October 2022 Horoscope: దసరా, దీపావళి లాంటి పండుగలతో నిండిన అక్టోబరు నెల ఏ రాశులవారికి ఎలా ఉంది.  ఒక్కో గ్రహం నెలకోసారి రాశులు మారుతుంది ఆ ప్రబావం ఎవరిపై ఏ మేరకు పడుతుంది. ఈ నెలలో ఏ రాశులవారి గ్రహస్థితి బావుంది, ఎవరి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదో చూద్దాం..ముఖ్యంగా ఐదు రాశులవారుకు ఆరోగ్యం, ఆహారం, ధనం విషయంలో జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు...


మేష రాశి
అక్టోబర్ నెల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. మీ మాటతీరుపై మీకు నియంత్రణ లేకుంటే చాలామందితో విభేదాలు రావొచ్చు. కెరీర్లో చిన్న సమస్య ఎదురైన తర్వాత అనుకున్న సక్సెస్ అందుకుంటారు. మీరు పనిచేసే రంగంలో ఒక చిన్న సమస్య ఎదురైన తర్వాత అనుకున్న విజయాన్ని అందుకుంటారు. మీరు ఒక స్నేహితుడికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. లావాదేవీల పరంగా జాగ్రత్త వహించాలి. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు పరిశోధించి ముందుకు సాగాలి. కుటుంబ సభ్యులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించండి. ప్రమాదకరమైన పెట్టుబడులు పెట్టే సహాసం చేయకండి. 


కన్యా రాశి
కన్యారాశి వారికి అక్టోబర్ మాసంలో మిశ్రమ ఫలితాలున్నాయి.  శారీరక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆహారంపై అశ్రద్ధ చూపొద్దు. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. నెల  రెండో వారంలో వ్యాపారంలో పని చేయడానికి చుట్టుపక్కల లేదా దూరంగా ఎక్కడైనా ఒక ట్రిప్ కు వెళ్లాల్సి ఉంటుంది. భూమి లేదా ఇల్లు కొనాలని ఆలోచిస్తుంటే, ఈ కోరిక నెరవేరుతుంది. ఈ రాశివారు నెల ద్వితీయార్థంలో అధిక ప్రసంగం తగ్గించుకుంటే మంచిది... అప్పుడే వారు కోరుకున్న ప్రయోజనాలను పొందుతారు.


Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే


ధనస్సు రాశి 
ధనస్సు రాశివారికి అక్టోబర్  నెల అంత అనుకూలంగా లేదు. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురవుతాయి. పలుకుబడి ఉన్న వ్యక్తి సహాయంతో ఒక పెద్ద ప్రాజెక్టులో పనిచేసే అవకాశం ఉంటుంది, వ్యాపార సంబంధిత ప్రయాణాలు సాధ్యమవుతాయి, మీ ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. నెల మధ్యలో ఆఫీసులోని సహోద్యోగుల సహాయంతో మీరు లక్ష్యాన్ని సాధిస్తారు. జీవిత భాగస్వామితో కొద్దిగా విభేదాలు ఉండవచ్చు.


మకర రాశి
అక్టోబర్ నెల ప్రారంభం మకర రాశివారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార సంబంధిత ప్రయాణాల వల్ల బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. ఇంట్లో ఒక వ్యక్తి  కారణంగా డిస్ట్రబెన్స్ ఉంటుంది.  ఇంటికి సంబంధించిన కొన్ని పెద్ద ఖర్చులు ఉండొచ్చు. నెల మధ్యలో ఏదైనా పెద్ద నిర్ణయం  తీసుకునే ముందు మీ శ్రేయోభిలాషులను సంప్రదించాలి. నెలాఖరు నాటికి మీరు తలపెట్టిన పనుల్లో  గందరగోళానికి గురవుతారు. ప్రేమికులకు ఈ మాసం చాలా శుభప్రదంగా ఉంటుంది. 


Also Read: అమ్మవారి వెంటే అయ్యవారు, ఇంత ప్రేమ పొందడం ఎవరికి సాధ్యం!


కుంభ రాశి
కుంభ రాశి జాతకులు నెల ప్రారంభంలో కొన్ని వ్యాపార సమస్యలను ఎదుర్కొంటారు. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. లావాదేవీలు, పెట్టుబడుల సమయంలో జాగ్రత్తగా ఉండండి. వివేకం, విచక్షణతో నిర్ణయాలు తీసుకోండి. పిల్లలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండండి. వారి భావాలను అర్థం చేసుకోండి. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.