Astrology Predictions by Numbers


నంబర్ 1 (పుట్టిన తేదీలు 1, 10, 19, 28)


ఈ తేదీల్లో జన్మించినవారికి ఈ రోజు విజయాలతో నిండి ఉంటుంది. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. కొత్త పథకాలపై పెట్టుబడులు పెట్టేందుకు ఇది మంచి సమయం. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుడైన వ్యక్తిని తప్పకుండా సంప్రదించాలి. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం దెబ్బతింటుంది. మానసిక ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.


నంబర్ 2 (పుట్టిన తేదీలు 2, 11, 20,29)


ఈ రోజంతా మీరు బిజీగా ఉంటారు. మీరు పనిచేసే రంగంలో అదనపు పనిభారం ఉంటుంది. కొత్త పథకాలపై పని ప్రారంభించాలనుకుంటే, అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించండి. అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందే అవకాశం ఉంది. వాహనాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.


నంబర్ 3 (పుట్టిన తేదీలు 3, 12, 21, 30)


ఈ రోజు మీ రోజు సాధారణంగా ఉంటుంది. కార్యాలయంలో, వ్యాపారంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ అనుకున్న పనులు పూర్తవుతాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు వస్తాయి. పోటీ వాతావరణానికి దూరంగా ఉండాలి. ఇంటికి అతిథుల రాక ఉండొచ్చు.


Also Read: వాయు, అగ్ని, నీరు, భూమి - మీ రాశి దేనికి సంకేతం!


నంబర్ 4 (పుట్టిన తేదీలు 4, 13, 22, 31)


ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగులైనా, వ్యాపారులైనా కష్టపడితేనే తగిన ఫలితం పొందుతారు. మనసులో ఏదో చింత ఫీలింగ్ ఉంటుంది. అవకాశాలు వస్తాయి కానీ పోటీ పరిస్థితులకు దూరంగా ఉంటారు. కోపం తగ్గించుకుంటే మంచిది. సంయమనంతో వ్యవహరించండి. మీరు తలపెట్టే పనులకు కుటంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.


నంబర్ 5 (పుట్టిన తేదీలు 5, 14, 23)


ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులుంటాయి. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు అనుకూల సమయం ఇది. సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకునే అవకాశం ఉంటుంది. మీ ప్రవర్తనలో సౌమ్యతను కాపాడుకోండి. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.


నంబర్ 6 (పుట్టిన తేదీలు 6, 15, 24)


ఈ తేదీల్లో జన్మించిన వారు ఈ రోజు అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రణాళికలు ఈ రోజు అమలు చేయవద్దు. వివాద పరిస్థితులకు దూరంగా ఉండాలి. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. వాతావరణంలో మార్పుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. వాహనాన్ని వినియోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.


Also Read: ఈ వారం ఈ రాశులవారి జీవితంలో కొత్త వెలుగు, ఆగష్టు 07 నుంచి 13 వారఫలాలు


నంబర్ 7 (పుట్టిన తేదీలు 7, 16, 25)


ఈ తేదీల్లో పుట్టినవారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. కార్యాలయంలో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులకు సంబంధించి ఇప్పటికే ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. 


నంబర్ 8 (పుట్టిన తేదీలు 8, 17,26)


ఈ రోజు మీరు సానుకూలంగా ఆలోచిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం ఉంటుంది. కుటుంబంలో - చేసే వృత్తిలో రెండింటిలోనూ బాధ్యతలు పెరుగుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.


నంబర్ 9 (పుట్టిన తేదీలు 9, 18,27)


ఈ రోజు పెట్టే నూతన పెట్టుబడులు మీకు బాగానే కలిసొస్తాయి. రోజంతా సంతోంగా ఉంటారు. కుటుంబానికి పూర్తి సమయం కేటాయిస్తారు.  వ్యాపారం బాగానే సాగుతుంది. ఉద్యోగులు పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంతో కలసి విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటారు.