Mercury Transit Leo in september 1st to september 23rd: అన్ని గ్రహాలకన్నా త్వరగా రాశి పరివర్తనం చెందే గ్రహం బుధుడు. మిగిలిన గ్రహాలన్నీ దాదాపు నెల రోజుల పాటూ ఒక్కో రాశిలో ఉంటాయి.. ఆ తర్వాత రాశి పరవర్తనం చెందుతాయి. కానీ గ్రహాల రాకుమారుడిగా చెప్పే బుధుడు నెలరోజుల పాటూ ఓ రాశిలో ఉండడం అరుదు. ఒక్కోసారి మూడు వారాలకు , రెండు వారాలకు...ఇంకోసారి పది రోజులకే రాశి పరివర్తనం చెందుతాడు.
జూలై 20న సింహరాశిలో ప్రవేశించిన బుధుడు.. జూలై 31న వక్రంలో ప్రయాణించి కర్కాటక రాశిలోకి చేరాడు. ఆగష్టు 11 వరకూ కర్కాటకంలో ఉంటూ మళ్లీ ఇదే రాశిలో వక్రంలో ఆగష్టు 22 వరకూ ఉన్నాడు...మళ్లీ ఓ వారం రోజులు కర్కాటకరాశిలో సంచరించి...సెప్టెంబరు 1న తిరిగి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. 3 వారాల పాటూ సింహరాశిలోని బుధుడి సంచారం ఉంటుంది. మళ్లీ సెప్టెంబరు 23న కన్యారాశిలోకి అడుగుపెడతాడు.
Also Read: అమ్మవారి యోనిభాగం పడిన ప్రదేశం - కామాఖ్యా దేవి ఆలయం గురించి ఈ విషయాలు తెలుసా!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఒక్కో రాశిలో కొద్దిరోజులు మాత్రమే ఉండే బుధుడు..ఆ ప్రభావం మాత్రం తీవ్రంగానే చూపిస్తాడు. అది అనుకూల ప్రభావం, ప్రతికూల ప్రభావం,మిశ్రమ ప్రభావం...ఏదైనా కావొచ్చు. బుధుడు సింహ రాశిలో ప్రవేశించే సమయానికి సూర్యుడు ఇదే రాశిలో ఉంటాడు...ఈ సందర్భంగా సింహం, ధనస్సు, తులా రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది...ఆర్థికంగా లాభపడతారు.
సింహ రాశి (Leo)
బుధుడి రాశి పరివర్తనం చెందేది సింహ రాశిలోనే కావడంతో ఈ మూడు వారాల పాటూ మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. గత కొన్నాళ్లుగా వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగం, వ్యాపారం, వృత్తిలో మీరు ఊహించని వృద్ధి ఉంటుంది. ఆర్థికంగా మీ పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఈ సమయంలో కుటుంబానికి సమయం కేటాయించడం ద్వారా కొన్నాళ్లుగా వెంటాడుతున్న చాలా సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
సింహ రాశిలో బుధుడి సంచారం ధనస్సు రాశివారికి బాగా కలిసొస్తుంది. వ్యాపారంలో గత కొన్నాళ్లుగా ఉండే అడ్డంకులు అనూహ్యంగా తొలగిపోతాయి..గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఉద్యోగులకు శుభసమయం. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థిక పరిస్థితి మీరు ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది.
Also Read: శ్రీ కృష్ణ జన్మాష్టమి 2024 ఆగష్టు 26 or 27 - ఎప్పుడు జరుపుకోవాలి!
తులా రాశి (Libra)
తులా రాశివారికి సెప్టెంబరు నెల అద్భుతంగా ఉంటుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన డబ్బు చేతికందుతుంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలు పెరుగుతాయి. భవిష్యత్ కోసం మంచి ప్రణాళికలు వేసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది. ఆదాయం మెరుగుపడుతుంది. ఉద్యోగులు, విద్యార్థులకు కలిసొచ్చే సమయం.
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: ఆగష్టు 21 రాశిఫలాలు - ఈ రాశివారు మాటతీరు, ప్రవర్తన మార్చుకోవాల్సిన సమయం ఇది!