. ఏదైనా విషయంలో పట్టుబట్టడం లేదా అహంకారం చూపించవద్దు. ఆదాయం పెరగడం వల్ల ఆనందానికి అవధులు ఉండవు.
అదృష్ట సంఖ్య: 8
అదృష్ట రంగు: ముదురు ఎరుపు
పరిహారం: శివలింగానికి నీటితో అభిషేకం చేయండి
ధనస్సు రాశి (Sagittarius Horoscope)
ఈ రోజు పనుల కారణంగా మీరు బిజీగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది. సంబంధాలలో కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రజా సంక్షేమ పనులపై దృష్టి ఉంటుంది. అందరితో సమన్వయం చేసుకోవడం మంచిది. సరైన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి.
అదృష్ట సంఖ్య: 3
అదృష్ట రంగు: పసుపు
పరిహారం: విష్ణు భగవానుడికి పసుపు పువ్వులను సమర్పించండి
మకర రాశి (Capricorn Horoscope)
ఈ రోజు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. మీ సుఖసంతోషాలు పెరుగుతాయి. అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నంలో మీరు విజయం సాధిస్తారు. మీరు కుటుంబంతో కలిసి ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొనవచ్చు. సాంప్రదాయక పనులపై ఆసక్తి ఉంటుంది వ్యాపారంలో మీకు నచ్చిన లాభం రావడంతో మీరు సంతోషిస్తారు. మీ పురోగతిని చూసి కొంతమంది శత్రువులు అసూయపడవచ్చు.
అదృష్ట సంఖ్య: 10
అదృష్ట రంగు: బూడిద
పరిహారం: శని దేవునికి ఆవాల నూనె సమర్పించండి
కుంభ రాశి (Aquarius Horoscope)
ఈ రోజు ఒక పెద్ద లక్ష్యం వైపు సాగుతారు. మీరు సృజనాత్మక పనులపై ఆసక్తి చూపుతారు. వ్యాపారంలో మీకు మంచి ప్రతిపాదన వస్తుంది. భాగస్వామ్యంలో పని చేసే అవకాశం ఉంది. మీ మనసులోని కోరిక నెరవేరుతుంది. పోగొట్టుకున్న వస్తువు తిరిగి దొరుకుతుంది. కుటుంబంలో సభ్యుల వివాహ ప్రతిపాదనకు అంగీకారం లభించవచ్చు.
అదృష్ట సంఖ్య: 11
అదృష్ట రంగు: ఊదా
పరిహారం: శని దేవుని ఆలయంలో నీలిరంగు పువ్వులను సమర్పించండి.
మీన రాశి (Pisces Horoscope)
ఈ రోజు కీర్తి గౌరవం పెరుగుతుంది. పెద్దల మాట వినండి. వ్యాపారానికి సంబంధించిన కొన్ని పథకాలు వేగం పుంజుకుంటాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి అవకాశం లభిస్తుంది. కుటుంబ సంబంధాలలో కొనసాగుతున్న విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. బంధువుల నుంచి శుభవార్త వినవచ్చు. మీరు ఏదైనా పథకంలో డబ్బు పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే నియమాలు పూర్తిగా పాటించండి.
అదృష్ట సంఖ్య: 7
అదృష్ట రంగు: లేత నీలం
పరిహారం: విష్ణు సహస్రనామం పఠించండి
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.