2025 ఆగష్టు 21st రాశిఫలాలు - Rasi Phalalu Today in Telugu August 21st 2025 

Continues below advertisement


మేష రాశి (Aries)


కెరీర్: ఈ రోజు ఉత్సాహంతో నిండి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి, సమాజంలో గౌరవం లభిస్తుంది.
వ్యాపారం: వ్యాపార భాగస్వామితో కలిసి చేసిన పనుల వల్ల లాభం ఉంటుంది. ఆస్తి డీలర్లకు సమయం అనుకూలంగా ఉంది.
ధనం: ఆర్థికంగా ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. మీరు ఓపెన్ మైండ్ తో పని చేస్తే మంచి వ్యక్తులు కలుస్తారు.
విద్య: విద్యార్థులకు కొత్త విషయాలు తెలుస్తాయి, దీనివల్ల చదువులో పురోగతి ఉంటుంది.
ప్రేమ/కుటుంబం: కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.  
పరిహారం: ఈ రోజు భగవంతునికి పండ్లు సమర్పించండి.
లక్కీ కలర్: ఎరుపు
లక్కీ నంబర్: 5


వృషభ రాశి (Taurus)


కెరీర్: మీ కష్టానికి ప్రతిఫలం పొందుతారు. పనిచేసే ప్రదేశంలో విజయం లభిస్తుంది.
వ్యాపారం: ఏదైనా కొత్త పని లేదా పథకం ప్రారంభించడం మీకు లాభదాయకంగా ఉంటుంది.
ధనం: ఆర్థికంగా ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది, ధన లాభానికి అవకాశాలు లభిస్తాయి.
విద్య: విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు.
ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో కలిసి వెళ్లడానికి ప్లాన్ చేస్తారు, సంబంధం బలపడుతుంది. భవిష్యత్తు ప్రణాళికల గురించి కుటుంబంతో చర్చిస్తారు.
పరిహారం: ధ్యానం చేయండి , పేదలకు సహాయం చేయండి.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నంబర్: 7


మిథున రాశి (Gemini)


కెరీర్: ఈ రోజు బాగుంది. మీ ఆలోచనలు, ప్రణాళికలు అందరకీ  నచ్చుతాయి.
వ్యాపారం: కొత్త పని ద్వారా ధన లాభం ఉంటుంది,మీ సలహాను పాటిస్తారు.
ధనం: ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
విద్య: విద్యార్థుల క్రమశిక్షణ వారికి విజయాన్ని అందిస్తుంది.
ప్రేమ/కుటుంబం: సంతానం విజయం ఆనందాన్నిస్తుంది. జీవిత భాగస్వామి బహుమతులు ఇస్తారు 
పరిహారం: ఈ రోజు ఆలయంలో దీపం వెలిగించండి.
లక్కీ కలర్: ఆకుపచ్చ
లక్కీ నంబర్: 6


కర్కాటక రాశి (Cancer)


కెరీర్: నాయకత్వం వహించే అవకాశాలు లభిస్తాయి. మీ ఆలోచనలకు ప్రాధాన్యత లభిస్తుంది.
వ్యాపారం: ఇతర రాష్ట్రాల్లో వ్యాపారం చేయాలనుకునే వారికి ఈ రోజు మంచిది.
ధనం: ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
విద్య: ఈ రోజు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది, ఇది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.
ప్రేమ/కుటుంబం: కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభిస్తుంది, కుటుంబ వాతావరణం బాగుంటుంది.
పరిహారం:  దుర్గా దేవికి ఎర్రటి పువ్వులు సమర్పించండి.
లక్కీ కలర్: తెలుపు
లక్కీ నంబర్: 4


సింహ రాశి (Leo)


కెరీర్: పని చేసే చోట కష్టపడితే విజయం సాధిస్తారు. పరిపాలనా సిబ్బందికి లాభం ఉంటుంది.
వ్యాపారం: రియల్ ఎస్టేట్ , వినోద పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది.
ధనం: ఆర్థిక లాభానికి అవకాశాలు ఉన్నాయి, పనితో సంతృప్తి లభిస్తుంది.
విద్య: విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు.
ప్రేమ/కుటుంబం: ఇంట్లో పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబంలో సహకారం లభిస్తుంది.
పరిహారం: శివునికి నీరు సమర్పించండి.
లక్కీ కలర్: బంగారు
లక్కీ నంబర్: 1


కన్యా రాశి (Virgo)


కెరీర్: బహుళజాతి కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
వ్యాపారం: ఏదైనా ముఖ్యమైన పని గురించి ఆలోచించడానికి అవకాశం లభిస్తుంది.
ధనం: ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
విద్య: విద్యార్థులు సృజనాత్మక పనులలో ముందుంటారు.
ప్రేమ/కుటుంబం: ప్రేమికులు తమ సంబంధాన్ని కుటుంబ సభ్యులతో చర్చిస్తారు , అంగీకారం పొందుతారు.
పరిహారం: విష్ణువుకు తులసి దళాలను సమర్పించండి.
లక్కీ కలర్: నీలం
లక్కీ నంబర్: 9


తులా రాశి (Libra)


కెరీర్: ఆఫీసు పనిని సకాలంలో పూర్తి చేయండి 
వ్యాపారం: వ్యాపారాన్ని విస్తరించడానికి వేసిన ప్రణాళిక విజయవంతమవుతుంది.
ధనం: ఆర్థిక లాభం ఉంటుంది, రోజు లాభదాయకంగా ఉంటుంది.
విద్య: విద్యార్థులకు చదువుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది.
ప్రేమ/కుటుంబం: మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, కుటుంబంతో మంచి సమయం గడుపుతారు.
పరిహారం: ఏదైనా ఆలయంలో పేదలకు భోజనం పెట్టండి.
లక్కీ కలర్: గులాబీ
లక్కీ నంబర్: 2


వృశ్చిక రాశి (Scorpio)


కెరీర్: అధికారుల సహకారం లభిస్తుంది, పనులు పూర్తవుతాయి.
వ్యాపారం: కొత్త వ్యాపారం ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది.
ధనం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
విద్య: విద్యార్థులు సృజనాత్మక పనులలో విజయం సాధిస్తారు.
ప్రేమ/కుటుంబం: ప్రేమికులు విహారయాత్రకు వెళతారు, వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.
పరిహారం: గణేశునికి గరిక సమర్పించండి.
లక్కీ కలర్: నలుపు
లక్కీ నంబర్: 8


ధనుస్సు రాశి (Sagittarius)


కెరీర్: రోజు మిశ్రమంగా ఉంటుంది 
వ్యాపారం: వ్యాపారంలో ఆలోచించి అడుగులు వేయండి.
ధనం: ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
విద్య: విద్యార్థులు  సృజనాత్మక నైపుణ్యాలను నేర్చుకుంటారు.
ప్రేమ/కుటుంబం: జీవిత భాగస్వామితో విభేదాలు తొలగిపోతాయి. పిల్లలతో సమయం గడుపుతారు.
పరిహారం: రావి చెట్టు కింద దీపం వెలిగించండి.
లక్కీ కలర్: పసుపు
లక్కీ నంబర్: 3


మకర రాశి (Capricorn)


కెరీర్: ప్రభుత్వ రంగంలో పనిచేసేవారు లాభపడతారు. పాత లావాదేవీల గురించి చర్చిస్తారు.
వ్యాపారం: వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది.
ధనం: ధన లాభానికి అవకాశాలు ఉన్నాయి.
విద్య: విద్యార్థులు విజయం సాధిస్తారు.
ప్రేమ/కుటుంబం: ప్రేమికులు విహారయాత్రకు వెళతారు, అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
పరిహారం: శనికి నువ్వుల నూనె  సమర్పించండి.
లక్కీ కలర్: బూడిద
లక్కీ నంబర్: 8


కుంభ రాశి (Aquarius)


కెరీర్: ఆఫీసులో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి.
వ్యాపారం: డబ్బు విషయంలో పురోగతి ఉంటుంది, కొత్త పథకాలపై పని చేయండి.
ధనం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
విద్య: విద్యార్థులకు రోజు లాభదాయకంగా ఉంటుంది.
ప్రేమ/కుటుంబం: కుటుంబం, స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు
పరిహారం: శివునికి అభిషేకం చేయండి.
లక్కీ కలర్: ఊదా
లక్కీ నంబర్: 4


మీన రాశి (Pisces)


కెరీర్: కళ , సాహిత్యం రంగంలో ఉన్నవారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది.
వ్యాపారం: బేకరీ లేదా ఆహార వ్యాపారంలో లాభం ఉంటుంది.
ధనం: ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది.
విద్య: విద్యార్థులకు కెరీర్ కోసం గురువుల మార్గదర్శకత్వం లభిస్తుంది.
ప్రేమ/కుటుంబం: కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది, క్రీడలకు సంబంధించిన వారికి అవకాశాలు లభిస్తాయి.
పరిహారం: విష్ణు సహస్రనామం పారాయణం చేయండి.
లక్కీ కలర్: నీలం
లక్కీ నంబర్: 6


గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.