Basant Panchami 2023: ఈ ఏడాది (2023) వసంత పంచమి జనవరి 26 గురువారం వచ్చింది. ఈ రోజునే బాసరలో వ్యాసమహర్షి ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించాడని చెబుతారు. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం చేస్తే వారు ఉన్నత విద్యావంతులు అవుతారని విశ్వాసం. మిగిలిన విద్యార్థులంతా శ్రీ పంచమిరోజు అమ్మవారిని ఈ శ్లోకాలతో పూజిస్తే మంచిది..
‘శ్రీం హ్రీం సర్వస్వత్యాయ స్వాహ
ఐం హ్రీం, ఐంగ్ హ్రీం సరస్వత్యాయ నమ:’
ఈ మంత్రాన్ని రోజుకు 11 సార్లు జపిస్తే తెలివితేటలు వృద్ధి చెందుతాయి
చిన్న పిల్లలకు నేర్పించాల్సిన సరస్వతి బీజ మంత్రం
‘ఐంగ్ ఓం ఐంగ్ నమ:, ఐం ఐంగ్ క్లీం సౌహ’
ప్రణోదేవీ సరస్వతీ
వాజేభిర్వాజినీ వతీ ధీనామ విత్ర్యవతు
సరస్వతీ శ్లోకం
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభ్రుతిభిర్దేవై సదావందితా
సా మాంపాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహా
Also Read: కోణార్క్, అరసవెల్లి మాత్రమేకాదు - గుజరాత్ లో ఉన్న ప్రముఖ సూర్య దేవాలయం గురించి తెలుసా!
పోతన చెప్పిన శ్లోకం
తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్
నీవునా యుల్లంబందున నిల్చి జ్రుంభణముగా సూక్తుల్
సుశబ్దంబుశోభిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రతిన్
జగన్మోహినీ పుల్లాభాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా....
సరస్వతీ దేవి ద్వాదశనామ స్తోత్రం
సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ
హంసవాహన సమాయుక్తా విద్యాదానకరీ మమ
ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనీ
పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ
నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ!!
Also Read: జ్ఞానమే ఆమె ఖడ్గం, సంగీతమే ఆమె సాధనం, ప్రశాంతతే ఆమె వ్యక్తిత్వం - వసంత పంచమి ప్రత్యేకత
సరస్వతీ దేవి ధ్యానశ్లోకం
శరదిందు వికాస మందహాసాం
స్ఫుర దిందీ వర లోచనాభి రామమ్|
అరవింద సమాన సుందరాస్యాం
అరవిందాసన సుందరీ ముపాసే ||
సరస్వతీ దశ శ్లోకీ స్తుతిః
ధ్యానం :
నీహార ఘన సార సుధాకరాభ్యాం
కల్యాణదాం కనక చంపక దామ భూషామ్|
ఉత్తుంగ పీన కుచ కుంభ మనోహరామ్గీం
వాణీం నమామి మనసా వచసాం విభూత్యై||
యా వేదాన్తార్థ తత్వైక స్వరూపా పరమార్థతః|
నామ రూపాత్మనా వ్యక్తా సా మాం పాతు సరస్వతీ||
యాసాం గోపాంగవేదేషు చతృష్వేకైవ గీయతే |
అద్వైతా బ్రాహ్మణ శ్శక్తిః సా మాం పాతు సరస్వతీ||
యా వర్ణ పద వాక్యార్థ స్వరూపెణైవ వర్తతే |
అనాది నిధనానన్తా సా మాం పాతు సరస్వతీ||
అధ్యాత్మ మధి దైవం చ దేవానాం సమ్యగీశ్వరీ|
ప్రత్యగాస్తే వదన్తీ యా సా మాం పాతు సరస్వతీ||
అన్తర్యామ్యాత్మనా విశ్వం త్రైలోక్యం యా నియచ్ఛతి|
రుద్రాదిత్యాది రూపస్థా యస్యా మావేశ్యతాం పునః |
ధ్యాయన్తి సర్వరూపైకా సా మాం పాతు సరస్వతీ||
యా ప్రత్య గ్దృష్టిభి ర్జీవైః వ్యజ్యమానాను భూయతే |
వ్యాపినీ జ్ఞప్తిరూపైకా సా మాం పాతు సరస్వతీ||
నామ జాత్యాదిభి ర్భేదైః అష్టదా యా వికల్పితా|
నిర్వికల్పాత్మనా వ్యక్తా సా మాం పాతు సరస్వతీ||
వ్యక్తావ్యక్తగిరః సర్వే వేదాద్యా వ్యాహరన్తి యామ్|
సర్వకామదుఘా ధేనుః సా మాం పాతు సరస్వతీ||
యాం విదిత్వాఖిలం బంధం నిర్మధ్యాఖిలవత్మనా|
యోగీ యాతి పరం స్థానం సా మాం పాతు సరస్వతీ||
నామ రూపాత్మకం సర్వం యస్యా మావేశ్యతాం పునః|
ధ్యాయన్తి బ్రహ్మరూపైకా సా మాం పాతు సరస్వతీ||
ఆర్థిక సమస్యలతో చదువుకోలేకపోతున్న పిల్లలకు సహాయపడటం, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చేయడం వల్ల చదువుల తల్లి కరుణ ఉంటుందని చెబుతారు.
ఓం వాగ్దేవ్యైచ విద్మహే....బ్రహ్మపత్న్యైచ
ధీమహీ...తన్నో వాణీ ప్రచోదయాత్............