ఇండియన్ ఆర్మీ ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల దరఖాస్తు గడువు సెప్టెంబరు 15తో ముగియనుంది. వీటికి మహిళలు సహా అవివాహిత గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభ చూపితే శిక్షణలోకి తీసుకుంటారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నవారిని లెఫ్టినెంట్ హోదాతో విధుల్లో చేర్చుకుంటారు. ఆకర్షణీయ వేతనాలు, ప్రోత్సాహకాలు అందిస్తారు. ఎన్‌సీసీలో చేరినవారిని ఆర్మీ ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. పలు నియామక ప్రకటనల్లో కొన్ని పోస్టులను వారి కోసమే కేటాయిస్త్తోంది. అలాగే ఏడాదికి రెండుసార్లు షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టుల భర్తీకి ప్రకటనలు విడుదల చేస్తోంది. డిగ్రీతోపాటు ఎన్సీసీ అర్హత ఉన్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. 



వివరాలు..
* NCC స్పెషల్ ఎంట్రీ


మొత్తం ఖాళీలు: 55. 


పోస్టుల కేటాయింపు:
పురుషులు-50, మహిళలు-05. ఈ రెండు విభాగాల్లోనూ 6 పోస్టులు (పురుషులు 5, మహిళలు 1) యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు దక్కుతాయి.

అర్హత:
కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు 01.04.2023 నాటికి డిగ్రీ పూర్తిచేయాలి. అలాగే మూడు అకడమిక్ సంవత్సరాలు 50  సీనియర్ డివిజన్ వింగ్లో కొనసాగి ఉండాలి. NCC-సి సర్టిఫికెట్‌లో కనీసం 'బి' గ్రేడ్ పొంది ఉండాలి. యుద్ధంలో మరణించిన ఆర్మీ ఉద్యోగుల పిల్లలకు ఎన్‌సీసీ-సి సర్టిఫికెట్ అవసరం లేదు.

వయోపరిమితి:
01.01.2023 నాటికి 19 నుంచి 25 సంవత్సరాలలోపు ఉండాలి. 02.01.1998 - 01.01..2004 మధ్య జన్మించినవారు దరఖాస్తుకు అర్హులు.

దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అభ్యర్థులు పొందిన అకడమిక్ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి సెలక్షన్ కేంద్రాల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దక్షిణాదివారికి బెంగళూరులో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సైకాలజిస్ట్, గ్రూప్ టెస్టింగ్ ఆఫీసర్, ఇంటర్వ్యూ ఆఫీసర్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తారు. ఇవి రెండు దశల్లో 5 రోజుల పాటు కొనసాగుతాయి. తొలిరోజు స్టేజ్-1లో ఉత్తీర్ణులు మాత్రమే తర్వాతి 4 రోజులు నిర్వహించే స్టేజ్-2 ఇంటర్వ్యూలో కొనసాగుతారు. ఇందులో విజయవంతమైనవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, శిక్షణలోకి తీసుకుంటారు.

శిక్షణ, వేతనం ఇలా...

ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ విధానంలో ఎంపికైనవారికి ఏప్రిల్, 2023 నుంచి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడెమీ, చెన్నైలో 49 వారాల శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ డిగ్రీని మద్రాస్ యూనివర్సిటీ ప్రదానం చేస్తుంది. అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. ఇలా చేరినవారు పదేళ్లపాటు ఉద్యోగంలో కొనసాగవచ్చు. 

వ్యవధి పూర్తయిన తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల ఆసక్తుల ప్రకారం కొందరిని శాశ్వత ఉద్యోగం (పర్మనెంట్ కమిషన్) కిందికి తీసుకుంటారు. మిగిలినవారికి మరో నాలుగేళ్లపాటు సర్వీస్ పొడిగిస్తారు. ఆ తర్వాత వీరు వైదొలగాల్సి ఉంటుంది. లెఫ్టినెంట్‌ హోదాలో విధుల్లో చేరినవారు రెండేళ్ల అనుభవంతో కెప్టెన్, ఆరేళ్ల సేవలతో మేజర్, 13 ఏళ్లు కొనసాగితే లెఫ్టినెంట్ కల్నల్ హోదాలకు చేరుకోవచ్చు. వీరికి రూ.56,100 మూలవేతనంతోపాటు మిలట్రీ సర్వీస్ పే, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు అందుతాయి. తొలి నెల నుంచే రూ.లక్షకు పైగా వేతనంగా అందుకోవచ్చు. ఎన్నో ప్రోత్సాహకాలు పొందవచ్చు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు:
సెప్టెంబరు 15 మధ్యాహ్నం 3 వరకు. 

NCC (Spl) Entry-53 Notification


Online Application

Website

Also Read:
తెలంగాణలో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాలు - డిప్లొమా, బీటెక్ అర్హత!
తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్‌సీ) నుంచి మ‌రో నోటిఫికేష‌న్ వెలువడింది. వివిధ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్  పోస్టుల భ‌ర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సంబంధిత విభాగాల్లో ఇంజినీరింగ్ డిగ్రీ/డిప్లొమా అర్హత ఉన్నవారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సెప్టెంబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఖాళీల భర్తీకి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ సెప్టెంబరు 23 నుంచి అందుబాటులో ఉండనుంది. 
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..

Also Read:
తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1569 ఉద్యోగాలు, జిల్లాలవారీగా ఖాళీల వివరాలు!
తెలంగాణ జిల్లాల్లోని బస్తీ, పల్లె దవాఖానాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ అర్హత కలిగిన వైద్యులను పరిగణనలోకి తీసుకుంటారు. ఎంబీబీఎస్ అర్హత కలిగిన వారికి మొదట ప్రాధాన్యం ఇస్తారు.

ఈ పోస్టులో పనిచేయడానికి ఎంబీబీఎస్/బీఏఎమ్ఎస్ వైద్యులు రాకుంటే.. 2020 తర్వాత ఉత్తీర్ణత సాధించిన బీఎస్సీ నర్సింగ్‌ పట్టభద్రులు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్/జీఎన్ఎంలో ఉత్తీర్ణులై, కమ్యూనిటీ హెల్త్‌లో 6 నెలల బ్రిడ్జ్  ప్రోగ్రాం పూర్తిచేసిన వారిని తీసుకుంటారు. సరైన అర్హతలు, ఆసక్తి గల అభ్యర్ధులు సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను సంబంధిత జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయం, చిరునామాకు పంపాల్సి ఉంటుంది. ఆయా జిల్లాల వెబ్‌సైట్‌లో వేర్వేరుగా నోటిఫికేషన్, దరఖాస్తులు అందుబాటులో ఉంచారు. 
నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...