Numerology prediction 2nd October 2022 : న్యూమరాలజీ ప్రకారం అక్టోబరు 1 శనివారం రోజు ఏఏ తేదీల్లో పుట్టినవారికి ఎలా ఉంటుందో.... ఫలితాలు తెలుసుకుందాం...
నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
ఈ రోజు మీరు కొత్త ప్రణాళికలు అమలు చేసేందుకు మంచి రోజు. ముఖ్యమైన విషయాల్లో ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. వాతావరణ మార్పు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.
నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)
మీరు వ్యాపారంలో లాభం పొందుతారు. ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఈరోజు సాధారణ రోజు అవుతుంది.
నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
ఈ రోజు మీ మనసు సంతోషంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలు వస్తాయి. కుటుంబ సమేతంగా ఎక్కడికైనా వెళ్లాలనే ఆలోచన ఉండవచ్చు. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. నిలిచిపోయిన పాత పనులు పూర్తి చేస్తారు.
Also Read: విజయం, ఆదాయం - అక్టోబర్ నెల ఈ ఏడు రాశులవారికి అదిరింది!
నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
కొత్త కొత్త ఆలోచనలు ఇప్పుడు చేయడం సరికాదు. నూతన వ్యాపార ప్రయత్నాలు విఫలం అవుతాయి. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకండి. మీరు ఈరోజు పాత స్నేహితులను కలుసుకోవచ్చు.
నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆఫీసులో మీకు కొత్త బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. మీ పని సామర్థ్యం పెరుగుతుంది. మీరు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
ఈ రోజు మీరు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కార్యాలయ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
Also Read: అనుకోని వివాదాలు, ఖర్చులు - అక్టోబర్ నెల ఈ ఐదు రాశులవారికి అంత అనుకూలంగా లేదు!
నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
వ్యాపార పనులకు సంబంధించిన యాత్రకు వెళ్లాల్సి వస్తుంది. ఏదో ఒక కారణంగా కుటుంబంలో చీలికలు రావచ్చు. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది.
నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారం పెరుగుతుంది. మనసులో కొత్త ఆలోచనలు వస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. సృజనాత్మక పని పట్ల మొగ్గు పెరుగుతుంది. సామాజిక రంగంలో కార్యాచరణ పెరుగుతుంది.
నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
సహోద్యోగుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. మనసులోకి ప్రతికూల ఆలోచనలు రానివ్వవద్దు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మీరు తలపెట్టిన పనులు పూర్తవుతాయి.