Numerology: ఆకాశంలో సంచరిస్తున్న గ్రహాలకు..ఒకటి మొదలు తొమ్మిది వరకున్న సంక్యలకు సంబంధం ఉందని గుర్తించి ప్రతి గ్రహానికి సంబంధించి ఓ సంఖ్యను నిర్ణయించారు. ఇలా నిర్ణయించిన వారిలో చల్జియా అనే దేశస్థులు, గ్రీస్ దేశస్థులూ అగ్రగణ్యులు. గ్రీస్ దేశానికి చెందిన పైథాగరస్ ఈ సంఖ్యాశాస్త్రాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా నియమబద్ధంగా చేసి మానవ జీవితానికి పనికొచ్చేలా ఈ శాస్త్రాన్ని ( న్యూమరాలజీని) ప్రచారంలోకి తీసుకొచ్చారు.


ప్రపంచంలో 1 మొదలు కోట్ల వరకూ ఎన్నో సంఖ్యలున్నా అవన్నీ తొమ్మిది సంఖ్య లోపే క్లోజ్ అయిపోతాయి. పూజ్యం..అంటే సున్నా..దీనికి ప్రత్యేకమైన విలువలేదు కానీ మిగిలిన సంఖ్యలతో కలిస్తేనే దీనికి విలువ. అందుకే పది మొదలు మిగిలిన సంఖ్యలు ఉపయోగించినప్పుడే పూజ్యానికి విలువ ఉంటుంది. ఒకటి నుంచి తొమ్మిది వరకున్న ఆధార సంఖ్యలను మాత్రమే న్యూమరాలజీలో పెట్టుకోవడం వెనుక కారణం ఉంది. దీనికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో సంబంధం ఉంది.  



  • 12 రాశులు, తొమ్మిది గ్రహాలు, 27 నక్షత్రాలు... ఈ మూడింటిని ఆధారంగా తీసుకుని జ్యోతిష్యశాస్త్రం నడుస్తోంది

  • 12 రాశుల్లో 27 నక్షత్రాలు ఇముడుతాయి

  • ఒక్కో రాశికి రెండుంపావ్ నక్షత్రాలు

  • ఒక్కో నక్షత్రానికి నాలుగు పాదాలు..అంటే ఒక రాశిలో తొమ్మిది పాదాలుంటాయి

  • 12 రాశులకు కలపి 108 పాదాలుంటాయి 



  • 27 నక్షత్రాలంటే 2+7=9

  • 108 పాదాలంటే 1+0+8= 9

  • డిగ్రీలు లెక్క చూసుకున్నా ఓ రాశికి 30 డిగ్రీల వంతున 12 రాశులకు 360 డిగ్రీలు.. వీటి ఆధార సంఖ్య 3+6+0=9

  • ఈ డిగ్రీలను మినిట్స్ గా మార్చినా 21,600 వస్తుంది...2+1+6+0+0=9 


అందుకే గ్రహాలను, రాశులను, నక్షత్రాలను ఆధారంగా చేసుకుని భవిష్యత్ చెప్పేందుకు జ్యోతిష్య శాస్త్రంలో ఒకటి నుంచి తొమ్మిది వరకూ ఉన్న సంఖ్యలే ప్రధానంగా తీసుకుంటారు. 


Also Read: కన్యారాశిలో బుధుడు తిరోగమనం - ఈ 3 రాశులవారూ జాగ్రత్త, ఆ 4 రాశులవారికి అంతా శుభమే


ఆధార సంఖ్యలు మూడు రకాలు
సంఖ్యాశాస్త్రంలో మూడు రకాలైన ఆధార సంఖ్యల ఆధారంగా ఫలితాలు చెబుతారు.
1. పుట్టిన తేదీ సంఖ్య
2. పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తం  సమిష్టి సంఖ్యలు
3. ఒకరి పేరులో ఉన్న అక్షరాలకున్న విలువల సమిష్టి సంఖ్య...
అయితే భవిష్యత్ చెప్పడానికి పుట్టిన తేదీ మాత్రమే చాలంటారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. ఈ తేదీ ఆధారంగా వచ్చే ఫలితాల్లో ఏమైనా మార్పులున్నాయి అనిపిస్తే మీరు పుట్టిన తేదీ, నెల, సంవత్సరం మొత్తాన్ని కలిపే ఆధార సంఖ్య ఆధారంగా ఫలితాలు చూసుకుంటే సరిపోతుంది. 


తర్వాతి కథనాల్లో న్యూమరాలజీ ప్రకారం 1 నుంచి 9 వరకూ జన్మించిన వారి గుణగణాలు, ఆర్థిక పరిస్థితి, వైవాహిక జీవితం , ఆరోగ్యం గురించి తెలుసుకుందాం..


Also Read: కన్యారాశిలోకి సూర్యుడు, ఈ నాలుగు రాశులవారికి మామూలుగా లేదు!


నోట్: కొన్ని పుస్తకాల్లో చదివినవి, కొందరు పండితులు చెప్పిన వివరాలు ఆధారంగా రాసిన కథనం ఇది. దీనిని ఎంతవరకూ విశ్వసించాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం....