Mercury Transit in Capricorn 2023 : ధనస్సు నుంచి మకరంలోకి బుధుడు, ఈ మూడు రాశులకు మినహా అందరికీ బావుంది

Budh Gochar 2023: ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Continues below advertisement

Mercury Transit in Capricorn 2023 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాల సంచారం ప్రతి జాతకుడిపైనా ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి. ప్రతి గ్రహం రాశిమారినప్పుడల్లా ప్రభావం మారుతుంది. 2023 ఫిబ్రవరి 7న బుధుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఫిబ్రవరి 27 వరకూ మకరంలోనే ఉంటాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని రాకుమారుడిగా చెబుతారు. మరి బుధుడు మకరరాశిలో సంచరించడం వల్ల ఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం..

Continues below advertisement

మేష రాశి
మేష రాశి వారికి ఈ సంచారం ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. బుధుడు మీ భావనా సామర్థ్యాన్ని కూడా అభివృద్ధి చేస్తాడు. ఈ సమయంలో మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధించవచ్చు.

వృషభ రాశి
బుధుడి సంచారం వృషభ రాశి వారికి కూడా మేలు చేస్తుంది. ఈ సమయంలో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది య కుటుంబాన్ని చూసి మీరు సంతోషంగా ఉంటారు.  ఈ రాశివారి తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

మిథున రాశి
మకర రాశిలో బుధుడి సంచారం మిథునరాశివారికి కూడా శుభప్రదంగా ఉంది. ఈ సమయంలో మీ జీవితంలో మంచి విషయాలు జరుగుతాయి. మీరు మీ భాగస్వామితో మృదువుగా మాట్లాడతారు. సంతోషంగా ఉంటారు.

Also Read:  వారాహి అంటే ఏవరు , ఎందుకంత పవర్ ఫుల్ - పవన్ తన వాహనానికి ఆ పేరెందుకు పెట్టారు!

కర్కాటకరాశి
బుధుడి సంచారం కర్కాటక రాశివారికి మాత్రం పనిలో ఒత్తిడి పెంచుతుంది. కొన్ని పనుల్లో అనుకోని జాప్యం ఇబ్బంది పెడుతుంది. కష్టపడి పనిచేసినా ఫలితం ఆ స్థాయిలో అందుకోలేరు. ఖర్చులు చేసేటప్పుడు జాగ్రత్తపడాలి.. ధననష్టం జరిగే ఆస్కారం ఉంది జాగ్రత్త పడండి. ఎవ్వరికీ అప్పులు ఇవ్వొద్దు

సింహ రాశి
మకర రాశిలో బుధుడి సంచారం సింహరాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. వినోద, వ్యాపార రంగాలవారి పురోగతికి అనుకూలంగా ఉంటుంది. మీ ప్రయత్నాలు ప్రయోజనాన్నిస్తాయి.

కన్యా రాశి
కన్యా రాశివారికి బుధుడు మకరరాశిలో సంచారం ఆర్థిక సమస్యలను తీరుస్తుంది. వైవాహిక జీవితంలో, ప్రేమ జీవితంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ శ్రేయోభిలాషులు మీకు మద్దతిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి.

తులా రాశి
తులా రాశి వారికి బుధుడి సంచారం మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఒడిదొడుకులుంటాయి. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ తెలివితేటలకు, నైపుణ్యానికి ప్రశంసలు లభిస్తాయి. 

వృశ్చిక రాశి 
బుధుడి సంచారం సమయంలో మీ ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బలంగా మారుతుంది. మీ బాధ్యతలను సులభంగా పూర్తిచేయగలుగుతారు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు రాశి
మీరు చేసిన మంచి పనికి ప్రశంసలు లభిస్తాయి. మీ వంతు కృషి చేస్తూ ఉండండి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, రీజనింగ్ పవర్ పెరుగుతుంది. బుధుడి సంచారం ఉద్యోగులు, వ్యాపారులకు మంచిది

Also Read: జనవరి 26 వసంత పంచమి, సరస్వతీ కటాక్షం కోసం ఈ శ్లోకాలు పిల్లలకు నేర్పించండి
 
మకర రాశి
బుధుడు మీ రాశిలోనే సంచరిస్తున్నందున మీకు అద్భుతంగా ఉంది. మనోధైర్యం పెరుగుతుంది.ప్రత్యర్థులను ఎదుర్కొనే ధైర్యాన్ని పొందుతారు.  చాలా ఆత్మవిశ్వాసంతో , వినయంగా ఉంటారు. 

కుంభ రాశి
మకరంలో బుధుడు సంచరిస్తున్న సమయంలో మీ వ్యక్తిగత జీవితం అద్భుతంగా ఉంటుంది.ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు బాధిస్తాయి 

మీన రాశి
బుదుడి సంచారం మీనరాశివారికి మంచి చేస్తుంది. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం, ఉద్యోగులు ఉన్నత ఉద్యోగం పొందే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకోవడం మంచిదేకానీ..అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. చేయాలనుకున్న పనిని ఆత్మవిశ్వాసంతో చేయండి.

Continues below advertisement