Numerology Horoscope 30 January 2024
నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)
ఈ రోజు నంబర్ వన్ లో జన్మించిన వ్యక్తులు గుడ్ న్యూస్ వింటారు. అనారోగ్యంతో ఉన్నవారికి ఈ రోజు ఉపశమనం లభిస్తుంది. ఆదాయం బావుంటుంది. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు మరోసారి ఆలోచించాలి. దూర ప్రయాణాలు అలసటగా మారతాయి
నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20, 29)
ఈ రోజు నంబర్ టూ లో పుట్టిన వారికి శుభసమయం. ఓ అవసరం కోసం ఆస్తిలో కొంత భాగాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. అదృష్టం కలిసొస్తుంది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది.
నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)
సంఖ్యాశాస్త్రం ప్రకారం మీ నంబర్ 3 అయితే ఈ రోజు మీ జీవితంలో కొన్ని మార్పులు తీసుకురావాలని అనుకుంటారు. ప్రయాణాలు కొందరికి బాగా కలిసొస్తాయి. ఇంటి భద్రత విషయంలో రాజీ పడొద్దు. సాయంత్రంలోగా గుడ్ న్యూస్ వింటారు. రోజంతా సంతోషంగా ఉంటారు.
Also Read: పంచభూత శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి- శివరాత్రి సందర్భంగా ప్లాన్ చేసుకుంటున్నారా!
నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)
ఈ తేదీల్లో జన్మించిన వారు ఫిట్ నెస్ రాజీ పడొద్దు. అవసరం అయిన సమయంలో ఆర్థిక సహాయం పొందుతారు. వృత్తి జీవితంలో కొన్ని సమస్యలన్ని జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి. కుటుంబంలో జరిగే కొన్ని సంఘటనలు నిన్ను ఇబ్బంది పెడతాయి.
నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)
5, 14,23 తేదీల్లో జన్మించినవారికి ఈ రోజు అంతగా కలసిరాదు. లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నవారు కొంత ఇబ్బంది పడతారు. కొన్ని సమస్యలు ఎదురైనా ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. వారసత్వ ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి.
నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)
ఈ తేదీల్లో ఉన్నవ్యక్తులు ఆహారం విషయంలో రాజీ పడకూడదు. ప్రేమ జీవితం తిరిగి ట్రాక్ లో పడుతుంది. మీ జీవితభాగస్వామితో మంచి అవగాహన మీ జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ సమయం మీ కోసం మంగళ యోగాన్ని తీసుకువస్తోంది. సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి.
నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)
ఈ తేదీల్లో పుట్టినవారు...ఈ రోజు ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ సమయానికి పని పూర్తిచేయగలుగుతారు.
Also Read: మీరు చేసే కర్మలకు ఫలితం మీరు ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా!
నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)
ఈ తేదీల్లో పుట్టినవారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొనుగోలు చేయాలి అనుకున్న వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం మెరుగుపర్చుకునేందుకు శ్రద్ధ వహించాలి. బంధువులను కలుస్తారు. నూతన ఉద్యోగం కోసం వెతుకుతున్నవారి కల ఫలిస్తుంది.
నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)
9,18,27 తేదీల్లో జన్మించిన వ్యక్తులు ఆస్తిని కొనుగోలు చేయాలనే ఆలోచన ఈ రోజు మరో అడుగు ముందుకుపడుతుంది. వ్యాపారులు నూతన ఒప్పందాలు కుదుర్చుకోవద్దు. నూతన నిర్ణయాలు తీసుకునేముందు మరోసారి ఆలోచించడం మంచిది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు.
Also Read: మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో మీ రాశి చెప్పేస్తుంది!